న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రొనాల్డో అంటే ఇదీ: ఒక్కరోజే 5 లక్షల 20 వేల జెర్సీల అమ్మకం (వీడియో)

By Nageshwara Rao
Juventus enjoy record shirt sales following Cristano Ronaldos move

హైదరాబాద్: పుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఏది చేసినా సంచలనమే. ఇటీవలే క్రిస్టియానా రొనాల్డో స్పెయిన్‌కు చెందిన రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌ నుంచి ఇటలీకి చెందిన జువెంటస్‌ క్లబ్‌కు మారిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 846 కోట్లు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

అయితే, జువెంటస్ క్లబ్‌ జట్టు తరఫున బరిలో దిగకుండానే తన ధరలో సగం మొత్తం సంపాదించి పెట్టాడు. అదెలాగని అనుకుంటున్నారా? క్రిస్టియానో రొనాల్డొ పేరును కుదించి, అతడి నంబరును జోడించి జువెంటస్‌ క్లబ్‌ 'సీఆర్‌7' పేరిట జెర్సీలను సోమవారం అమ్మకానికి పెట్టింది.

వేలానికి పెట్టిన ఒక్కరోజులోనే రొనాల్డోకు చెందిన 5 లక్షల 20 వేల జెర్సీలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. వీటిలో 20 వేల జెర్సీలను అభిమానులు జువెంటస్‌ అధికారిక స్పాన్సర్‌ ఆడిడాస్‌ స్టోర్ల నుంచి కొనుగోలు చేయగా, 5 లక్షల జెర్సీలకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం విశేషం.

దీంతో కేవలం ఒక్కరోజే జువెంటస్ క్లబ్‌కు 5 కోట్ల 40 లక్షల యూరోలు (రూ. 420 కోట్లు) వచ్చాయి. కాగా, జువెంటస్‌ ప్రామాణిక షర్ట్‌ విలువ 104 యూరోలు (రూ. 8,300) కాగా, రెప్లికా షర్ట్‌ 45 యూరోలు (రూ. 3,600)గా ధరను నిర్ణయించారు. 2016 సీజన్‌ మొత్తంలో అమ్ముడైన జువెంటస్‌ జెర్సీలే 8.50 లక్షలు కావడం గమనార్హం.

స్పానిష్‌ లీగ్‌ లా లిగాలో గత తొమ్మిదేళ్లుగా అతడు స్పెయిన్‌కు చెందిన రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. 2009లో రికార్డు స్థాయిలో రూ.730 కోట్ల ధరకు మాంచెస్టర్‌ యునైటెడ్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు తరలివచ్చాడు. ఈ జట్టుకు రొనాల్డో నాలుగు చాంపియన్స్‌ లీగ్‌, రెండు లా లిగా టైటిల్స్‌ను అందించాడు.

Story first published: Wednesday, July 18, 2018, 13:54 [IST]
Other articles published on Jul 18, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X