న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐ లీగ్: ఈ సారైనా గెలవాలనే పట్టుదలతో పోరాడుతున్న ఇండియన్ ఏరోస్

 Indian Arrows look to return to winning ways

హైదరాబాద్: జాతీయ స్థాయిలో జరుగుతున్న హీరో ఐ లీగ్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న ఇండియన్ ఏరోస్ తన స్థాయిని మెరుగుపరుచుకోవాలని తాపత్రయపడుతుంది. డిసెంబరు 22 శుక్రవారం న్యూఢిల్లీలోని అంబేద్కర్ స్టేడియంలో జరగబోతున్న మ్యాచ్‌లో తన ప్రతిభను చూపించడానికి సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తాకు చెందిన ఇండియన్ ఏరోస్‌కు పోటీగా గోకులం కేరళ ఎఫ్‌సీ తలపడనుంది.

రెండు వరుస పరాజయాల అనంతరం ఇండియన్ ఏరోస్ తన స్థానాన్ని ఈ సారి ఎలాగైనా మెరుగుపరుచుకోవాలని ఆరాటపడుతుంది. టాప్ పొజిషన్‌లో ఉన్న మినెర్వా పంజాబ్ ఎఫ్‌సీ జట్టుతో తలపడి ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు ప్రధాన కోచ్ లూయిస్ నార్టన్ డె మాటోస్ అంతా కోల్పోయినా మళ్లీ గెలవగలమనే సంకల్ప బలముందని నొక్కి చెప్తున్నాడు.

కోచ్ లూయీస్ మాట్లాడుతూ.. గోకులం కేరళ ఎఫ్‌సీ జట్టుతో పోటీపడుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. హీరో ఐ లీగ్ లో మా స్కోరును మెరుగుపరుచుకునేందుకు ఇదొక చక్కని అవకాశంగా భావిస్తున్నాం. మా జట్టులో విదేశీ ఆటగాళ్లెవరూ లేరు. అంతా యువకులు. కొత్త ఉత్సాహం ఉన్న వాళ్లమే. దీంతో మేము పరాజయాలను మర్చిపోయి కొత్త ఉత్తేజంతో ముందుకు వెళతాం. అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మా జట్టులోని ఆటగాళ్లెవరూ అనుభవజ్ఞులు కాదు. అయినప్పటికీ మేము టాప్ 4 పొజిషన్ టార్గెట్ చేసి ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. చూడాలి ఏం జరుగుతుందో అనే సందేహాన్ని వెలిబుచ్చాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 21, 2017, 15:56 [IST]
Other articles published on Dec 21, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X