న్యూ క్యాస్టిల్ లక్ష్యం టాప్ టెన్.. తేల్చి చెప్పిన డియామె

Posted By:
Mo Diame wants Newcastle United to secure top 10 finish this season

లండన్: ప్రస్తుత సీజన్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో జట్టును 'టాప్ 10'లో నిలిపేందుకు పూనుకోవాలని టీమ్ సభ్యులకు న్యూ క్యాస్టిల్ మిడ్ ఫీల్డర్ మహ్మద్ డియామె హెచ్చరించారు. దీనివల్ల మాగ్ పైస్ (న్యూ కాస్టిల్) జట్టు టాప్‌లో చేరకుంటుందని జట్టు సభ్యులకు సూచించాడు. కనుక సీజన్ ముగిసే వరకు ప్రత్యర్థి జట్లకు ఎటువంటి అవకాశాలు ఇవ్వవద్దని హితవు చెప్పారు.

ఇటీవల విజయం:
మార్చి 31వ తేదీన హుడ్డర్స్ ఫీల్డ్ టౌన్‌లో సెయింట్ జేమ్స్ పార్క్‌లో టైనెసైడ్ కబ్ల్‌తో జరిగిన మ్యాచ్‌లో 80వ నిమిషంలో ఆయోజ్ పెరెజ్ చేసిన గోల్ చివరి క్షణంలో విజాయన్ని తెచ్చి పెట్టింది. అంతే కాదు న్యూ క్యాస్టిల్ జట్టు రెలిగేషన్ జోన్‌లోకి వెళ్లకుండా ఈ విజయం నిలువరించింది.

హడర్స్ ఫీల్డ్ జట్టుతో విజయంపై డియామె హర్షం:

హడర్స్ ఫీల్డ్ జట్టుతో విజయంపై డియామె హర్షం:

ఎడీ హోవ్ సారధ్యంలోని చెర్సిస్ జట్టుపై తదుపరి జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే న్యూ క్యాజిల్ జట్టు సునాయాసంగా టాప్ 10లోకి దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో హడర్స్ ఫీల్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడంపై డియామె హర్షం వ్యక్తం చేశాడు. 2017/18 సీజన్ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌ టోర్నీలో సాధ్యమైనంత మేరకు జట్టును అగ్రస్థానంలో నిలపాలన్నదే తన కోరిక అని డియామె పేర్కొన్నాడు.

 రెండు పాయింట్లతో 10వ ర్యాంక్ వద్ద బౌర్న్ మౌత్:

రెండు పాయింట్లతో 10వ ర్యాంక్ వద్ద బౌర్న్ మౌత్:

రాఫెల్ బెనిటెజ్ కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న న్యూ క్యాజిల్ జట్టు 31 గేమ్స్‌ల్లో 35 పాయింట్లను సంపాదించుకుంది. దీంతో 12వ ర్యాంక్ వద్ద నిలిచింది. పాయింట్ల ఆధారంగా.. సౌతాంప్టన్, న్యూ క్యాజిల్ కంటే ఎక్కువ స్థాయిలోనే ఉన్న బౌర్న్ మౌత్ 10వ ర్యాంక్‌తో స్థిర పడింది.

 తొలగిస్తారనే భయం రావొద్దన్న డియామె:

తొలగిస్తారనే భయం రావొద్దన్న డియామె:

‘మేం మా జట్టుపై ఉన్న మార్కర్‌ను తొలగించాల్సిన అవసరం ఉంది. కానీ ఒకవేళ మేం 16వ, 17వ ర్యాంక్ వద్దే స్థిర పడితే అప్పుడు మా జట్టు లక్ష్యం మళ్లీ రెలిగేషన్ జోన్ నుంచి బయటపడటం ఎలా అన్నదానిపైనే ఉంటుంది. కానీ మేం అలా కోరుకోవడం లేదు' అని చెప్పాడు.

 జేమ్స్ పార్క్ లక్ష్యంగా డియామె అడుగులు:

జేమ్స్ పార్క్ లక్ష్యంగా డియామె అడుగులు:

‘మేం ప్రస్తుత సీజన్ ముగిసే సరికి మంచి ప్లేస్ లోకి చేరుకుంటేనే సురక్షితం అని భావిస్తున్నాం' అని డియామె అన్నాడు. ప్రస్తుత సీజన్‌తోపాటు వచ్చే సీజన్‌కూ డియామె లక్ష్యాలను నిర్దేశిస్తున్నాడు. సెయింట్ జేమ్స్ పార్క్‌ను తమ న్యూ క్యాస్టిల్ జట్టుకు కంచుకోటగా తీర్చిదిద్దాలని సంకల్పిస్తున్నాడు.

సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల్లో విజయం ముందడుగే:

సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల్లో విజయం ముందడుగే:

‘ఇది (సెయింట్ జేమ్స్ పార్క్ మాకు కోట కావాలి. సొంత గడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఆ దిశగా విజయం సాధించాం. అభిమానులు అద్భుతంగా స్పందిస్తున్నారు. మేం ప్రీమియర్ లీగ్‌లో స్థిరపడాలని కోరుకుంటున్నారు' అని డియామె చెప్పాడు.

తదుపరి భారీ లక్ష్యాల సాధనకు కష్ట పడాలి:

తదుపరి భారీ లక్ష్యాల సాధనకు కష్ట పడాలి:

‘ఇది హడర్స్ ఫీల్డ్ జట్టుపై భారీ విజయం. మేం చాలా సంతోషంగా ఉన్నాం. కానీ అదే ఊపులో ముందడుగు వేయాల్సి ఉంటుంది' అని డియామె పేర్కొన్నారు. ‘మేం సాధ్యమైనంత మేరకు అత్యధిక ర్యాంక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తదుపరి సీజన్‌లో భారీ లక్ష్యాలు సాధించాలంటే ఈ దఫా సాధ్యమైనంత మేరకు టాప్ ర్యాంక్‌లో స్థిర పడాలి' అని డియామె వ్యాఖ్యానించాడు.

Story first published: Tuesday, April 3, 2018, 11:59 [IST]
Other articles published on Apr 3, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి