న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పనామాపై గెలుపొంది.. నాకౌట్‌కు చేరిన ఇంగ్లాండ్

Harry Kane did the star turn with a stunning

హైదరాబాద్: ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ అదరగొడుతోంది. గ్రూప్‌-జిలో పనామాతో జరిగిన మ్యాచ్‌లో 6-1తో ఇంగ్లాండ్‌ ఘనవిజయం సాధించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కెప్టెన్‌ కేన్‌(22వ, 45+1, 62వ నిమిషంలో) హ్యాట్రిక్‌ గోల్‌తో చెలరేగిపోవడంతో పసికూన పనామా చిత్తుగా ఓడింది. కేన్‌కు తోడుగా డిఫెండర్‌ స్టోన్స్‌(8వ, 40వ), లింగార్డ్‌(36వ నిమిషంలో) కూడా దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్‌ అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

మ్యాచ్‌ ఆరంభం నుంచి ఎటాకింగ్‌ గేమ్‌ మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌కు 8వ నిమిషంలోనే తొలి గోల్‌ లభించింది. డిఫెండర్‌ స్టోన్స్‌ కార్నర్‌షాట్‌ను హెడర్‌గోల్‌గా మలిచి ఇంగ్లాండ్‌కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకున్న ఇంగ్లాండ్‌.. పనామా డిఫెన్స్‌ను ఛేదిస్తూ సులభంగా గోల్స్‌ సాధిస్తూ వచ్చింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇంగ్లాండ్‌ 5-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

1
958061

రెండో అర్ధభాగంలోనూ ఇంగ్లాండ్‌ అదే జోరు కొనసాగించింది. కెప్టెన్‌ కేన్‌ 62వ నిమిషంలో హ్యాట్రిక్‌ గోల్‌తో ఇంగ్లాండ్‌ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఆ తర్వాతి నుంచి ఇంగ్లాండ్‌ పదేపదే గోల్‌ కోసం దాడి చేస్తూ పనామాను ఒత్తిడిలోకి నెట్టేసింది. ఐతే చివర్లో ఈ జట్టు పోరాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే 78నిమిషంలో పనామా ఆటగాడు బల్వోయి ప్రపంచకప్‌ చరిత్రలో తమ జట్టుకు తొలి గోల్‌ అందించాడు.

ప్రపంచకప్ టోర్నీలో ఒక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఐదు గోల్స్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1986 తరువాత ఇంగ్లాండ్ టీమ్‌లో ఒక ఆటగాడు హ్యాట్రిక్ గోల్స్ చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుత టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా హ్యారీకేన్ కొనసాగుతున్నాడు.

Story first published: Sunday, June 24, 2018, 20:14 [IST]
Other articles published on Jun 24, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X