2011 తర్వాత మళ్లీ ఆసియాకప్‌కు భారత్‌ అర్హత

Posted By:

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ 2019 ఫుట్‌బాల్‌ టోర్నీకి భారత్ అర్హత సాధించింది. బుధవారం క్వాలిఫయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లో భాగంగా మకావుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో విజయం సాధించింది. భారత్‌ తరఫున రోలిన్‌ బోర్జెస్‌ (28వ), సునీల్‌ ఛెత్రి (60వ), జెజె లల్పెక్లువా (90వ నిమిషంలో) తలో గోల్‌ చేశారు.

ఈ మ్యాచ్‌లో సొంత గోల్ చేసుకున్న మకావు

ఈ మ్యాచ్‌లో మకావు ఒక సొంత గోల్‌ చేసుకుంది. 70వ నిమిషంలో ఆటగాడు లామ్‌ కా సెంగ్‌ సెల్ఫ్‌ గోల్‌ సాధించాడు. 37వ నిమిషంలో నికొలస్‌ తరావు మకావుకు తొలి గోల్‌ అందించాడు.

మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే

ఈ విజయంతో అర్హత పోటీల్లో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే భారత్‌ ఆసియాకప్‌లో స్ధానం దక్కించుకుంది. 2019 ఆసియా కప్‌ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరుగుతుంది. 2011 తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్‌ మరోసారి అర్హత సాధించింది.

గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో

అంతకముందు భారత్ 1964, 1984, 2011లో ఆసియాకప్‌లో ఆడింది. మొదటిసారి రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు.. ఆ తర్వాత రెండు సార్లు గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్‌-ఏలో నాలుగు మ్యాచ్‌ల నుంచి 12 పాయింట్లు సాధించిన భారత్‌, గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 నవంబరు 24న మయన్మార్‌తో

నవంబరు 24న మయన్మార్‌తో

ఇంతకుముందు మయన్మార్‌పై 1-0తో, కిర్గిజ్‌స్తాన్‌పై 2-0తో విజయం సాధించిది. భారత్‌ తన మిగతా రెండు మ్యాచ్‌ల్లో నవంబరు 24న మయన్మార్‌తో, మార్చి 27న కిర్గిజ్‌స్తాన్‌తో తలపడనుంది.

Story first published: Thursday, October 12, 2017, 10:44 [IST]
Other articles published on Oct 12, 2017
Please Wait while comments are loading...
POLLS