న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పీఎఫ్ఎ యంగ్ ప్లేయర్ ‘మాంచెస్టర్ సిటీ’ లెరోయ్ సానె

Manchester Citys Leroy Sane named PFA Young Player of the Year

హైదరాబాద్: లెరోయ్ సానె జర్మనీ ఇంటర్నేషనల్ సాకర్ ప్లేయర్.. ప్రీమియర్ లీగ్ జెయింట్స్ క్లబ్ ప్లేయర్ మాత్రమే కాదు.. ప్రస్తుత సీజన్‌లో ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ సిటీ ప్లేయర్ జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. ప్రీమియర్ లోగీ టోర్నీ ఛాంపియన్‌గా మాంచెస్టర్ సిటీ జట్టును రెండోసారి గెలుచుకుని రికార్డు నెలకొల్పి లెరోయ్ సానె గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకు ప్రతిగా 'పీఎఫ్ఎ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా పేరొందాడు.

మాంచెస్టర్ సిటీ రెండోసారి ప్రీమియర్ లీగ్ చాంప్:

మాంచెస్టర్ సిటీ రెండోసారి ప్రీమియర్ లీగ్ చాంప్:

22 ఏళ్ల జర్మనీ ఇంటర్నేషనల్ ప్లేయర్ లెరోయ్ సానె ఈ ఏడాది మాంచెస్టర్ సిటీ జట్టు రెండోసారి విజయవంతంగా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో తొమ్మిది గోల్స్ చేశాడు. మరో 12 గోల్స్ చేయడంలో జట్టు సభ్యులకు చేయూతనిచ్చాడు. స్వాన్ సీ జట్టుపై ప్రారంభ మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీలో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్ట్యూట్‌గా 5 - 0 స్కోర్ సాధించి విజయం సాధించడంతో కీలకంగా మారాడు లెరోయ్ సానె. నాటి నుంచి మాంచెస్టర్ సిటీ ‘ప్రీమియర్ లీగ్' ఛాంపియన్‌గా నిలిచే వరకు కీలకంగా వ్యవహరించాడు.

రష్యా సాకర్ కప్ కోసం సిద్ధం అవుతున్న లారోయ్ సానె:

రష్యా సాకర్ కప్ కోసం సిద్ధం అవుతున్న లారోయ్ సానె:

వచ్చే జూన్ 14వ తేదీ నుంచి నెల రోజుల పాటు జరిగే సాకర్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ జట్టు కెప్టెన్ జోయాచిం సారథ్యంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతున్నాడు లారోయ్ సానె. తాను ఈ అవార్డు గెలుచుకోవడంపై స్పందిస్తూ ‘ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నా. అందుకు మాంచెస్టర్ సిటీ జట్టు సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, ఫ్యాన్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా' అని లారోయ్ సానె. ‘వివిధ కేటగిరీల్లో ఈ అవార్డు గెలుచుకున్న ఆటగాళ్లందరికి అభినందనలు తెలుపుతున్నా. వారు కూడా ఈ అవార్డుకు అర్హులే. వారు ఆయా జట్ల తరఫున మెరుగైన ఆటతీరు ప్రదర్శించారు' అని లెరోయ్ సానె తెలిపాడు.

 మెస్సీతో జట్టు కట్టనున్న సెర్జియో అగౌరో?

మెస్సీతో జట్టు కట్టనున్న సెర్జియో అగౌరో?

మాంచెస్టర్ సిటీ స్టార్ ప్లేయర్ సెర్జియో అగౌరో తండ్రి లియోనెల్ డెల్ కాస్టిలో తన కొడుకు భవితవ్యం గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. సెర్జియో అగౌరో ఆటతీరుతో ఈ ఏడాది పీఎఫ్ఏ టీం ఆఫ్ ది ఇయర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని వార్తలొచ్చాయి. 2016 సమ్మర్ టోర్నీలో సెర్జియో అగౌరో స్థానంలో మాన్యుయెల్ పెల్లిగ్రినీ ప్లేయర్‌ను రీప్లేస్ చేసినప్పటి నుంచి సెర్జియో భవితవ్యం గురించి ఆలోచిస్తున్నాడు. తన కొడుకు సెర్జియో అగౌరో ట్రాన్స్‌ఫర్ విండో ఆలోచనలను కొట్టి పారేయలేమని తెలిపాడు. వచ్చే ఏడాది పలు క్లబ్‌ల్లో చాలా మంది ప్లేయర్లు మారిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీతో కలిసి సెర్జియో అగౌరో ఆడే అవకాశాలను కొట్టి పారేయలేమని తెలిపాడు.

మోకాలి గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సెర్జియో:

మోకాలి గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సెర్జియో:

తన కొడుకు మోకాలికి అయిన గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని సెర్జియో అగౌరో తండ్రి లియోనెల్ డెల్ కాస్టిలో చెప్పాడు. దీంతో వచ్చే జూన్ 14 నుంచి రష్యాలో జరిగే ప్రపంచ కప్ టోర్నీలో సెర్జియో అగౌరో ఆడుతాడా? లేదా? అన్న విషయమై సందేహాలను నివృతి చేశాడు. లియానెల్ డెల్ కాస్టివా మాట్లాడుతూ.. ‘ఇది అత్యవసరం. షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు ఉండవు' అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సెర్జియో అగౌరో నెల రోజుల్లో పూర్తిగా ఫిట్‌గా బయటకు వస్తాడని తెలిపాడు. పరిస్థితులను బట్టి వరల్డ్ కప్ టోర్నీలో సెర్జియో అగౌరో డీసెంట్‌గా పాల్గొంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Monday, April 23, 2018, 14:37 [IST]
Other articles published on Apr 23, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X