న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్: ట్విట్టర్, స్నాప్‌చాట్‌లతో ఫాక్స్ స్పోర్ట్స్ ఒప్పందం

By Nageshwara Rao
Fox Sports tie up with Twitter, Snapchat for 2018 World Cup

హైదరాబాద్: 2018 ఫిఫా వరల్డ్ కప్‌కు రష్యా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 14 నుంచి జులై 15వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. అయితే ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులకు మరింత దగ్గర చేసేందుకు గాను ఫాక్స్ స్పోర్ట్స్ ట్విట్టర్, స్నాప్‌చాట్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది.

లైవ్ మ్యాచ్‌కు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా, మ్యాచ్ డే హైలెట్స్‌తో పాటు ఇతర స్టోరీలను స్నాప్‌చాట్ ద్వారా అభిమానులకు దగ్గర చేయనున్నారు. ఈ మేరకు ఈ రెండింటితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫాక్స్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ప్రపంచ సాకర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ టోర్నీలో జరిగే అన్ని మ్యాచ్‌లను ఫాక్స్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్ నుంచి మ్యాచ్ డే హైలెట్స్‌తో పాటు మ్యాచ్ ప్రివ్యూలు, రీక్యాప్స్, రియల్ టైమ్ వీడియో హైలెట్స్ లాంటివి ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.

యునైటెడ్ స్టేట్స్‌లో కూడా ఈ టోర్నీ కవరేజి అందుబాటులో ఉంటుందని, @FOXSports, @FOXSoccer ట్విట్టర్ హ్యాండ్లర్స్ ద్వారా కూడా సాకర్ అభిమానులు మ్యాచ్ అప్ డేట్స్, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఫాక్స్ స్టార్స్ పేర్కొంది. స్నాప్‌చాట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి గల కారణాలను కూడా ఫాక్స్ స్టార్స్ వెల్లడించింది.

స్నాప్‌చాట్ మొబైల్-ఫస్ట్ ఆడియన్స్, పబ్లిషన్ స్టోరీలను అభిమానులను అందిస్తుందని పేర్కొంది. అంతేకాదు 'అవర్ స్టోరీస్' పేరిట స్నాప్‌చాట్ ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించిన స్టోరీలను ప్రత్యేకంగా అందిస్తుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 10, 2018, 11:57 [IST]
Other articles published on Jan 10, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X