న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

నాకౌట్ బెర్తు కోసమే జపాన్ అలా ఆడింది: పౌల్ ప్లేపై వెల్లువెత్తుతున్న విమర్శలు

By Nageshwara Rao
Lucky Japan qualify for knockout stages through Fifas fair play rules despite losing 1-0 to Poland

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం జపాన్-పోలెండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పోలాండ్ చేతిలో 0-1తో జపాన్ ఓటమిపాలైంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన జపాన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో జపాన్ ఓటమిపాలైన నాకౌట్‌కు అర్హత సాధించింది. అయితే, నాకౌట్ బెర్తు దక్కించుకునేందుకు జపాన్ అలా ఆడినందని పుట్‌బాల్ విశ్లేషకులు చెబుతున్నారు. టోర్నీలో భాగంగా లీగ్ స్టేజిలో తన చివరి మ్యాచ్ ఆడటానికి ముందు జపాన్, సెనెగల్ జట్లు రెండింటికీ ఒకే పాయింట్లు, ఒకే గోల్స్ సంఖ్య ఉన్నాయి.

చివరి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు 0-1తోనే ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు రాలేదు. అయినా సెనెగల్‌ను వెనక్కి నెట్టి జపాన్ నాకౌట్‌కు అర్హత సాధించింది. అలా ఎలా వెళ్లిందంటే ఫెయిర్ ప్లే. అంటే సెనెగల్‌తో పోలిస్తే జపాన్‌కు ఎల్లో కార్డులు తక్కువగా ఉన్నాయి కాబట్టి. సెనెగల్‌కు ఐదు, జపాన్‌కు మూడు ఎల్లో కార్డులు ఉన్నాయి.

1
958065
జపాన్ ఆట తీరుపై తీవ్ర విమర్శలు

జపాన్ ఆట తీరుపై తీవ్ర విమర్శలు

పోలెండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జపాన్ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జపాన్-పోలెండ్, సెనెగల్-కొలంబియా జట్ల మధ్య మ్యాచ్‌లు ఒకే సమయానికి ప్రారంభమయ్యాయి. అయితే సెనెగల్ మ్యాచ్ ముగిసే సమయానికి ఇటు జపాన్ మ్యాచ్ చివరి పది నిమిషాల ఆట మిగిలి ఉంది. అప్పటికే 0-1తో వెనుకబడి ఉన్న జపాన్.. స్కోరును సమం చేయడానికో, గెలవడానికో ప్రయత్నించలేదు.

 జపాన్‌కు ఒక ఎల్లో కార్డు

జపాన్‌కు ఒక ఎల్లో కార్డు

ఆటలో భాగంగా అప్పటికే జపాన్‌కు ఒక ఎల్లో కార్డు వచ్చింది. అటు సెనెగల్‌కు కూడా ఒక ఎల్లో కార్డు రావడంతో ఆ జట్టు ఎల్లో కార్డుల సంఖ్య ఐదుకి చేరింది. కాగా, జపాన్ మూడు కార్డులతో ఉంది. ఈ దశలో పోలాండ్ మరో గోల్ చేసినా లేదా రెండు ఎల్లో కార్డులు లేదా ఒక రెడ్ కార్డు వచ్చినా జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

తెలివిగా వ్యవహారించిన జపాన్

తెలివిగా వ్యవహారించిన జపాన్

దీంతో జపాన్ తెలివిగా వ్యవహారించింది. చివరి పది నిమిషాలు అటాకింగ్ గేమ్ ఆడొద్దని నిర్ణయించింది. అటాకింగ్ గేమ్ ఆడి దురుసుగా వ్యవహరిస్తే ఎల్లో కార్డులు వస్తాయి. ఇది తమ నాకౌట్ బెర్త్‌ను దూరం చేస్తుంది. దీంతో జపాన్ స్టార్ ప్లేయర్లు కీసుకె హోండా, షింజి కగావాలు ప్రత్యర్థి పోస్ట్‌పై అసలు దాడికి ప్రయత్నించలేదు. తమ డిఫెన్స్, మిడ్‌ఫీల్డ్‌లలోనే ఎక్కువసేపు ఆడుతూ వచ్చారు.

86.5 శాతం ఆట మిడ్‌ఫీల్డ్‌లోనే ఆడారు

86.5 శాతం ఆట మిడ్‌ఫీల్డ్‌లోనే ఆడారు

అంతేకాదు... మైదానంలో హాఫ్ వే మార్క్‌కు కొద్ది దూరం వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేయడం లాంటివి చేశారు. చివరి ఐదు నిమిషాల్లో 86.5 శాతం ఆట మిడ్‌ఫీల్డ్‌లోనే ఆడారు. ఈ సమయంలో స్టేడియంలో ఉన్న అభిమానులు జపాన్ ఆటగాళ్లు ఆటను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతేకాదు హేళన కూడా చేశారు.

 జపాన్‌పై 1-0తేడాతో పోలెండ్ విజయం

జపాన్‌పై 1-0తేడాతో పోలెండ్ విజయం

దీంతో ఆట ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాకపోవడంతో పోలెండ్ జపాన్‌పై 1-0తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ రకమైన ఆట ఆడినందుకు తాను చింతిస్తున్నట్లు మ్యాచ్ అనంతరం జపాన్ కోచ్ అకిరా నిషినో చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఇది కఠినమైన నిర్ణయమే. తమ లక్ష్యం నాకౌట్ స్టేజ్‌కు చేరడమే కావడంతో ఇలా చేయక తప్పలేదు" అని అన్నాడు.

నాకౌట్‌కు చేరాలంటే వేరే ప్లాన్ ఏమీ లేదు

నాకౌట్‌కు చేరాలంటే వేరే ప్లాన్ ఏమీ లేదు

నాకౌట్‌కు చేరాలంటే ఆ సమయంలో తమ దగ్గర వేరే ప్లాన్ ఏమీ లేదని అన్నాడు. మా టీమ్ ఆడిన తీరు నాకేమీ ఆనందం కలిగించలేధని, అయితే నాకౌట్ చేరాలంటే ఇంత కంటే వేరే మార్గం కనిపించలేదని జపాన్ కోచ్ స్పష్టం చేశాడు. మిడ్‌ఫీల్డర్ హసిబిని ఫీల్డ్‌లోకి పంపే ముందే రిస్క్ వద్దని, ఎల్లో కార్డులు రాకుండా చూసుకోవాలని సూచన చెప్పి పంపించానని నిషినో చెప్పాడు.

Story first published: Friday, June 29, 2018, 11:36 [IST]
Other articles published on Jun 29, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X