Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెస్సీ నోటి దూల: మూడు నెలలు నిషేధం, జరిమానా

Footballer Lionel Messi banned from international football for three months

హైదరాబాద్: అర్జెంటీనా పుట్‌బాల్ జట్టు కెప్టెన్ లియోనల్‌ మెస్సీపై మూడు నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీపై అతడు అవినీతి ఆరోపణలు చేసిన కారణంగా అతడిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు నిషేధంతో పాటు 50 వేల డాలర్ల జరిమానా కూడా విధించింది. ఈ నిషేధాన్ని అప్పీల్‌ చేసేందుకు మెస్సీకి ఏడు రోజుల సమయం కూడా ఇచ్చింది.

అసలేం జరిగింది?

ఈ ఏడాది జూన్‌-జూలై నెలలో బ్రెజిల్‌ వేదికగా జరిగిన కోపా అమెరికా కప్‌-2019లో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 తేడాతో గెలుపొందింది. చిలీతో తలపడిన మ్యాచ్‌లో మెస్సీ రెడ్‌కార్డ్‌ ఎదుర్కొన్నాడు. దానివల్ల వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ తొలి మ్యాచ్‌కూ సైతం నిషేధానికి గురయ్యాడు.

దీంతో దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీపై మెస్సీ తీవ్ర విమర్శలు చేశాడు. బ్రెజిల్‌ విజేతగా నిలిచేందుకు గవర్నింగ్‌ బాడీ అవినీతికి పాల్పడిందంటూ విమర్శలు గుప్పించాడు. ఆ తర్వాత మెస్సీ తన ఆరోపణలపై ఫుట్‌బాల్‌ సమాఖ్యకు క్షమాపణలు కూడా చెప్పాడు.

అయితే, మెస్సీ అవినీతో ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీ మూడు నెలల పాటు నిషేధం విధించింది. ఒకవేళ మెస్సీ గనుక మూడు నెలల పాటు నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తే .. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో అర్జెంటీనా తలపడే చిలీ, మెక్సికో, జర్మనీ మ్యాచ్‌ల్లో ఆడలేడు.

మెస్సీ నిషేధంపై అటు అర్జెంటీనా యాజమాన్యం కానీ... ఇటు మెస్సీ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక, కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో బ్రెజిల్‌ 3-1 తేడాతో పెరూపై గెలిచి విజేతగా నిలిచింది.

Story first published: Saturday, August 3, 2019, 16:06 [IST]
Other articles published on Aug 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+