గోల్ కీపర్‌గా ఆడి నిలిస్తే.. ఖాళీ చెక్‌పై సంతకం చేసిస్తా..

Posted By:
 Koke: I would give Oblak a blank cheque to stay at Atletico

హైదరాబాద్: అట్లెటికొ మాడ్రిడ్ జట్టు ఆటగాడైన కోకె తన సహచరుడికి బంపర్ ఆఫర్ ఒకటిచ్చాడు. యూరోపా లీగ్‌లో ఒక గోల్ కీపర్‌గా ఆడి అప్పటికీ అట్లెటికో మాడ్రిడ్ జట్టులోనే కొనసాగగలను అని అనుకుంటే ఖాళీ చెక్కు మీద సంతకం చేసిస్తా అని సవాలు విసిరాడు.

లా లీగా సీజన్‌లో భాగంగా అట్లెటికో మాడ్రిడ్ జట్టు ఇప్పటికే సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలోని స్లోవెనియాను అట్లెటికో మిడ్ ఫీల్డర్ కోకె తెగ పొగిడేస్తున్నాడు. కోకె ఇంతకుముందు లివర్ పూల్, పారిస్ సెయింట్ జర్మైన్ జట్లతోనూ దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెమీ ఫైనల్ లో ఆడేందుకు అర్హత దక్కడం చాలా సంతోషంగా ఉంది. కానీ, లీగ్ చివరి వరకు ఒబ్ లాక్ ఆడగలడనే నమ్మకం నాకు లేదు. ఒకవేళ అలా ఆడగలిగితే అతనికి నేను సంతకంతో కూడిన ఖాళీ చెక్ ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. అది నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని. మేమంతా చూశాం.. పోయిన వారం గడిచిన ఛాంపియన్ లీగ్ లో ప్రదర్శించిన తీరు.' అందుకే అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నానని తెలిపాడు.

కొంతకాలం క్రితం తొంటి భాగానికి గాయం కలగడంతో విశ్రాంతి తీసుకున్న ఒబ్‌లాక్ ఈ మధ్యనే మళ్లీ జట్టులో ఆడటం మొదలుపెట్టాడు. ఈ విరామం తర్వాత వచ్చిన ఒబ్‌లాక్ అంతకుముందులా రాణించలేకపోతున్నాడు. లియోనల్ మెస్సీలాంటి స్టార్ ప్లేయర్లున్న ఈ జట్టు లీగ్ పట్టికలో 68 పాయంట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. దీని కంటే ముందు స్థానంలో బార్సిలోనా జట్టు 79 పాయింట్లు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటమెరుగని బార్సిలోనా ట్రోఫీని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో బార్సిలోనా జట్టును అధిగమించాలనే ఆరాటంలో మూడు మ్యాచ్ లు కోల్పోయి 20 మ్యాచ్ లు గెలిచిన అట్లెటికో భావిస్తోంది.

Story first published: Friday, April 13, 2018, 17:32 [IST]
Other articles published on Apr 13, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి