న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మణిపూర్‌లో ట్రాన్స్‌జెండర్స్‌ ఫుట్‌బాల్ జట్టు!!

Meet India’s first transgender football team

ఇంఫాల్: మణిపూర్‌ రాష్ట్ర ప్రజలు 'యేవ్‌శాంగ్‌' పండుగను అంగరంగ వైభవంగా జరపుకుంటారు. వసంత ఋతువు రాకకు సూచికగా జరపుకునే ఈ పండుగను 'మణిపూర్‌ హోలీ' అని కూడా అంటారు. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో అన్ని వర్గాల, కులాల వారు లింగ బేధం లేకుండా పాల్గొంటారు. యేవ్‌శాంగ్‌ సందర్భంగా అక్కడ వివిధ రకాల క్రీడలు, ఆటల పోటీలు నిర్వహిస్తారు.

రెండు జట్లుగా విడిపోయి

రెండు జట్లుగా విడిపోయి

త్వరలో జరగనున్న యేవ్‌శాంగ్‌ క్రీడల్లో ట్రాన్స్‌జెండర్స్‌ ప్రధాన ఆకర్షణ కానున్నారు. మణిపూర్‌ ప్రజల్లో అత్యధిక ఆదరణ కలిగిన ఫుట్‌బాల్‌ పొటీల్లో వారు పాల్గొననున్నారు. యువజన, ట్రాన్స్‌జెండర్స్‌ సాధికారికతకు కృషి చేస్తోన్న 'యా ఆల్‌' ఎన్జీవో సంస్థ వ్యవస్థాపకులు, పీహెచ్‌డీ విద్యార్థి సదమ్‌ హంజాబమ్‌ ప్రోత్సాహంతో 14 మంది సభ్యులు గల ట్రాన్స్‌జెండర్స్‌ ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనున్నారు. వారు ఆరుగురు జట్టు చొప్పున రెండు జట్లుగా విడిపోయి పోటీ పడనున్నారు.

స్త్రీ, పురుషులతో పోటీ పడేందుకు సిద్ధం

స్త్రీ, పురుషులతో పోటీ పడేందుకు సిద్ధం

స్త్రీ, పురుషుల జట్లతో పోటీ పడేందుకు మణిపూర్‌లోని ట్రాన్స్‌జెండర్స్‌ సిద్ధంగా ఉన్నారు. అయితే అందుకు సమాజం ఆమోదం రావడం లేదు. ఆమోదం పొందేవరకు వారిలో వారు (ట్రాన్స్‌జెండర్స్‌) పోటీ పడడమే మంచిదని పీహెచ్‌డీ విద్యార్థి సదమ్‌ హంజాబమ్ తెలిపారు. ఆయన ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి జాతీయ జట్టును కూడా రూపొందించాడు. సదమ్‌ ట్రాన్స్‌జెండర్స్‌తో 2018, 2019 సంవత్సరాల్లో వరుసగా ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లు నిర్వహించారు. గత మార్చి నెలలో ఇంఫాల్‌లో నిర్వహించిన టోర్నమెంట్‌కు కూడా ప్రజల నుంచి భారీ ఆదరణ లభించింది.

ఇదే మొదటి ఫుట్‌బాల్ జట్టు

ఇదే మొదటి ఫుట్‌బాల్ జట్టు

సదమ్‌ హంజాబమ్ గతంలో ట్రాన్స్‌జెండర్స్‌లను రెండు జట్లుగా విభజించి (పురుషులుగా మారు ఓ జట్టు, స్త్రీలుగా మారిన వారు మరో జట్టు) పోటీలు నిర్వహించాడు. ఆ మ్యాచ్‌లను ప్రజలు బాగా ఎంజాయ్ చేసారు. అయితే ఇప్పుడే ట్రాన్స్‌జెండర్స్‌కి పురుషుతో, స్త్రీలతో పోటీలు నిర్వహిస్తే.. సరైన ఆదరణ లభించక పోవచ్చని సదమ్‌ అభిప్రాయపడ్డాడు. ఎదోఒకరోజు స్త్రీ, పురుషులతో సమానంగా ట్రాన్స్‌జెండర్స్‌లను గుర్తిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసాడు. అంతేకాదు జాతీయ స్థాయి క్రీడల్లో వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఇంఫాల్‌లో ఇదే మొదటి ఫుట్‌బాల్ జట్టు. అంతేకాదు భారత్ మొదటి ట్రాన్స్‌జెండర్స్ ఫుట్‌బాల్ జట్టు కూడా ఇదే.

మురళీధరన్‌కి ధోనీ చుక్కలు చూపించాడు.. 6 బంతులు స్టేడియం బయటే: అశ్విన్

Story first published: Wednesday, June 17, 2020, 17:59 [IST]
Other articles published on Jun 17, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X