న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

అప్పటిలా కాదు, ఈ సారి కచ్చితంగా కప్పు గెలుస్తా: మెస్సీ

Lionel Messi exclusive: In Argentina theres no place for runners-up

హైదరాబాద్: 2014 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరినా.. అనూహ్య ఫలితాలతో అర్జెంటీనా జట్టు జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. 28 ఏళ్ల అనంతరం మరో కప్‌ను తమ దేశానికి చేరుతుందనుకున్న ఆశలు నీరుగారిపోయాయి. ఓటమికి ఖిన్నుడైన మెస్సీ ఏకంగా రిటైర్ మెంట్‌ను ప్రకటించేశాడు. ఆ తర్వాత రిటైర్ మెంట్‌ను వెనక్కితీసుకున్న జట్టులో రాణిస్తున్న మెస్సీ మళ్లీ ఫిఫా వరల్డ్ కప్ తమ జట్టుకే చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా అర్జెంటీనా యోధుడు మెస్సీతో ముఖాముఖి ఇలా..

ఆఖరి మ్యాచ్ ఓటమిపై కుంగుబాటు?

ఆఖరి మ్యాచ్ ఓటమిపై కుంగుబాటు?

మెస్సీ: నిజమే. ఆ ఓటమితో పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. జట్టుతో పాటు.. యావత్ దేశమంతా వేదనకు గురైంది. అయినా ప్రయత్నాలు ఎంత కఠినంగా ఉన్నా అన్నిసార్లూ విజయం దక్కడం సాధ్యం కాకపోవచ్చు.

అర్జెంటీనా భారీ అంచనాలను ఎలా అధిగమిస్తారు?

అర్జెంటీనా భారీ అంచనాలను ఎలా అధిగమిస్తారు?

మెస్సీ: చివరిసారి టోర్నీలోనూ శాయశక్తులా ప్రయత్నించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. 1986 తర్వాత టైటిల్‌ నెగ్గలేకపోవడంతో మాపై ప్రతిసారీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఫైనల్‌ చేరి టైటిల్‌ సాధించడమే నా లక్ష్యం. 2014లో జరిగిన పొరపాటును తలెత్తకుండా చూసుకుంటాం. ఎందుకంటే మా తరం ఆటగాళ్లకు ఇదే చివరి అవకాశం కావచ్చు.

ఓటమికి గురైన ప్రతిసారీ మీడియా.. మెస్సీనే టార్గెట్?

ఓటమికి గురైన ప్రతిసారీ మీడియా.. మెస్సీనే టార్గెట్?

మెస్సీ: అలా జరగడం బాధాకరం. అర్జెంటీనా ప్రధానంగా ఫుట్‌బాల్‌ను ఆరాధించే దేశం. ఓటమిని ఇక్కడ త్వరగా జీర్ణించుకోలేరు. అందుకే మీడియా అలా ప్రవర్తిస్తుంటుంది. మేం మూడుసార్లు ప్రపంచకప్‌ ఫైనల్ వరకూ వెళ్లి రన్నరప్‌గా నిలిచాం. అయినా మా దేశం దృష్టిలో వాటికి విలువ, చోటు రెండూ లేవు.

 ఇటలీ, నెదర్లాండ్స్‌ టోర్నీకి దూరమవడం:

ఇటలీ, నెదర్లాండ్స్‌ టోర్నీకి దూరమవడం:

మెస్సీ: ప్రపంచకప్‌ ప్రస్థానం ఎంత కఠినమో ఈ జట్ల నిష్క్రమణ చూస్తే తెలుస్తుంది. నిజానికి ఇటలీ లేని టోర్నమెంట్‌ ఊహించలేనిది. నెదర్లాండ్స్‌ 2014 కప్‌లో సెమీస్ చేరింది. పెనాల్టీ ద్వారా మేం ఆ జట్టును ఓడించాం. రష్యా కచ్చితంగా ఆ రెండు జట్ల ఆకర్షణను కోల్పోయింది.

 ఆటను ఆస్వాదించు.. మెస్సీకి మారడోనా సలహా

ఆటను ఆస్వాదించు.. మెస్సీకి మారడోనా సలహా

అర్జెంటీనా ప్రపంచకప్‌ ఆశలను మోస్తున్న స్టార్‌ స్ట్రయికర్‌ లియోనల్‌ మెస్సీపై ఎలాంటి ఒత్తిడీ ఉండకూడదని దిగ్గజ ఫుట్‌బాలర్‌ డీగో మారడోనా కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీకి అతడు కొన్ని సలహాలు ఇచ్చాడు. ‘నేను అతడికి ఇచ్చే సలహా ఒకటే. ఆటను ఆస్వాదిస్తూ ఆడుతూనే ఉండు.. ప్రపంచకప్‌ గెలిచినా.. లేకున్నా విమర్శలపై ఏమాత్రం ఆలోచించకూడదు. ఎవరినో ప్రభావితం చేయడానికి ప్రదర్శించాల్సింది ఏమీ లేదు. మైదానంలో ఆటను ఎంజాయ్‌ చేయడం ముఖ్యం' అని 1986లో జట్టుకు టైటిల్‌ అందించిన మారడోనా తెలిపాడు.

Story first published: Saturday, June 2, 2018, 11:59 [IST]
Other articles published on Jun 2, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X