ప్రీమియర్ లీగ్: మాంఛెస్టర్ యునైటెడ్‌ను డిఫెన్స్‌లో పడేసిన పెప్ గౌర్డెలా

Posted By:
I was offered Pogba in January: Man City boss Pep Guardiola in shock Man Utd revelation

హైదరాబాద్: ప్రీమియర్ లీగ్ టైటిల్ కోసం జరిగే ఫైనల్స్ పోటీలో మాంచెస్టర్ యునైటెడ్ జట్టుతో తలపడనున్న మాంఛెస్టర్ సిటీ కోచ్ కం మేనేజర్ పెప్ గౌర్డెలా.. తమ సహచర ప్రత్యర్థి జట్టును డిఫెన్స్‌లో పడేశారు. గత జనవరిలో ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా అలెక్సిస్ సాంచెజ్‍ను మాంఛెస్టర్ సిటీ వదులుకున్నది.

దీనికి ప్రతిగా మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు తమకు పాల్ పోగ్బా, హెన్రిఖ్ మితార్యన్‌లను తీసుకోవాలని ప్రతిపాదించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాంఛెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గౌర్డెలా. ఇందులో రెండు జట్ల మధ్యవర్తిగా వ్యవహరించిన పోగ్బా ఏజంట్ మినో రాయోలా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

 మాంఛెస్టర్ సిటీ మేనేజర్ గౌర్డెలాపై మినో రాయోలా అనుచిత వ్యాఖ్యలు

మాంఛెస్టర్ సిటీ మేనేజర్ గౌర్డెలాపై మినో రాయోలా అనుచిత వ్యాఖ్యలు

అయితే ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా పోగ్బాను పొందాలంటే చాలా డబ్బు చెల్లించాల్సి రావడంతో వెనుకకు తగ్గామని పెప్ గౌర్డెలా తెలిపారు. పోగ్బా, హెన్రిక్ మితార్యన్‌ల ట్రాన్స్ ఫర్ విండో ప్రతిపాదనలు తెచ్చింది నిజమని ధ్రువీకరించిన మినో రాయోలా.. అంతటితో ఆగక పెప్ గౌర్డెలాపై ఎదురుదాడికి దిగారు. ‘ఒక పిరికిపంద, ఒక కుక్క' అని అభివర్ణించారు.

 నేను చాలా చెడ్డవాడ్ని. నేనొక పిరికివాడ్ని

నేను చాలా చెడ్డవాడ్ని. నేనొక పిరికివాడ్ని

దీనిపై గౌర్డెలా స్పందించారు. ‘చివరకు కొంత మంది నా రహస్యాలు చెప్పేస్తున్నారు. నేను చాలా చెడ్డవాడ్ని. నేనొక పిరికివాడ్ని' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను మంచి వాడ్ని కాకుంటే మితార్యన్, పోగ్బాలను ట్రాన్స్ ఫర్ విండో ద్వారా తమ జట్టులో చేర్చుకోవాలని మిని రాయోలా ఎందుకు కోరినట్లు అని పెప్ గౌర్డెలా నిలదీశారు.

 పెప్ గౌర్డెలాపై మినో రాయోలా అనుచిత వ్యాఖ్యలు

పెప్ గౌర్డెలాపై మినో రాయోలా అనుచిత వ్యాఖ్యలు

‘పొగ్బా తిరుగులేని ఆటగాడు.. మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్. కానీ నేను వద్దన్నాను. ఆయన్ను కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బు నా వద్ద లేదని వద్దన్నాను' అని గౌర్డెలా తెలిపారు. దీనిపై పాల్ పొగ్బా ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘నాకేంటి సంబంధం' అని ప్రశించారు. మరోవైపు పెప్ గౌర్డెలా వ్యాఖ్యలపై మినీ రాయోలా ప్రతిస్పందిస్తూ ‘నేను ఎప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. నేను ప్లేయర్లను ఆఫర్ చేసింది ఆయనకు కాదు మాంఛెస్టర్ సిటీకి' అని ఎదురుదాడికి దిగారు.

రాయోలా

రాయోలా

చాలా అద్భుతమైన క్లబ్, అద్భుతమైన మేనేజర్ అని మాంఛెస్టర్ సిటీ జట్టును, దాని మేనేజర్‌ పెప్ గౌర్డెలాను ఉద్దేశించి మినో రాయోలా వ్యాఖ్యానించారు. దీనిపై సంబంధిత క్లబ్‪దే బాధ్యత అని వ్యాఖ్యానించారు. గమ్మత్తేమిటంటే మితార్యన్ ట్రాన్స్ ఫర్ డీల్ ద్వారా ఆర్సెనల్ జట్టులో చేరిపోయారు. మరోవైపు అలెక్సిస్ సాంచెట్ ఓల్డ్ ట్రాఫ్ఫోర్డ్ జట్టుకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. కానీ పాల్ పొగ్బా మాత్రం మాంఛెస్టర్ యునైటెడ్ మేనేజర్ జోస్ మౌరిన్హోతో విభేదాలతో ట్రాన్స్ ఫర్ కావాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ప్రస్తుతానికి మాంఛస్టర్ యునైటెడ్ జట్టులోనే పొగ్బా కొనసాగుతున్నారు.

Story first published: Saturday, April 7, 2018, 15:40 [IST]
Other articles published on Apr 7, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి