'జట్టులో ఆడాలంటే జీతం పెంచాల్సిందే', ఒంటరిగా భారత్‌లో ఉండలేను

Posted By:
 I have an offer from a Chinese club, BFC need to increase my salary: Miku

హైదరాబాద్: సునీల్ చెత్రి కెప్టెన్సీలో బెంగుళూరు జట్టు తరపున ఆడుతున్న మికూ చెనీస్ క్లబ్ నుంచి తనకు మంచి ఆఫర్ వచ్చిందంటూ జీతం పెంచే ఉద్దేశ్యం లేకపోతే వెళ్లిపోతానంటున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో మొత్తం క్రీడాకారులందరిలో అత్యధిక గోల్స్ సాధించిన వారిలో రెండో స్థానంలో ఉన్న మికూ బెంగుళూరు జట్టుపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు.

ఈ విషయమై అతను మాట్లాడుతూ.. 'వాళ్లకు నేను కావాలనుకుంటే నా కోసం జీతం పెంచాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చే మొత్తం కంటే చైనాలో ఆరు రెట్లు అధికంగా ఇస్తాన్నారు' అని తెలిపాడు. ఈ సీజన్‌కు జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో మికూ ఖరీదైన ఆటగాడు. ఒక రకంగా బెంగుళూరు జట్టు ఫైనల్ లోకి వెళ్లడానికి కూడా అతను చేసిన 15గోల్స్ కారణమని చెప్పాలి. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో చెన్నైయిన్ జట్టుతో బెంగుళూరు ఎఫ్‌సీ ఓడిపోయినందుకు తీవ్రంగా నిరాశపడ్డాడు.

అన్ని జట్లతో పోల్చుకుంటే బెంగుళూరు బదిలీ నిమిత్తం వచ్చిన ఆటగాళ్లకు చైనా జట్ల తర్వాత బెంగుళూరు జట్టే అధికంగా జీతాలిచ్చేది. అలాంటిది బెంగుళూరు జట్టే నచ్చడం లేదంటే మరో ఛాయిస్ చైనాలోని జెజియాంగ్ లూచెంగ్ జట్టే అని తెలుస్తోంది.

బెంగుళూరు జట్టు నిర్వహకులు మికూని పోగొట్టుకునే ఉద్దేశం లేదని చెప్పారు. దానికి బదులుగా మికూ వీళ్ల ఉద్ధేశమెలా ఉన్నా నాకవసర్లేదు. నా భవిష్యత్, నా కుటుంబం నాకు ముఖ్యం.' అని తెలిపాడు. ఇంకో విషయాన్ని ప్రస్తావించాడు. ఇక్కడ భారతదేశంలో ఉంటే ఒంటరిగా ఉన్నాననే భావన కల్గుతుందని తెలిపాడు. నా కుటుంబం స్పెయిన్ లో ఉంది. ఇక్కడ ఉండడం అస్సలు నాకు ఏ మాత్రం నచ్చడం లేదు' అని వివరించాడు.

Story first published: Thursday, April 12, 2018, 18:28 [IST]
Other articles published on Apr 12, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి