న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇటలీ మంచి ఆఫర్: రియల్ మాడ్రిడ్ నుంచి గారెథ్ బాలే ట్రాన్స్‌ఫర్?

Former Bayern Boss Ancelotti Offered Italy Job: Reports

హైదరాబాద్: ఇటలీ జాతీయ జట్టును చక్కగా తీర్చిదిద్దేందుకు తిరిగి మేనేజర్ కం కోచ్‌గా రావాలని కార్లో అన్సెలొట్టికి ఇటాలియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఫ్ఐజీసీ) నుంచి ఆఫర్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఎఫ్ఐజీసీ కమిషనర్ రాబర్టో ఫాబ్రిసిని, సబ్ కమిషనర్ అలెస్సాండ్రో కోస్టాకుర్టాలు రెండు, మూడు రోజుల క్రితం రోమ్‌లోని చర్చలు జరిపినట్లు సమాచారం.

గత సెప్టెంబర్ నెలలోనే బేయర్న్ మ్యునిచ్ జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యారు కార్లో అన్సెలొట్టి. 58 ఏళ్ల కార్లో అన్సెలొట్టికి ఇటలీ ఫుట్ బాల్ సమాఖ్య రెండేళ్ల ఆఫర్ ఇచ్చినట్లు వినికిడి. డిపెండింగ్ చాంపియన్ జర్మనీతో ఇంతకుముందు ఆయన చేసుకున్న వేతన ఒప్పందం కంటే మెరుగైన ఆకర్షణీయమైన ఆఫర్ అందజే శారని స్కై స్పోర్ట్స్ ఇటాలియా ఓ కథనంలో రాసుకొచ్చింది.

కార్లో అన్సెలొట్టికి ఇటలీ ఫుట్‪బాల్ సమాఖ్య రెండేళ్ల ఆఫర్

కార్లో అన్సెలొట్టికి ఇటలీ ఫుట్‪బాల్ సమాఖ్య రెండేళ్ల ఆఫర్

జియాన్ పైరో వెంచురాను కోచ్‌గా తొలిగించిన తర్వాత 60 ఏళ్లుగా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించలేక విఫలం అవుతున్న ఇటలీకి శాశ్వత కోచ్ లేరు. ఇటలీ జట్టు తొలిసారి గతేడాది నవంబర్ నెలలో జరిగిన ఫ్లే ఆఫ్ మ్యాచ్‌లో స్వీడన్ జట్టును ఓడించింది. అన్సెలొట్టి కూడా తర్వాత చెల్సియా, రియల్ మాడ్రిడ్, జువెంటస్ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. మూడు చాంపియన్స్ లీగ్ టైటిళ్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన టైటిల్ పోరులో విజయం సాధించగలిగాడు.

 ఐదు మిలియన్ల డాలర్ల ప్యాకేజీకి ఇటలీ ఫుట్‌బాల్ సమాఖ్య ప్లాన్

ఐదు మిలియన్ల డాలర్ల ప్యాకేజీకి ఇటలీ ఫుట్‌బాల్ సమాఖ్య ప్లాన్

ఇటలీ తన జాతీయ జట్టుకు అవసరమైన నూతన కోచ్, సహాయ సిబ్బంది కోసం ఐదు మిలియన్ల యూరోలు వేతనం రూపేణా చెల్లించేందుకు ఎఫ్ఐజీసీ ప్రణాళికలు సిద్దం చేసుకున్నది. గతేడాది సెప్టెంబర్ నెలలో బెయిర్న్ మ్యునిచ్ నుంచి పొందిన వేతనం కంటే ఎక్కువే ఇది. ప్రస్తుతం చెల్సియా జట్టు మేనేజ్‌మెంట్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్న అన్సెలొట్టి కోసం ఖాళీగా ఉన్న ఆర్సెనల్ జట్టు మనేజర్ పోస్టు కూడా ఎదురుచూస్తోంది. ఇక ఏ జట్టు కోచ్‌గా చేరాలన్న విషయం తేల్చుకోవాల్సింది అన్సెలొట్టినే.

ఇటలీ తాత్కాలిక కోచ్‌గా బియాగియో

ఇటలీ తాత్కాలిక కోచ్‌గా బియాగియో

బెయిర్న్ మ్యునిచ్ కోచ్‌గా ఉన్నప్పుడు సహాయకుడిగా ఉన్న డేవిడ్, మాజీ స్టార్లు ఆండ్రియా పిర్లో, గియాలౌగి బఫోన్, పాలో మాల్డినిలతో చర్చల్లో కీలక పాత్ర పోషించాడు. వెంచురా జట్టు సక్సెసర్‌గా కోస్టాకుర్టా నియమితులయ్యాడు. ఇటలీ నూతన కోచ్ నియామకానికి వచ్చే 20 వరకు గడువు ఉంది. జెనిట్ సెయింట్ పీటర్స్ బర్గ్ కోచ్ రాబర్టో మంచిని, చెల్సియా బాస్ ఆంటోనియో కాంటే, లైసెస్టర్ మాజీ కోచ్ క్లౌడియో రానైరీ, ప్రస్తుతం ఫ్రాన్స్ క్లబ్ ఇన్ చార్జి నాంటెస్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇటలీ అండర్ 21 జట్టు కోచ్ డీ బియాగియో తాత్కాలిక ప్రాతిపదికన జట్టు జాతీయ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

గారెథ్ బాలే రహస్య డీల్ యత్నం

గారెథ్ బాలే రహస్య డీల్ యత్నం

రియల్ మాడ్రిడ్ స్టార్ గారెథ్ బాలె ప్రస్తుత వేసవిలో ఇంటర్ మిలాన్ క్లబ్ జట్టుతో రహస్యంగా సంప్రదింపులు జరిపారు. ప్రస్తుత సీజన్‌లో కోచ్ జినెడిన్ జిడానే పర్యవేక్షణలో 33 మ్యాచ్‌ల్లో 14 గోల్స్ సాధించాడు. మాంఛెస్టర్ యునైటెడ్ దీర్ఘ కాలంగా గారెథ్ బాలె కోసం భారీగానే ఆకాంక్షలు పెట్టుకున్నది. అయితే గారెథ్ బాలె కోసం మాంఛెస్టర్ యునైటెడ్ మేనేజ్మేంట్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు తెలుసునని వార్తలొచ్చాయి.

 గారెథ్ బాలే కోసం ఇంటర్ మిలాన్ ప్రయత్నాలు ఇలా

గారెథ్ బాలే కోసం ఇంటర్ మిలాన్ ప్రయత్నాలు ఇలా

కానీ స్పానిష్ దిన పత్రిక డాన్ బాలోన్ కథనం ప్రకారం గారెథ్ బాలెను తమ జట్టు చేర్చుకునేందుకు ఇంటర్ మిలాన్ క్లబ్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు రియల్ మాడ్రిడ్ జట్టుకు లక్ష్యంగా ఉన్న మౌరో ఇకార్డీతో కలిసి మంచి పార్టనర్‌షిప్‌తో ముందుకు దూసుకెళ్లగలమని బాలె భావిస్తున్నారు. చెల్సియా కూడా బాలె పరిస్థితిని అంచనా వేస్తోంది. గతవారం ఆయనకు 51 మిలియన్ల యూరోల ఆఫర్ ఇచ్చింది.

Story first published: Wednesday, April 25, 2018, 17:30 [IST]
Other articles published on Apr 25, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X