న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పీలే రికార్డు బ్రేక్ చేసిన లియోనెల్‌ మెస్సీ!!

Lionel Messi broke Pele record the most goals for a single club

మాడ్రిడ్‌: ప్రముఖ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌, అర్జెంటీనా స్టార్‌ లయనెల్‌ మెస్సీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే క్లబ్‌ తరఫున అత్యధిక గోల్స్‌ సాధించి బ్రెజిలియన్‌ దిగ్గజ ఆటగాడు పీలే రికార్డును బ్రేక్ చేశాడు. మెస్సీ 644 గోల్స్‌ సాధించి పీలే నెలకొల్పిన ఆల్‌టైమ్‌ క్లబ్‌ గోల్స్‌ (643) రికార్డును బద్దలు కొట్టాడు. బార్సిలోనా క్లబ్‌ తరఫున బరిలోకి దిగిన మెస్సీ స్పెయిన్‌ లీగ్‌ లా లిగా టోర్నీలో భాగంగా మంగళవారం వల్లాడోలిడ్‌పై జరిగిన మ్యాచులో గోల్ కొట్టడంతో పీలే రికార్డును బ్రేక్ చేశాడు.

పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్‌ క్లబ్‌కు ఆడి 643 గోల్స్‌ చేశాడు. పీలే సాంటోస్‌ జట్టు తరఫున 19 సీజన్ల పాటు ఆడి 643 గోల్స్‌ సాధించాడు. దీంతో అతడు ప్రపంచంలోనే అతిగొప్ప సాకర్‌ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు లయనెల్‌ మెస్సీ అతడి రికార్డును బ్రేక్ చేశాడు. మెస్సీ 2004లో బార్సిలోనా జట్టులో చేరాడు. అప్పటి నుంచి విశేషంగా రాణిస్తున్న మెస్సీ.. తాజాగా పీలే మైలురాయిని అధిగమించాడు. మెస్సీ మొత్తం 17 సీజన్లలో 749 గేమ్స్‌లో 644 గోల్స్ నమోదు చేశాడు.

స్పానిష్‌ లీగ్‌లోనే యూరోప్‌లో జరిగే టోర్నీల్లో కూడా లయనెల్‌ మెస్సీ ప్రదర్శన నిలకడగా ఉంటుంది. 2018లో 366వ గోల్‌తో యూరోప్‌లోని మేటి లీగ్‌లలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ఘనత వహించాడు. ఈ క్రమంలో గెర్డ్‌ ముల్లర్‌ (జర్మనీ-365 గోల్స్‌) రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ముల్లర్‌ పేరిట ఉన్న మరో రికార్డును మెస్సీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ముల్లర్‌ (86 గోల్స్‌) రికార్డు కూడా ఇప్పుడు మెస్సీ పేరిటే ఉంది. 2012లో మెస్సీ 91 గోల్స్‌తో ముల్లర్‌ రికార్డును అధిగమించాడు.

లా లీగా ఈవెంట్‌లో భాగంగా శనివారం వాలెన్షియా జట్టుతో తలపడిన సందర్భంగా లయనెల్‌ మెస్సీ బార్సీలోనా తరఫున ఓ గోల్‌ చేశాడు. దీంతో ఈ క్లబ్‌ తరఫున అతడు 643 గోల్స్‌ సాధించాడు. దీంతో పీలే రికార్డును సమం చేశాడు. ఇక తన గోల్స్‌ మార్కును అధిగమించిన మెస్సీని పీలే అభినందనలతో ముంచెత్తాడు. తాను ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించినప్పుడు ఈ రికార్డును బద్దలు కొడతానని ఎప్పుడూ అనుకోలేదని మెస్సీ చెప్పుకొచ్చాడు. ఇన్ని సంవత్సరాలుగా తనకు అండగా నిలిచిన సహచరులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పాడు.

ముందుకు పరుగెత్తుతూ.. గాల్లో డైవ్ చేసి.. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ (వీడియో)‌!!ముందుకు పరుగెత్తుతూ.. గాల్లో డైవ్ చేసి.. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ (వీడియో)‌!!

Story first published: Wednesday, December 23, 2020, 12:44 [IST]
Other articles published on Dec 23, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X