న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

గ్లోబల్ బ్రాండ్ గా ఐఎస్ఎల్: లీగ్ నిర్వాహకుల టార్గెట్

By Pratap

ముంబై: భారత్ లో జాతీయ స్థాయిలో ఫుట్ బాల్ ప్రోత్సాహానికి 2014లో ప్రారంభమైన ఇండియన్ సూపర్ లీగ్ మూడో ఎడిషన్ ఐఎస్ఎల్ 3 సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేకించి ఫుట్ బాల్ క్రీడకు భారీస్థాయిలో ఖర్చు పెడుతున్న చైనాతో పోలిస్తే భారత్ వ్యయం తక్కువ. అయినా ఐఎస్ఎల్ టోర్నికి గ్లోబల్ బ్రాండ్ తేవాలని లక్షంగా సాగుతున్నారు. అట్లెంటిక్ మాడ్రిడ్ మాజీ స్టార్ డియాగో ఫోర్లాన్, బ్రెజిలియన్ వరల్డ్ కప్ మాజీ విజేత లుసియో, జాన్ రైస్ తదితర స్టార్ ఆటగాళ్ల ఆధ్వర్యంలో 11 వారాల పాటు ఫుట్ బాల్ టోర్నమెంట్ అభిమానులకు వీనుల విందు చేయనున్నది.

చైనీస్ సూపర్ లీగ్ తో పోలిస్తే ఐఎస్ఎల్ లీగ్ నిర్వాహకులు ఇప్పటికీ ప్రపంచస్థాయి క్రీడాకారులను ఆకర్షించలేకపోయారు. కానీ భారత్ అధికారులు మాత్రం విభిన్న ఆసియా జెయింట్లతో పోల్చవద్దని వ్యాఖ్యానిస్తున్నారు. 'చైనా, భారత్ లలో పరిస్థితులు వేర్వేరు. చైనాలో క్రీడల నిర్వహణ ప్రభుత్వ నియంత్రణలో జరుగుతాయి' అని అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. చైనా సూపర్ లీగ్ క్లబ్ లు ఈ ఏడాది 447కి పైగా మిలియన్ డాలర్లు అలెక్స్ టైక్సిరియా , ఇటలీ ఫార్వార్డ్ గ్రాజియానో పెల్లేల కోసమే ఖర్చు చేస్తున్నది. చైనాలో ఫుట్ బాల్ ప్రమాణాల పెరుగుదలకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

'నేను చైనాను అభినందిస్తున్నా. కానీ భారతీయ ఫుట్ బాల్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన దిశలో పయనిస్తున్నది' అని ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. బ్రెజిలియన్ లెజెండ్ జికో తిరిగి ఎఫ్ సి గోవా జట్టుకు మూడోసారి మేనేజర్ గా వ్యవహరిస్తుండగా, కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు మేనేజర్ గా స్టీవ్ కొప్పెల్ వ్యవహరిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్ సి జట్టుకు మార్కొ మాట్టరాజీ శిక్షణ ఇవ్వగా, గోవా ఎఫ్ సి జట్టుకు లుసియో, ఢిల్లీ డైనమోస్ కు ఫ్లోరెంట్ మాలౌడా కోచ్గా పనిచేస్తున్నారు.

ISL 2016: AIFF aim to turn league into a global brand despite lack of top international players

2010 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన ఫోర్లాన్ తన కెప్టెన్సీలో ముంబై సిటీ ఎఫ్ సి జట్టును తన ప్రత్యర్థులపై అటాకింగ్ కు సిద్ధంచేశాడు. జపాన్ సెరెజో ఒసాకా తరఫున ాడిన ఫోర్లాన్.. జె - లీగ్ కు ఉన్నంత శక్తి సామర్థ్యాలు ఐఎస్ఎల్ కు ఉన్నాయని విశ్వసిస్తున్నాడు. 'భారతీయులు మార్కెటింగ్, స్టేడియంలు, టీమ్ ల తయారీతోపాటు మంచి ప్లేయర్లను తెచ్చుకోగలుగుతున్నారు. అంతర్జాతీయంగానే భవిష్యత్ లో భారత్ ఫుట్ బాల్ అత్యంత ప్రజాదరణ గల ఆటగా మారుతుుంది' అని ఫొర్లాన్ వ్యాఖ్యానించాడు.

దిగ్గజంగా పేరొందిన ముంబై

తొలి సీజన్ లో ఫేవరెట్లుగా దిగిన ముంబై తొలి రెండు ఎడిషన్లలోనూ సెమీస్ కు కూడా చేరుకోలేదు. కానీ ఈ ఫ్రాంచైసీలో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ ఫార్వర్డ్ ఫోర్లాన్, భారత్ ఫుట్ బాల్ జట్టు టాప్ స్కోరర్ సునీల్ చెత్రి వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. ఇక గత సీజన్ లో ఫైనల్స్ కోసం జరిగిన పోరులో ఓటమి పాలైన గోవా ఎఫ్ సి జట్టు సైతం ఈ దఫా మెరుగైన ప్రదర్శన కోసం తహతహలాడుతున్నది. గత ఏడాది మిగతా జట్లన్నింటితో పోలిస్తే 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఉండటం గమనార్హం.

ఫ్రాంచైసీ క్లబ్ ల ఆధారిత టోర్నమెంట్ ఐఎస్ఎల్. క్లబ్ యజమానుల్లో అత్యధికులు బాలీవుడ్ సినీతారలు, క్రికెటర్లు ఉన్నారు. దేశంలో రెండు వేర్వేరు లీగ్ టోర్నీలు నడుస్తుండగా, వాటిలో ఒక్కటి మరో లీగ్ లో విలీనమవుతుందని, సంప్రదింపులు జరుగుతున్నాయని ఐఎస్ఎల్ అడ్మినిస్ట్రేటర్లు అభిప్రాయ పడుతున్నారు. రెండు లీగ్ ల మధ్య విలీనం సజావుగా సాగుతుందని భావిస్తున్నామని, 2017 - 18, 2018- 19 నాటికి పూర్తి కావచ్చునని ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తెలిపారు.

క్రికెట్ పిచ్చి గల భారత్ లో దేశీయ ఫుట్ బాల్ సెటప్ ప్రగతిపథంలో సాగుతున్నదని, ఐఎస్ఎల్ మ్యాచ్ లకు హాజరయ్యే వారి వీక్షకులు, సందర్శకుల సంఖ్య కూడా ప్రోత్సాహకరంగా ఉన్నది. కానీ జాతీయ జట్టు పరిస్థితి ఢోలాయమాసంగానే ఉన్నది.

ఫిఫా ర్యాంకింగ్ లో భారత్ 148వ స్థానంలో ఉందీ. కేవలం ఆఫ్ఘనిస్థాన్, లెసోథో దేశాలకు పైన మాత్రమే ఉన్నది. వచ్చే ఏడాది అండర్ 17 వరల్డ్ కప్ నిర్వహించేందుకు భారేత్ సిద్ధమవుతున్నది. హామీ ఇచ్చిన కౌన్నేళ్లకు భారత్ నిద్ర లేచిందని ఫిఫా అధ్యక్ఠుడు జియాన్నీ ఇన్ ఫాంటినో అన్నారు. సుమారు 130 కోట్ల మంది జనాభా గల భారత్ నిద్ర పోతున్న దిగ్గజం అని చెప్పారు. భారత్ లో ఫుట్ బాల్ ప్రజల నుంచి మంచి ఆదరణ ఉన్నదని ఆయన తెలిపారు. దీనికి గోవాలో జరిగిన సమావేశానికి భారీగా ప్రతినిధులు హాజరు కావడమే నిదర్శనమని తెలిపారు. ఏడాదికేడాది ఆదరణ పెరుగుతున్నదని జియాన్ని వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పడు ఫలితాలు రాకపోవచ్చు, అందుకు ఏళ్లు పడుతుందని చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X