న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA World Cup 2020: ఆప్ఘనిస్థాన్, ఒమన్‌లతో తలపడే భారత జట్టిదే

India Squad For FIFA World Cup 2020 Qualifiers Against Afghanistan and Oman is Announced

హైదరాబాద్: ఫిఫా వరల్డ్‌కప్-2020లో భాగంగా ఆప్ఘనిస్థాన్, ఒమన్ జట్లతో జరగనున్న క్వాలిఫయర్స్ మ్యాచ్‌కు భారత పుట్‌బాల్ జట్టుని బుధవారం ప్రకటించింది. మొత్తం 26 మందితో కూడిన జట్టుకు సునీల్ ఛెత్రి నాయకత్వం వహించనున్నారు.

ఈ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్లుగా సునీల్ ఛెత్రి, మన్వీర్ సింగ్, ఫరూక్ చౌదరిలు కీలకం కానున్నారు. అలాగే, మిఢ్ ఫీల్డర్లుగా ఉదాంత సింగ్, జాకిచంద్ సింగ్, సిమిన్లెన్ డౌంగెల్, రేనియర్ ఫెర్నాండెజ్, వినిత్ రాయ్, సహల్ అబ్దుల్ సమద్, ప్రణయ్ హాల్డర్, అనిరుధ్ థాపా, లల్లియన్‌జులా చాంగ్టే, బ్రాండన్ ఫెర్నాండెజ్, అసిక్ కురునియాన్ ఎంపిక చేశారు.

China Open 2019: సైనా ఇంటికి, రెండో రౌండ్‌లోకి పారుపల్లి కశ్యప్China Open 2019: సైనా ఇంటికి, రెండో రౌండ్‌లోకి పారుపల్లి కశ్యప్

ఢిపెండర్లుగా ప్రీతమ్ కోటల్, నిషు కుమార్, రాహుల్ భెకే, అనాస్ ఎదతోడికా, నరేందర్, ఆదిల్ ఖాన్, సార్థక్ గోలుయి, సుభాషిష్ బోస్, మందార్ రావు దెస్సాయ్ ఎంపిక చేసిన భారత పుట్‌బాల్ అసోసియేషన్.... గోల్ కీపర్లుగా గుర్ప్రీత్ సింగ్ సంధు, అమృందర్ సింగ్, ధీరజ్ సింగ్ మొయిరాంగ్తేమ్‌లకు చోటు కల్పించింది.

ఫిఫా వరల్డ్‌కప్ 2020 కోసం గోవాలో మొత్తం 34 మందితో సన్నాహాక శిబిరాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఆసియా క్వాలిఫియర్ నుంచి భారత పుట్‌బాల్ జట్టు గ్రూప్-ఇలో కొనసాగుతోంది. ఇదే గ్రూపులో భారత్‌తో ఖతార్, ఓమన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. టోర్నీలో భాగంగా నవంబర్ 14న ఆప్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయిర్స్‌కు భారత పుట్‌బాల్ జట్టు:
ఫార్వర్డ్ ప్లేయర్లు: సునీల్ ఛెత్రి, మన్వీర్ సింగ్, ఫరూక్ చౌదరి
మిఢ్ ఫీల్డర్లు: ఉదాంత సింగ్, జాకిచంద్ సింగ్, సిమిన్లెన్ డౌంగెల్, రేనియర్ ఫెర్నాండెజ్, వినిత్ రాయ్, సహల్ అబ్దుల్ సమద్, ప్రణయ్ హాల్డర్, అనిరుధ్ థాపా, లల్లియన్‌జులా చాంగ్టే, బ్రాండన్ ఫెర్నాండెజ్, అసిక్ కురునియాన్ఢిపెండర్లు: ప్రీతమ్ కోటల్, నిషు కుమార్, రాహుల్ భెకే, అనాస్ ఎదతోడికా, నరేందర్, ఆదిల్ ఖాన్, సార్థక్ గోలుయి, సుభాషిష్ బోస్, మందార్ రావు దెస్సాయ్
గోల్ కీపర్లు: గుర్ప్రీత్ సింగ్ సంధు, అమృందర్ సింగ్, ధీరజ్ సింగ్ మొయిరాంగ్తేమ్‌

Story first published: Wednesday, November 6, 2019, 14:02 [IST]
Other articles published on Nov 6, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X