న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

'సలాహ్‌తో నన్నెందుకు పోలుస్తారు'

I cant be compared with Salah, says De Bruyne

హైదరాబాద్: అతనితో నన్నెందుకు పోలుస్తారు. నేను మిడ్ ఫీల్డర్‌ని, అతను ఫార్వార్డ్ రన్నర్. అతనేమో పరుగుల కోసం పరిగెత్తేవాడు. నేను ప్రత్యర్థి జట్టుకు పరుగులు వెళ్లకుండా ఆపేవాడిని. అతనికి నాకూ పోలిక ఎక్కడుంది.' అని కెవిన్ డే బ్రూనె ప్రశ్నిస్తున్నాడు. ఈ మధ్యనే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న మాంచెస్టర్ సిటీ క్లబ్ ఆటగాడైన కెవిన్ డే బ్రూన్ తన అభిప్రాయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా డే బ్రూనె మాట్లాడుతూ.. 'వ్యక్తిగతంగా జట్టుకు సాయపడడం వల్లే విజయం సాధించగలం. జట్టు గెలవాలంటే ఏ ఒక్కరి ప్రదర్శనో అద్భుతంగా ఉంటే సరిపోదు. సమష్టిగా కృషి చేయాల్సిందే' అని నొక్కి చెప్పాడు. బెల్జియం మిడ్ ఫీల్డర్ డే బ్రూనె ఒకే సీజన్‌లో ఏడు గోల్‌లు సాధించాడు. ప్రత్యర్థి జట్టుకు 15గోల్‌లను వెళ్లకుండా ఆపేశాడు.

కానీ, సలాహ్, ప్రీమియర్ లీగ్ మొత్తానికి 37 మ్యాచ్‌లు ఆడి 29గోల్‌లు చేశాడు. ఇలాంటి స్కోరు చేయగల సలాహ్‌ను తనతో పోల్చడమేంటని బ్రూనె ప్రశ్నిస్తున్నాడు. ప్రతి ఆటగాడు ఒక్కోలా ఆలోచిస్తూ ఉంటాడని తన ఆటతీరును సలాహ్ ఆటతీరును పోల్చి చెప్పాడు. తనను స్కోరు బాగా చేసేవాడంటే ఒప్పుకుంటాడు కానీ, సలాహ్ తో పోల్చేంత ప్రతిభ తనది కాదని అన్నాడు.

ఎట్టకేలకు ఈ సంవత్సరం తనకు దక్కిన గౌరవానికి హర్షం వ్యక్తం చేశాడు. తన వరకు తను సంతోషంగానే ఉన్నానన్నాడు. గతేడాది ఇంత సాధించగలనని తానే ఊహించలేదన్నాడు. మైదానంలో ఉన్నంతసేపు, ఆడుతున్న ప్రతి నిమిషం చక్కని అనుభూతి వస్తుందని కొనియాడాడు.

Story first published: Tuesday, April 3, 2018, 17:17 [IST]
Other articles published on Apr 3, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X