న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

గ్రేట్ గేమ్ ఆఫ్ పుట్‌బాల్: 'చిరకాల కల నెరవేరబోతోంది'

By Nageshwara Rao
FIFA World Cup 2018: Belgium excited by the challenge of facing Brazil, says coach Roberto Martinez

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌ మరో అంకానికి రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు జట్లతో మొదలైన టోర్నీ అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం బ్రెజిల్-బెల్జియం జట్లు తలపడనున్నాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఇందులో ప్రత్యర్థులపై గెలవడం ద్వారా సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు జట్లు తహతహలాడుతున్నాయి. ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌ను 3-2తో ఓడించిన బెల్జియం క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రెజిల్‌తో తలపడనున్న తరుణంలో ఆ జట్టు కోచ్ రోబెర్టో మార్టినెజ్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తమ చిరకాల కల నెరవేరబోతోందని అన్నాడు.

"బ్రెజిల్ ఏరకంగా చూసుకున్నా మాకంటే బలమైన జట్టు. అయినా సరే ఈ మ్యాచ్‌లో విజయం మాదే. ఈ విజయంతో మాకు బంగారు భవితవ్యం రానుంది. ఇందుకు అనుగుణంగా తమ కుర్రాళ్లు అన్నివిధాలా సంసిద్ధంగా ఉన్నారు" అని తెలిపాడు.

మా జట్టులో ఎంతో ప్రతిభా సామర్థ్యాలు కలిగిన ఈడెన్ హజార్డ్ (చెలీసా), కెవిన్ డి బ్రూనే (మాంచెస్టర్ సిటీ), రొమేలు లుకాకు (మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రయికర్) వంటి ఆటగాళ్లు ఎంతోమంది తమకు బలమైన ఆయుధాలుగా ఉన్నారని మార్టినెజ్ పేర్కొన్నాడు.

క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్‌లోని అడ్డంకులన్నింటినీ అధిగమించి జులై 15న మాస్కో వేదికగా జరిగే ఫైనల్స్‌లో తప్పకుండా చోటు దక్కించుకుంటామని మార్టినెజ్ ధీమా వ్యక్తం చేశాడు. ఫిఫా ర్యాంకుల్లో మూడో ర్యాంకులో ఉన్న బెల్జియం జట్టు 2014లో బ్రెజిల్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లింది.

క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియంతో తలపడే బ్రెజిల్ నాకౌట్‌లో మెక్సికోపై 2-0తో విజయం సాధించింది. మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేయ్‌మార్, రోబెర్టో ఫిర్మినో చెరో గోల్ చేసి క్వార్టర్ ఫైనల్స్‌లోకి తీసుకెళ్లారు. కీలకమైన మ్యాచ్‌లో నెయ్‌మార్ ఫామ్‌లోకి రావడం బ్రెజిల్‌కు కలిసొచ్చే అంశం.

మరోవైపు బ్రెజిల్‌ జట్టులో జావో మిరండా, టియాగో సిల్వ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియంపై గెలిస్తే ఫ్రాన్స్-ఉరుగ్వే జట్ల మధ్య జరగనున్న పోరులో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టుతో సెమీఫైనల్స్‌లో తలపడనుంది.

బ్రెజిల్‌ (vs) బెల్జియం రాత్రి గం.11.30 నుంచి
సోనీ ఈఎస్‌పీఎన్, సోనీ టెన్‌-2, 3లలో ప్రత్యక్ష ప్రసారం

Story first published: Friday, July 6, 2018, 17:24 [IST]
Other articles published on Jul 6, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X