న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

బీబీసీ ఆఫ్రికన్ ఫుట్‌బాలర్ 2017 అవార్డు గెలుచుకున్న మొహమ్మద్ సలాహ్

Mohamed Salah wins BBC African Footballer of the Year 2017

హైదరాబాద్: లివర్‌పూల్ జట్టు ప్రధాన ఆటగాడు మొహమ్మద్ సలాహ్ కల సాకారమైంది. 2017 సంవత్సరానికి గాను 25 ఏళ్ల సలాహ్ బీబీసీ ఆఫ్రికన్ ఫుట్‌బాలర్ అవార్డును అందుకున్నాడు.

నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా గెలిచినపుడు వచ్చే భావన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం చాలా బాగా గడిచిందని అవార్డు సాక్షమిస్తోంది. నేను వచ్చే ఏడాది కూడా అవార్డు గెలుచుకునేందుకు కష్టపడతాను. నేనెప్పుడూ ఒకరి స్టైల్ ఫాలో అవను. నేనే కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తుంటా. నన్ను ఈజిప్షియన్లు అందరూ అనుకరించాలని తాపత్రయపడుతుంటా. నా వల్ల అయినంత వరకు 100 శాతం కృషిని ఆటపైనే చూపిస్తుంటా. అని అవార్డు గెలచుకున్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైయ్యాడు.

మొట్ట మొదటి సారి ఒక ఈజిప్షియన్ ఈ అవార్డుకు ఎంపికకై సలాహ్ ఓ చరిత్ర సృష్టించాడు. ఇతనితో పాటుగా మరి కొందరు ఆటగాళ్ల పేర్లు ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యాయి. వారు గాబన్స్ పియర్రె ఎమ్రిక్ అబమెయాంగ్, గినెన్, లివర్ పూల్ జట్టు కు చెందిన నాబి కీటా, సాడియో మానె, నైజీరియాకు చెందిన విక్టర్ మాసెస్.

సలాహ్ లివర్‌పూల్ జట్టులో 39మిలియన్ డాలర్ల ఒప్పందంతో గడిచిన వేసవిలోనే చేరాడు. ఈ కొంతకాలంలోనే జట్టులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 25ఏళ్ల ఆడిన 25మ్యాచ్‌ల్లో 19గోల్‌లు చేయగలిగాడు. ఛాంపియన్ లీగ్‌లో ఆరు , ప్రీమియర్ లీగ్‌లలో 13 పాయింట్లు సాధించి ప్రస్తుత టాప్‌గా ఉన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 12, 2017, 14:54 [IST]
Other articles published on Dec 12, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X