న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్ఎల్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా చిరంజీవి: టైగర్, దిశా డ్యాన్స్ అదుర్స్, కేరళ విజయం

ISL 2019: Kerala Blasters come from behind to beat ATK 2-1 in opener

హైదరాబాద్: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశాడు. ఐఎస్‌ఎల్‌‌లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు చిరంజీవి సహాయజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఎల్‌ ఆరో సీజన్‌ ఆరంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

కేరళలోని కొచ్చిలో జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో హోరెత్తించే పాటలు.. అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ఆరో సీజన్‌కు తెరలేచింది. వర్షం పడుతున్నా ఆరంభోత్సవం ఆద్యంతం అద్భుతంగా సాగింది. కిక్కిరిసిన స్టేడియంలో ఆరంభోత్సవానికి బాలీవుడ్‌ స్టార్స్‌ టైగర్‌ ష్రాఫ్, దిశా పటానీల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

'భారత్‌' సినిమాలోని 'స్లో మోషన్‌' పాటకు దిశా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఆ తర్వాత బాగీ-2 సినిమా 'తు బచ్‌కే' పాటకు టైగర్‌, దిశా పటానీలు డ్యాన్స్ చేశారు. ఆటపాటల తర్వాత స్టేజ్‌పైకి వచ్చిన ఐఎ్‌సఎల్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ లీగ్‌ ప్రారంభమైనట్టు ప్రకటించారు. మ్యాచ్‌కు ముందు మెగాస్టార్‌ చిరంజీవి, అట్లెటికో సహ యజమాని గంగూలీ వేదికపై సందడి చేశాడు.

కేరళ బ్లాస్టర్స్‌ శుభారంభం

కేరళ బ్లాస్టర్స్‌ శుభారంభం

ఇదిలా ఉంటే, అట్లెటికో ది కోల్‌కతాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ శుభారంభం చేసింది. ఆదివారం సొంతగడ్డపై జరిగిన సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 తేడాతో అట్లెటికో ది కోల్‌కతాపై విజయం సాధించింది. కేరళ ఆటగాడు బార్తలోమెవ్‌ ఒగ్బెచ్‌ రెండు గోల్స్‌ సాధించగా... కోల్‌కతా జట్టు తరుపున కార్ల్‌ మెక్‌హ్యూ ఒకే ఒక్క గోల్‌ చేశాడు.

ఆట 6వ నిమిషంలోనే గోల్

ఆట 6వ నిమిషంలోనే గోల్

మ్యాచ్‌ ఆరంభంలో కోల్‌కతా ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, ఆట 6వ నిమిషంలో కార్ల్‌ మెక్‌హ్యూ గోల్‌ చేసి కోల్‌కతాకు ఆధిక్యాన్ని అందించాడు. ఐఎస్ఎల్‌లో కోల్‌కతాకు ఇది 100వ గోల్ కావడం విశేషం. ఆ తర్వాత అక్కడి నుంచి రెండు జట్లు గోల్స్ కోసం తెగ ప్రయత్నించాయి. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన ఒగ్బెచె స్కోర్‌ను సమం చేశాడు.

2-1తో కేరళ బ్లాస్టర్స్ విజయం

2-1తో కేరళ బ్లాస్టర్స్ విజయం

మొదటి అర్ధ భాగం చివరి నిమిషంలో మరో గోల్‌ చేసిన ఒగ్బెచె కేరళకు 2-1తో ఆధిక్యాన్నిచ్చాడు. దాంతో తొలి అర్ధభాగం ముగిసే సరికే కేరళ ఆధిక్యంలో నిలిచింది. అనంతరం రెండో అర్ధభాగంలో కేరళ బ్లాస్టర్స్ జాగ్రత్తగా ఆడి ఈ ఆధిక్యాన్ని కాపాడుకుని మ్యాచ్‌ని సొంతం చేసుకుంది. ఈరోజు మ్యాచ్‌లో బెంగళూరుతో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ జట్టు ఆడుతుంది.

Story first published: Monday, October 21, 2019, 8:41 [IST]
Other articles published on Oct 21, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X