న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పోటీలో ముగ్గురు: ఫిఫా బెస్ట్ ప్లేయర్ ఎవరు?

ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు కోసం రియల్ మాడ్రిడ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో, బార్సిలోనా ప్లేయర్ లియానెల్ మెస్సీతోపాటు అట్లెటికో మాడ్రిడ్ ప్లేయర్ అంటోనే గ్రైజ్మన్‌లు నామినేట్ అయ్యారు.

By Nageshwara Rao

జ్యురిచ్: అంతర్జాతీయంగా ఉత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారుడి అవార్డు కోసం ముగ్గురు అగ్రశ్రేణి కుర్రాళ్లు పోటీ పడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి తొమ్మిదో తేదీన ప్రదానంచేసే 'ఫిఫా - 2016' బెస్ట్ ప్లేయర్ అవార్డు కోసం లా లీగా లీగ్ జెయింట్స్ రియల్ మాడ్రిడ్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో, ఎఫ్ సి బార్సిలోనా మెయిన్ ప్లేయర్ లియానెల్ మెస్సీతోపాటు అట్లెటికో మాడ్రిడ్ ప్లేయర్ అంటోనే గ్రైజ్మన్ పేర్లు నామినేట్ అయ్యాయి.

వచ్చేనెల తొమ్మిదో తేదీన ఈ అవార్డు విజేత పేరును వెల్లడిస్తారు. బెస్ట్ ప్లేయర్ నామినేషన్ కోసం అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) తన వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వివిధ దేశాల జాతీయ జట్ల కెప్లెన్లు, కోచ్‌లు, ఎంపికచేసిన మీడియా ప్రతినిధులు, అభిమానులతో ఓటింగ్ నిర్వహించింది. 23 మంది టాప్ ప్లేయర్ల పేర్లను ఫిఫా ప్రతిపాదించింది.

ఖండాంతర టోర్నీల్లో పాల్గొనడం ద్వారా రియల్ మాడ్రిడ్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఈ ఏడాది అసాధారణ ప్రతిభ కనబరిచాడు. రియల్ మాడ్రిడ్ జట్టుకు మూడుసార్లు చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకోవడంతోపాటు 16 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అట్లెటికో మాడ్రిడ్‌పై జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ పాయింట్‌తో విజయం సాధించి జట్టుపై ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో కీలకభూమిక పోషించాడు. తన సొంత దేశం పోర్చుగీస్ జట్టుకు సారధ్యం వహించడంతోపాటు మూడు గోల్స్ కూడా చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు.

Griezmann joins Ronaldo, Messi in battle to be FIFA's best

అట్లెటికో మాడ్రిడ్ ప్రధాన ఆటగాడు అంటోనె గ్రైజ్మన్ సైతం ఈ ఏడాది అసాధారణ ప్లేయర్లలో తానొక్కడినని తనకు తాను ప్రకటించాడు. సొంతగడ్డపై యూరో 2016 టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచాడు గ్రైజ్మన్. ఫార్వర్డ్ ప్లేయర్ అయిన ఈ ఫ్రెంచ్ మ్యాన్ గ్రైజ్మన్ టోర్నమెంట్‌లోనే అత్యధిక గోల్స్ సాధించాడు. తద్వారా జట్టును ఫైనల్స్ వైపు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.

కానీ పోర్చుగల్ ఆటగాడు.. రియల్ మాడ్రిడ్ మెయిన్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో చేతిలో యూరో - 2016 టోర్నీ ఫైనల్స్‌లో ఫ్రెంచ్ జట్టు విజయం సాధించింది. 2015 - 16 సీజన్‌లో అట్లెటికో మాడ్రిడ్ జట్టులోనే ఈ ఫ్రెంచ్ మన్ అత్యధిక గోల్స్ సాధించాడు. తద్వారా లా లీగ టోర్నీలో అట్లెటికో మాడ్రిడ్ క్లబ్ ను మూడో స్థానంలో నిలపడంతోపాటు చాంపియన్స్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టుకు చుక్కలు చూపారు.

అర్జెంటీనా కుర్రాడు, ఎఫ్ సి బార్సిలోనా మాంత్రికుడు లియానెల్ మెస్సీ కూడా ఈ ఏడాదికి మరో అసాధారణ ఆటగాడు. తనకు తాను మెరుగైన ఆటతీరు కనబరుస్తూ లీగ్ దశలో జట్టును ముందుకు నడిపిస్తూ లీగ్, క్లబ్ డబుల్ స్థాయిలో 26 గోల్స్ సాధించాడు. తర్వాత లా లీగ టైటిల్ కోసం హోరాహోరీగా పోరాటంలో ముందుకు వెళుతున్నాడు. కొపా అమెరికా సెంటనరియో ఫైనల్స్ వరకు జట్టుకు సారధ్యం వహించాడు. కానీ ఈ టోర్నీ టైటిల్ పోరులో చిలీ జట్టు చేతిలో అర్జెంటీనా ఓటమి పాలైంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X