మ్యాచ్ గెలిస్తే.. పిజ్జా తినిపిస్తా..!

Posted By:
Football club owner investigated after revealing he buys players McDonalds if they win

హైదరాబాద్: మెచ్చుకోలు అనేది ఒక్కొక్కరిదీ ఒక్కో రకంగా ఉంటుంది. భుజం తట్టి చెప్పడమో, కౌగిలించుకునో, బహుమతులిచ్చో ఇలా వేర్వేరు రకాలుగా.. ఈ తరహాలోనే ఓ ఫుట్‌బాల్ కోచ్ తన ఆటగాళ్లకు ప్రత్యేకమైన విందు ఇస్తున్నాడు. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మ్యాచ్ గెలిస్తే మెక్ డొనాల్డ్‌కి తీసుకెళ్లి పిజ్జా తినిపిస్తాడంట. జట్టు మొత్తాన్ని తీసుకెళ్లి ఇలా ఆనందం పంచుకోవడం చాలా బాగుంటుందంటాడు మిస్టర్ హోల్ట్.

ఇలా వరుసగా మ్యాచ్ గెలిస్తే పిజ్జా ఇప్పించడం వంటివి చేసి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుండటంతో కొన్ని సార్లు జట్టు యాజమాన్యం నిధుల దుర్వినియోగం జరుగుతుందంటూ బయటి ఫుడ్‌కు తాము బిల్ చెల్లించమని చెప్పేసిందట. అయినా తాను ఆటగాళ్ల కోసం వెనక్కి తగ్గేది లేదని సొంత ఖర్చుతో పార్టీలు ఇస్తున్నాడు.

ఈ విషయం గురించి స్పందించిన ఆయన 'ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు నేను చాలా కాలంగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాను. వాళ్ల నుంచి కూడా మంచి స్పందనే వచ్చింది. కానీ, అనుకోకుండా ఒక రోజు ఇంగ్లీష్ ఫుట్‌బాల్ నిర్వహకుల నుంచి లెటర్ వచ్చింది. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. బయట తినుబండారాలను ఆపేయాలి.' అన్నారు. వాటి బిల్లులు పొందుపరచట్లేదంటూ వారు పేర్కొన్నారట.

అందుకని ఆ రోజు నుంచి మ్యాచ్ గెలిస్తే వాళ్లికి హోల్ట్ ఖర్చులతోనే పిజ్జా తినిపిస్తాడు. ఒకవేళ ఓడిపోతే మాత్రం సొంత ఖర్చులతో తినాల్సిందే. ఈ పనిని ఆటగాళ్లలో స్ఫూర్తిని రగిలించాలని చేస్తున్నాడా.. పిజ్జా మీద ప్రేమను ఆటలో గెలుపుకోసం వాడుకుంటున్నాడా అనేది సందిగ్ధం. అతను మాత్రం 'నా డబ్బు.. నా ఇష్టం' అంటున్నాడు.

Story first published: Tuesday, April 3, 2018, 15:24 [IST]
Other articles published on Apr 3, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి