న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

వాట్ ఎ మ్యాచ్: చివరి నిమిషంలో సెల్ఫ్ గోల్, మొరాకోపై ఇరాన్ విజయం

By Nageshwara Rao
Morocco 0-1 Iran

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఇరాన్ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా గ్రూప్-బిలో శనివారం మొరాకో, ఇరాన్ జట్లు తలపడ్డాయి. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో మొరాకోపై 1-0తేడాతో ఇరాన్ విజయం సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

చివరి నిమిషం వరకు ఒక్క గోల్‌ నమోదు కాని ఈ మ్యాచ్‌లో రెండో అర్ధభాగంలో మొరాకో ఆటగాడు అజీజ్ బుష్డౌజ్ స్వీయ తప్పిదంతో గోల్ నమోదైంది. దీంతో ఇరాన్ శిబిరంలో ఒక్కసారిగా ఆనందం వెల్లువిరిసింది. మ్యాచ్ అరంభం నుంచీ ఇరు జట్లు గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి.

బంతిని ఎక్కువ సేపు తమ ఆధీనంలో ఉంచుకున్న మొరాకో జట్టు పలుమార్లు ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై దాడులు చేసిన ఇరాన్ గోల్ కీపర్ సమర్ధవంతగా వాటిని అడ్డుకున్నాడు. దీంతో తొలి అర్ధభాగం ఎలాంటి గోల్ నమోదు కాకుండానే ముగిసింది. ఇక, రెండో అర్ధభాగంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు.

1
958028

90 నిమిషాలపాటు ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలం కావడంతో మ్యాచ్ దాదాపు డ్రా దిశగా సాగింది. అయితే ఇంజ్యూరీ సమయంలో మొరాకో డిఫెండర్ ఎషాన్ హాజీ షఫీ క్రాస్‌ను గోల్‌పోస్టు బయటకు కొట్టే ప్రయత్నంలో అజీజ్ బొహౌద్దౌజ్ తడబడ్డాడు. అతను గురితప్పడంతో బంతి మొరాకో గోల్‌పోస్టులోకి దూసుకెళ్లింది.

బంతి దిశను మార్చడంలో అజీజ్ పొరపాటుకు మొరాకో భారీ మూల్యం చెల్లించింది. ఆట చివరి నిమిషాల్లో గోల్ కావడంతో ఇరాన్ ఆటగాళ్లు సంబురాల్లో మునగగా.. అజీజ్ కన్నీటిపర్యంతమయ్యాడు. దీంతో తోటి ఆటగాళ్లు అతన్ని ఓదార్చుతూ మైదానం బయటకు తీసుకెళ్లారు.

మొరాకో జట్టు 14 సార్లు ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై దాడులు చేయగా, ఇరాన్ కేవలం 8 సార్లు మాత్రమే ఈ దాడులు చేసింది. ఈ మ్యాచ్‌‌‌లో మొరాకో జట్టు 22 సార్లు అనవసర తప్పిదాలు చేయగా, ఇరాన్ 14 తప్పిదాలు మాత్రమే చేసింది. గోల్‌ కోసం మొరాకో జట్టు ఆరు సార్లు ప్రయత్నించగా ఇరాన్ గోల్‌ కీపర్ సమర్ధవంతంగా అడ్డుకున్నాడు.

ప్రపంచకప్‌లో 13 మ్యాచ్‌లాడిన ఇరాన్‌కు ఇది కేవలం రెండో గెలుపు మాత్రమే కావడం గమనార్హం. 2010 తర్వాత ఓ ఆసియా జట్టు విజయం సాధించడమూ ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌కు ముందు ఇరాన్‌కు లభించిన ఏకైక విజయం 1998 వరల్డ్‌ కప్‌లో అమెరికాపై 2-1తో దక్కింది.

టోర్నీలో భాగంగా ఇరాన్ తన తదుపరి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుండగా, మొరాకో జట్టు పోర్చుగల్‌తో తలపడనుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఈ మ్యాచ్‌కి సాకర్ అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. మ్యాచ్ జరిగిన సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేడియానికి శనివారం 62,548 మంది సాకర్ అభిమానులు తరలివచ్చారు.

Story first published: Saturday, June 16, 2018, 12:37 [IST]
Other articles published on Jun 16, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X