ఐ లీగ్ 2018: లీగ్ టైటిల్ గెలుచుకున్న మినర్వా పంజాబ్

Written By:
minerva

హైదరాబాద్: హోరాహోరీ సమరంతో ఐ లీగ్ టైటిల్ కోసం పది క్లబ్బుల వరకు పోటీపడ్డాయి. ఇందులో మినర్వా క్లబ్ 35 పాయింట్లతో విజేతగా నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో నెరోకా, మోహన్ బగాన్ జట్లు ఉన్నాయి. ఏరోస్ క్లబ్ 15 పాయింట్లతో ఆఖరి స్థానంలో ఉంది.


ఆఖరి మ్యాచ్‌తో కలిపి 18 మ్యాచ్‌లు ఆడి 11 గెలిచి 2 డ్రా అయి 5 ఓడిపోయింది. మినర్వా పంజాబ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ సత్తాచూపింది. హీరో ఐ-లీగ్‌ ఫుట్‌బాల్‌ 2017-18 సీజన్‌ విజేతగా నిలిచింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో మినర్వా పంజాబ్‌ 1-0తో చర్చిల్‌ బ్రదర్స్‌ను ఓడించి టైటిల్‌ గెలుచుకుంది. విలియమ్‌ అసైడు (16వ నిమిషంలో) గోల్‌ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

మినర్వాతో పాటు మోహన్‌ బగాన్‌, ఈస్ట్‌ బెంగాల్‌, నెరోక ఎఫ్‌సీకు కప్‌ గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే చర్చిల్‌ బ్రదర్స్‌ను ఓడించిన మినర్వ 35 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

ఐ లీగ్ ఫైనల్ మ్యాచ్ డే ఫలితాలు:
1. (మినర్వా పంజాబ్ ఎఫ్‌సీ) విలియమ్ ఒపోకు అసీద్ వర్సెస్ చర్చిల్ బ్రదర్స్ ఎఫ్‌సీ గోవా 1-0
2. ఈస్ట్ బెంగాల్ 1 (దూదు ఒమాగ్‌బెమీ వర్సెస్ నెరొకా ఎఫ్‌సీ డ్రా
3. గోకులం కేరళ ఎఫ్‌సీ వర్సెస్ మోహన్ బగాన్ డ్రా

Story first published: Friday, March 9, 2018, 11:09 [IST]
Other articles published on Mar 9, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి