న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

కెరీర్‌లో ఇంతలా బాధపడింది లేదు: మెస్సీ

FIFA World Cup 2018: Never suffered this much, says Lionel Messi

హైదరాబాద్: అన్నీ జట్ల మాదిరిగానే ప్రపంచ కప్‌ ట్రోఫీ గెలుచుకోవాలనే ఆశతోనే అర్జెంటీనా కూడా బరిలోకి దిగింది. అంతేకాదు దాంతో పాటుగా అర్జెంటీనాకు మరో ప్రత్యేకత ఉంది. అర్జెంటీనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ.. ఈ టోర్నీలో ట్రోఫీని సొంతం చేసుకుని ఫుట్‌బాల్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలని యోచిస్తున్నాడట. దీంతో అంచనాలు పెరిగిపోగా ఆరంభ మ్యాచ్‌లలో పేలవమైన ప్రదర్శనతో అభిమానుల ఆశలను నీరుగార్చింది.

14వ నిమిషంలో అర్జెంటీనాకి గోల్‌ చేసిన మెస్సీ:

ఫిఫా ప్రపంచకప్‌ 2018లో జూన్ 26న జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా ఆఖరి నిమిషంలో నాకౌట్‌కి అర్హత సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ఆ జట్టు.. నాకౌట్ రేసులో నిలవాలంటే మంగళవారం రాత్రి నైజీరియాతో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో 14వ నిమిషంలో మెస్సీ గోల్‌ చేసి అర్జెంటీనాకి ఆధిక్యం అందించినా.. 51వ నిమిషంలో నైజీరియా ఆ ఆధిక్యాన్ని 1-1తో సమం చేసింది.

అర్జెంటీనాకు ఇక ఇంటిబాట పట్టక తప్పదని

దీంతో.. అర్జెంటీనా ఇక ఇంటిబాట పట్టక తప్పదని చాలా మంది తేల్చేశారు. కానీ.. అనూహ్యంగా.. మ్యాచ్ మరో 4 నిమిషాల్లో ముగుస్తుందన్న దశలో రొజో కళ్లు చెదిరే గోల్‌తో అర్జెంటీనా నాకౌట్ ఆశలకి జీవం పోశాడు. సుదీర్ఘ కెరీర్‌లో మునుపెన్నడూ ఈ తరహా వేదనకి గురికాలేదని మెస్సీ వెల్లడించాడు.

కనీసం ఒక గోల్‌ కూడా చేయలేకపోయిన మెస్సీ..

తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ కనీసం ఒక గోల్‌ కూడా నమోదు చేయలేకపోయిన మెస్సీ.. తీవ్ర ఒత్తిడి మధ్య నైజీరియాతో మ్యాచ్ ఆడి ఎట్టకేలకి ప్రపంచకప్‌లో గోల్ ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. 31 ఏళ్ల ఈ దిగ్గజ ఫుట్‌బాలర్‌కి ఇదే చివరి ప్రపంచకప్ అని ప్రచారం జరుగుతుండగా.. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకు మెస్సీ ఒక ప్రపంచకప్‌ని కూడా గెలవలేదు.

నా కెరీర్‌లో ఇంతలా బాధపడింది లేదు:

‘దేవుడు మాతోనే ఉన్నాడని నాకు తెలుసు. గ్రూప్ దశలోనే అర్జెంటీనా‌ నిష్క్రమించేలా అతను చేయడు. నైజీరియాతో మ్యాచ్‌లో గెలుస్తామని మేము కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అయినప్పటికీ ఆశలు వదిలేసిన స్థితిలో మళ్లీ గెలవడం ఓ అద్భుతం. టోర్నీ ఆరంభంలో పేలవ ప్రదర్శనతో మేము గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాం. నా కెరీర్‌లో నేను ఇంతలా బాధపడింది లేదు. తాజాగా నాకౌట్‌కి అర్హత సాధించడం అర్జెంటీనా జట్టుకి గొప్ప ఉపశమనం' అని మెస్సీ వెల్లడించాడు.

Story first published: Thursday, June 28, 2018, 14:57 [IST]
Other articles published on Jun 28, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X