న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్ఎల్: సొంత ఆటగాళ్లే ముఖ్యమన్న లూయిస్

భారత్‌లో క్షేత్రస్థాయిలో ఫుట్‌బాల్ ఆటను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఐఎస్ఎల్ టోర్నీలో దేశీయ ఆటగాళ్ల ప్రాతినిధ్యం పెంపొందిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని లూయిస్ గరిక తెలిపారు.

By Nageshwara Rao

న్యూఢిల్లీ: భారత్‌లో ఫుట్‌బాల్ ఆటను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో దేశీయ ఆటగాళ్ల ప్రాతినిధ్యం పెంపొందిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని, వారే భారత్ భవిష్యత్ ఫుట్‌బాల్‌కు పునాది కానున్నారని ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్)లో జెయింట్స్‌లో ఒకటైన లివర్ పూల్ క్లబ్ మాజీ ప్లేయర్ లూయిస్ గరిక వ్యాఖ్యానించాడు.

ఐఎస్ఎల్ 3 ఎడిషన్ టోర్నీని నిశితంగా గమనించిన లూయిస్ గరిక తన అభిప్రాయాలను ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ ఇంటర్వ్యూ విశేషాలివి: తాను ఈ దఫా ఐఎస్ఎల్ టోర్నీ యావత్ నిశితంగా ఫాలో అయ్యానని, ప్రస్తుత సీజన్ టోర్నీలో అత్యంత గణనీయమైన మార్పు చోటుచేసుకున్నదని లూయిస్ గరిక అన్నాడు. విదేశీ ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఆడుతున్న భారతీయ ప్లేయర్లు పెరిగారన్నాడు.

ఆయా జట్లలోనూ భారతీయ ప్లేయర్లే ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, తొలి రెండు సీజన్లలో విదేశీ ఆటగాళ్ల వల్లే ఆయా జట్ల విజయాలు ఆధార పడి ఉన్నాయని, ఇప్పుడు మాత్రం జట్ల విజయాల్లో భారతీయ ఆటగాళ్లే కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నాడు. నిరంతరం మ్యాచ్‌లు, టోర్నీల్లో పాల్గొనడం ద్వారా మాత్రమే భారతీయ ఆటగాళ్లు తమ ఆటతీరును మరింత మెరుగు పరుచుకోగలరన్నాడు.

ఏడాది పొడవునా ఆడలేకపోతున్నాం

ఏడాది పొడవునా ఆడలేకపోతున్నాం

ఫస్ట్ సెషన్‌లో తాను కొందరు భారతీయ కుర్రాళ్లతో మాట్లాడినప్పుడు తాము ఏడాది పొడవునా ఆడలేకపోతున్నామని చెప్పారన్నాడు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌లో ఫుట్ బాల్ ఆట పుంజుకోవడం కష్ట సాధ్యమన్నాడు. యూరోపియన్ దేశాల్లో 17వ, 18వ ఏట నుంచి నిరంతరం ఫుట్ బాల్ ఆడుతున్న వారే ఎక్కువగా ఉంటారన్నారు. కానీ వారు ప్రొఫెషనల్ గేమ్స్ ఆడేందుకు మాత్రం 23, 24 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వేచి ఉండాల్సిందేనన్నాడు.

యువ ఆటగాళ్లకు మెరుగైన ఛాన్స్‌లు

యువ ఆటగాళ్లకు మెరుగైన ఛాన్స్‌లు

పలు అకాడమీలు ఉండటం వల్ల యువ ఆటగాళ్లలో మెరుగైన చాన్స్‌లు కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయని, చాలా చిన్నతనం నుంచే కుర్రాళ్లను ఫుట్ బాల్ ఆడేందుకు ప్రోత్సహించాల్సి ఉన్నదన్నాడు. ఐఎస్ఎల్‌లో మాజీ చాంపియన్లు అట్లెటికో డి కోల్ కతా తిరిగి సెమీ ఫైనల్స్‌కు రావడం తనకు హ్యాపీగా ఉందని చెప్పాడు. తాను పలువురు ప్లేయర్లతో ప్రత్యేకించి బోర్జా ఫెర్నాండెజ్‌తో నిత్యం సంప్రదింపులు జరుపుతానన్నాడు.

ఎప్పటికప్పుడు మ్యాచ్‌లో

ఎప్పటికప్పుడు మ్యాచ్‌లో

ఆయన ఎప్పటికప్పుడు మ్యాచ్‌లో తమ పరిస్థితిని వివరిస్తాడన్నాడు. కోల్ కతా కుర్రాళ్లు చాలా బాగా ఆడతారని, ఇంతకుముందు పుణెతో జరిగిన మ్యాచ్ లో తన మాజీ కోచ్ అంటోనియో హబాస్ కు వ్యతిరేకంగా ఆడారన్నాడు. వారు ప్లేఆఫ్ దశకు చేరుకున్నారని, వచ్చిన నాలుగు జట్లలో ఫైనల్స్ కు వెళ్లగల సత్తా ఉన్న టీంలేవన్న సంగతి పరిశీలించాలన్నాడు.

ప్లేయర్లకు ఇది చాల ముఖ్యం

ప్లేయర్లకు ఇది చాల ముఖ్యం

వివిధ జట్ల సారధులు స్టేడియంకు రావడం వల్ల మరికొందరు అభిమానులు మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వస్తారన్నాడన్నాడు. ఇది కూడా ప్లేయర్లకు చాలా ముఖ్యమైందన్నాడు. స్టాండ్స్‌లో అభిమానుల మద్దతు లేకుండా ప్లేయర్లు టోర్నీల్లో సక్సెస్ పుల్ గా విజయం సాధించలేరన్నాడు. వేలాది మంది అభిమానుల కేరింతలతో కూడిన మద్దతు లేకుండా ఏ దేశంలోనూ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆట ముందుకు వెళ్లదని స్పష్టంచేశాడు.

సారధుల హాజరీ తప్పనిసరి

సారధుల హాజరీ తప్పనిసరి

ఐఎస్ఎల్ టోర్నీఒక నిలకడ సాధించేందుకు ఇతర జట్ల సారధుల రాక తప్పనిసరన్నాడు. రెగ్యులర్ గా అనుసరిస్తూ మ్యాచ్ పురోభివ్రుద్ధికి నిరంతరం సూచనలు చేయాలంటే ఆయా జట్ల సారధుల హాజరీ తప్పనిసరన్నాడు. అయితే భారతీయ ప్లేయర్లే జట్టుకు సారధ్యం వహించే సమయం భవిష్యత్ లో ఉందని లుసికా గరిక పేర్కొన్నాడు.

ఐఎస్ఎల్ టోర్నీ అంటే ఎంతో ప్రేమ

ఐఎస్ఎల్ టోర్నీ అంటే ఎంతో ప్రేమ

తనకు ఐఎస్ఎల్ టోర్నీ అంతే ఎంతో ప్రేమ ఉందన్నాడు. రెండేళ్ల క్రితం తొలి ఎడిషన్ లో కోల్ కతా టోర్నీ గెలుచుకుని ఆ క్లబ్ అభిమానులతో కలిసి పండుగచేసుకున్నానన్నాడు. స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ ‘లా లీగ' టోర్నీ విశ్వవ్యాప్తం కావాలన్నాడు. భారత్ లోనూ, తర్వాత ఆసియా ఖండంలో అడగుపెట్టాలంటే ముందు ఆయా ప్రాంతాల్లో ఆట పరిస్థితి మెరుగు పడాల్సి ఉందన్నారు. తిరుగులేని స్థాయిలో మద్దతుదారులు అందుబాటులో ఉండాలన్నారు. ఆ స్థాయికి ఐఎస్ఎల్ చేరుకోవాలన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X