న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

వరల్డ్ కప్ కోసం.. ఫ్యాక్టరీలు మూసేశారు, నవ్వడం నేర్పిస్తున్నారు

FIFA World Cup 2018: Fans Create Havoc With Security As Neymar Trains In Sochi

హైదరాబాద్: మరి కొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగించే క్రీడా సంరంభం మొదలుకానుంది. ఈ వేడుకకు వేదికయ్యేందుకు రష్యా ఇప్పటికే సిద్ధమైపోయింది. ఈ సందర్భంగా.. టోర్నమెంట్లో పాల్గొననున్న 32జట్లు ఇప్పటికే రష్యాలో అడుగుపెట్టి ప్రాక్టీసు మొదలెట్టేశాయి. ప్రపంచ ఫుట్‌బాల్‌ సంరంభానికి కౌంట్‌డౌన్‌ ఇంకొన్ని గంటల్లోనే కావడంతో.. అభిమానులను ఉర్రూతలూగించాలని సూపర్‌స్టార్లు.. గరిష్ట వినోదం పొందాలని తహతహలాడుతున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మా దేశానికి:

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మా దేశానికి:

‘ఫిఫా ప్రపంచకప్‌ అంటే.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మా దేశానికి వస్తారు. కొంతకాలం ఇక్కడ ఉంటారు. ఈ దేశంపై కొత్త అభిప్రాయంతో వెళ్తారు. రష్యాపై వారి అభిప్రాయం తప్పక మారుతుంది' అని ఓ స్థానికుడు వ్యాఖ్యానించాడు.

స్టేడియాల నిర్మాణం ఏర్పాట్ల కోసం వేల కోట్లు ఖర్చు:

స్టేడియాల నిర్మాణం ఏర్పాట్ల కోసం వేల కోట్లు ఖర్చు:

స్టేడియాల నిర్మాణంతో పాటు ఇతర ఏర్పాట్ల కోసం వేల కోట్లు ఖర్చు చేశారు. ఆటగాళ్లు, అభిమానులకు ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా అత్యున్నత స్థాయి వసతులు కల్పించడంపై దృష్టిపెట్టారు. అంతటితో ఆగకుండా ప్రపంచకప్‌ కోసం పని చేసే కార్మికులు, వాలంటీర్లలో సానుకూల దృక్పథాన్ని అలవరిచే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అతిథులతో మర్యాదపూర్వకంగా ఎలా ప్రవర్తించాలో చెబుతూ.. ఇంగ్లిష్‌లో చక్కటి పదాలు అలవాటు చేస్తున్నారు. ఆహ్లాదకరంగా నవ్వడమూ నేర్పిస్తున్నారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు:

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు:

ఎలాంటి ఆటంకాలు, అపశ్రుతులు తలెత్తకుండా.. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఘనంగా నిర్వహించి తమపై ప్రతికూల అభిప్రాయాన్ని మార్చాలన్న ఉద్దేశం రష్యా అధికారుల్లో బలంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఉగ్రవాదం, గుండాయిజంతో పొంచి ఉన్న ముప్పు ప్రపంచకప్‌పై నీలినీడలను కమ్మేసింది. ఈ నేపథ్యంలో రష్యా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసింది. గగనతల రక్షణ వ్యవస్థను మోహరించింది. ప్రపంచకప్‌కు వస్తున్న అభిమానుల నేపథ్యాన్ని కూడా గట్టిగా తనిఖీ చేస్తోంది.

రవాణావ్యవస్థపై కూడా గట్టి నిఘా:

రవాణావ్యవస్థపై కూడా గట్టి నిఘా:

దాడుల భయంతో ప్రమాదకర పదార్థాల శుద్ధి చేసే పరిశ్రమలను వాటి యజమానులు మూసివేశారు. ప్రపంచకప్‌ మ్యాచ్‌ల చూసేందుకు వచ్చే వివిధ దేశాల అభిమానులు 12 ఆతిథ్య నగరాల్లో ఎక్కడో ఒక చోట పోలీసుల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. ఎనిమిదేళ్లలో రష్యాలో ప్రజా రవాణా వ్యవస్థపై అనేక మానవబాంబు దాడులు జరిగాయి. అనేక ప్రయత్నాలను భగ్నం చేశారు కూడా. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థపై కూడా అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది.

Story first published: Wednesday, June 13, 2018, 14:20 [IST]
Other articles published on Jun 13, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X