న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఊహించిన దానికన్నా వేగంగా కోలుకున్న నేయ్మార్

Neymar fitter than Brazil expected ahead of World Cup

హైదరాబాద్: ఎలాగైనా రష్యాలో జరిగే వరల్డ్ కప్ టైటిల్ ఎగరేసుకు వెళ్లాలని కలలు కంటున్న బ్రెజిల్ జట్టుకు ప్రధాన ప్లేయర్ నేయ్మార్ ఊహించిన దానికన్నా బాగా గాయం నుంచి కోలుకున్నాడు. పారిస్ సెయింట్ జెర్మైన్ ఫార్వర్డ్ ప్లేయర్ అయిన నేయ్మార్ తన పాదంలో ఎముకకైన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకుని ఫిబ్రవరి నుంచి ఇంటికి పరిమితమయ్యాడు.

నేయ్మార్ రష్యాలో జరిగే సాకర్ సంరంభంలో పాల్గొంటాడా? లేదా? అన్న విషయమై ప్రారంభ దశలో వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఆడేందుకు అనుమాన మేఘాలు వీచేవి. కానీ అంతా ఊహించిన దానికన్నా ప్రత్యేకించి బ్రెజిల్ మేనేజ్మెంట్ అంచనా వేసిన దానికన్నా త్వరగా నేయ్మార్ గాయం నుంచి కోలుకున్నాడు.

Neymar fitter than Brazil expected ahead of World Cup

రష్యాలో జరిగే సాకర్ సంరంభానికి నేయ్మార్ సన్నద్ధంగా ఉన్నాడని రెండు రోజుల క్రితం బ్రెజిల్ ఫిట్ నెస్ కోచ్ ఫాబియో మాహ్సెరెడ్జియాన్ తెలిపారు. నేయ్మార్ స్వయంగా కోలుకున్నాడని, ఏ మేరకు కోలుకున్నాడని చెప్పడం కష్ట సాధ్యం అని పేర్కొన్నాడు. 'ఒక అసాధారణమైన అథ్లెట్ ఎలా కోలుకుంటారో చెప్పలేం' అని బ్రెజిల్ ఫిట్ నెస్ కోచ్ ఫాబియో మాహ్సెరెడ్జియాన్ చెప్పాడు.

నేయ్మార్ కోలుకోవడంతో బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్యకు ఆనంద సమయం, జువెంటస్ వింగర్ డౌగ్లాస్ కోస్టాకు కష్టకాలమని తెలిపాడు. బ్రెజిల్ టీం డాక్టర్ రోడ్రిగ లాస్మర్ మాట్లాడుతూ నేయ్మార్, ఫాగ్నర్‌లకు అసాధారణ పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపాడు. జువెంటస్ తరఫున ఆడుతున్న చివరి మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడుతున్నానని డౌగ్లాస్ కోస్టా చెప్పాడు. కొద్ది రోజుల పాటు మ్యాచ్‌లకు డౌగ్లాస్ కోస్టా దూరంగా ఉంటాడు. అన్‌ఫీల్డ్‌లో జూన్ మూడో తేదీన క్రొయేషియాతో జరిగే వార్మప్ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టు తలపడనున్నది.

Story first published: Saturday, May 26, 2018, 12:21 [IST]
Other articles published on May 26, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X