న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మరో సంచలనం సృష్టించన మెస్సీ.. బార్సిలోనాదే సూపర్ కప్

 Lionel Messi becomes most-decorated Barcelona player of all time as he wins 33rd piece of silverware

హైదరాబాద్: బార్సిలోనా మరో ప్రతిష్టాత్మక టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. తొలిసారిగా లియోనెల్ మెస్సీ నాయకత్వంలో బరిలోకి దిగిన బార్సిలోనా 2018-19 సీజన్‌ను అదిరిపోయే విజయంతో ఆరంభించింది. స్పానిష్ సూపర్ కప్ టైటిల్‌ను రికార్డ్ స్థాయిలో 13వ సారి నెగ్గి చరిత్రను తిరగరాసింది. ప్రతీయేటా స్పెయిన్ క్లబ్ సాకర్‌లో లా లీగా చాంపియన్‌, కోపా డెల్ రే చాంపియన్ జట్ల మధ్య జరిగే స్పానిష్ సూపర్ కప్‌ టైటిల్ ఫైట్ నిర్వహిస్తారు.

విజయం సాధించి సూపర్ కప్ ఎగరేసుకుపోయి:

విజయం సాధించి సూపర్ కప్ ఎగరేసుకుపోయి:

2017-18 సీజన్‌లో లా లీగా చాంపియన్‌గా నిలిచిన బార్సిలోనా, కోపా డెల్ రే ఛాంపియన్‌గా నిలిచిన సెవిల్లా జట్లు స్పానిష్ సూపర్ కప్‌ టైటిల్ మ్యాచ్‌లో హోరాహోరీగా పోటీపడ్డాయి. సెవిల్లా క్లబ్‌పై 2-1 గోల్స్‌తో సంచలన విజయం సాధించి సూపర్ కప్ ఎగరేసుకుపోయింది. సెవిల్లా క్లబ్ నుంచి గట్టి పోటీ ఎదురైనా స్థాయికి తగ్గట్టుగా రాణించి విజేతగా నిలిచింది. ఆట ఆరంభంలో సెవిల్లా క్లబ్ ఆధిపత్యం ప్రదర్శించినా సెకండ్ హాఫ్‌లో బార్సిలోనా దూకుడు ముందు తేలిపోయింది.

సెకండ్ హాఫ్‌లో బార్సిలోనా రెండో గోల్ కోసం

సెకండ్ హాఫ్‌లో బార్సిలోనా రెండో గోల్ కోసం

సెవిల్లా ఫార్వర్డ్ పాబ్లో సరాబియా 9వ నిమిషంలోనే గోల్ కొట్టి బార్సిలోనాకు షాకిచ్చాడు. 42వ నిమిషంలో బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పిక్ ఈక్వలైజర్ గోల్‌తో సెవిల్లా ఆధిక్యాన్ని సమం చేశాడు.ఆట తొలి భాగం ముగిసే సరికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమాన ఆధిక్యంలో నిలిచాయి. సెకండ్ హాఫ్‌లో బార్సిలోనా ఆటగాళ్లు రెండో గోల్ కోసం పోరాడారు.78వ నిమిషంలో ఔస్మానే డెంబెలె కళ్లు చెదిరే గోల్‌తో బార్సిలోనా‌ను ఆధిక్యంలో నిలిపాడు.

రికార్డ్ లెవల్లో 13 సార్లు టైటిల్ నెగ్గిన బార్సిలోనా:

రికార్డ్ లెవల్లో 13 సార్లు టైటిల్ నెగ్గిన బార్సిలోనా:

ఈక్వలైజర్ గోల్ కోసం సెవిల్లా జట్టు పోరాడి ఓడింది. 2-1 గోల్స్‌తో సంచలన విజయం సాధించిన బార్సిలోనా స్పానిష్ క్లబ్ సాకర్‌లో మరే ఇతర జట్టుకు సాధ్యం కాని రికార్డ్‌ తన ఖాతాలో వేసుకుంది. 23 సార్లు స్పానిష్ సూపర్ కప్ ఫైనల్స్ చేరిన బార్సిలోనా రికార్డ్ లెవల్లో 13 సార్లు టైటిల్ నెగ్గింది.10 సార్లు రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది.13 సార్లు స్పానిష్ సూపర్ కప్ నెగ్గిన ఏకైక జట్టు బార్సిలోనా మాత్రమే.బార్సిలోనా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే మెస్సీ స్పానిష్ సూపర్ కప్ నెగ్గి అరుదైన ఘనతను సొంతంచేసుకున్నాడు. బార్సిలోనా క్లబ్ తరఫున రికార్డ్ స్థాయిలో టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు.

క్లబ్ సాకర్‌లోనూ మెస్సీని మించిన వారు లేరని మరోసారి:

క్లబ్ సాకర్‌లోనూ మెస్సీని మించిన వారు లేరని మరోసారి:

ఇదే క్లబ్ మాజీ ప్లేయర్ యాండ్రెస్ ఇనెస్టా 32 ట్రోఫీల రికార్డ్‌ను మెస్సీ బ్రేక్ చేశాడు. 2017-18 సీజన్ తర్వాత ఇనెస్టా రిటైరవ్వడంతో బార్సిలోనా ప్లేయర్‌గా 33 టైటిల్స్ నెగ్గిన ఘనత అర్జెంటీనా స్టార్ స్ట్రైకర్‌కే దక్కింది. ప్రస్తుత బార్సిలోనా జట్టులో చెరో 28 టైటిల్స్‌తో సెర్జియో బస్క్వెట్స్, గెరార్డ్ పిక్ మెస్సీ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇప్పటికే బార్సిలోనా క్లబ్ ఆల్ టైమ్ టాప్ స్కోరర్‌గా ఉన్న 30 ఏళ్ల మెస్సీ ఇదే జోరు కొనసాగిస్తే మరిన్ని రికార్డ్‌లు బద్దలవ్వడం ఖాయం. ఇంటర్నేషనల్ సాకర్‌లో మాత్రమే కాదు క్లబ్ సాకర్‌లోనూ మెస్సీని మించిన వారు లేరనడానికి తాజా రికార్డులే నిదర్శనం.

Story first published: Monday, August 13, 2018, 17:49 [IST]
Other articles published on Aug 13, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X