జట్టుకు సంతకం చేయడమే ఆలస్యం.. ట్రోఫీలు కావాలని అడుగుతున్నాడు

Posted By:
Gattuso demands trophies after signing AC Milan extension

హైదరాబాద్: ఏసీ మిలాన్ జట్టు ఆటగాడు జెనెరో గట్టుసో మిలాన్ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. పదవిలోకి రాగానే ఆటగాళ్లను డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. అంతేగాక తనకు ట్రోఫీలు కావాలని అడుగుతున్నాడు. గతేడాది నవంబరులో గట్టుసొ కోచ్‌గా పదవి పొందాడు. అతను జట్టులోకి వచ్చినప్పటి నుంచి మెరుగైన ప్రతిభను రాబట్టాడు.

ఇది చాలదన్నట్లు మిలాన్ కాంట్రాక్ట్‌ను ఏప్రిల్ 5న మళ్లీ పొడిగించాడు. ఈ మేరకు డాక్యుమెంటరీ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో గట్టుసొ మాట్లాడుతూ.. నేను చాలా గర్వంగా ఉన్నాను. సిబ్బంది అందరూ బాధ్యతలు నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాను. క్లబ్‌కు పని చేయడం ఓ గౌరవంగా భావించాలి.' అని తెలిపాడు.

ఇంకా మాట్లాడుతూ.. 'జట్టు ఒప్పందాన్ని పొడిగించడం చాలా సంతోషంగానూ గర్వంగానూ ఉంది. జట్టును ట్రైన్ చేయడం ఓ గౌరవంగా భావిస్తున్నా. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కూడా. ఎందుకంటే ప్రతి పనిని చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. మనం లక్ష్యం గొప్ప లక్ష్యాలను అందుకోవాలి. దాని కోసం మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది' అని జట్టు సభ్యులనుద్దేశించి ప్రసంగించాడు.

అనంతరం జట్టుతో తనకున్న సంబంధాన్ని గురించి విశ్లేషిస్తూ.. జట్టుతో కుదిరినంత కాలం నేను ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాను. అది కొన్నేళ్లైనా కావొచ్చు. ప్రొఫెషనల్‌గా నేను నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. 40 సంవత్సరాలకు నేను కోచ్ గా మారడం అంటే చాలా చిన్న వయస్సులో వచ్చినట్లే. మా వల్ల అయినంత వరకు కష్టపడి ట్రోఫీ గెలుచుకునేందుకు ప్రయత్నిస్తాం' అనే ధీమాని వ్యక్తం చేశాడు.

Story first published: Friday, April 6, 2018, 16:59 [IST]
Other articles published on Apr 6, 2018
Read in English: Gattuso demands trophies
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి