న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

తెలుసుకోండి: 2018 ఫిఫా వరల్డ్ కప్ మస్కట్‌గా ‘జబివాక’

By Nageshwara Rao
FIFA World Cup 2018 official mascot Zabivaka unveiled

హైదరాబాద్: సాకర్ సంబరం మొదలైంది. 2018లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌కు రష్యా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వాహకులు వరల్డ్ కప్‌కు సంబంధించిన పోస్టర్, మస్కట్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై రష్యా గోల్‌కీపర్‌ లివ్‌ యాషిన్‌ ఫొటోను ఉంచారు.

FIFA World Cup 2018 official mascot Zabivaka unveiled

1958, 1962, 1966, 1970లలో వరుసగా నాలుగు వరల్డ్ కప్‌లకు ప్రాతినిధ్యం వహించిన యాషిన్ 1990లో మరణించాడు. అంతేకాదు ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు ఇచ్చే ప్రతిష్టాత్మక బాలోన్ డీ ఓర్ అవార్డుని అందుకున్న ఏకైక గోల్ కీపర్ యాషినే కావడం విశేషం.

World Cup Qualifying - In Words and Numbers

ఆ తర్వాత ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించిన మస్కట్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు. రష్యాలో కనిపించే తోడేలును మస్కట్‌గా ఎంచుకున్నారు. దీనికి జబివాకగా పేరు పెట్టారు. 2018 జూన్‌ 14 నుంచి జులై 15 వరకు జరిగే ప్రపంచకప్‌ పోటీలకు రష్యా ఆతిథ్యం ఇస్తోంది.

మొత్తం 32 దేశాలు ప్రపంచకప్‌ పోటీల్లో తలపడనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన డ్రాను నిర్వాహకులు శుక్రవారం వెల్లడించనున్నారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఫిఫా సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ 'వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న రష్యా ఎంతో గర్వపడాల్సిన సమయం ఇది. ఆ దేశంలో పోటీలు నిర్వహిస్తున్నప్పుడే ఆ దేశ ఆటగాడి చిత్రాన్ని పోస్టర్‌గా ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉంది' అని అన్నారు.

Story first published: Thursday, November 30, 2017, 10:49 [IST]
Other articles published on Nov 30, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X