ముగిసిన భారత్ కథ: ఫిఫా వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమణ

Posted By:

హైదరాబాద్: భారత్ తొలిసారిగా అతిథ్యమిస్తోన్న ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి ఆడిన భారత కుర్రాళ్లు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయారు. గ్రూప్-ఎలో భాగంగా గురువారం ఘనా జట్టుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 0-4 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది.

దీంతో టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయలేకపోయిన ఆతిథ్య భారత జట్టు లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. రెండోమ్యాచ్‌లో కొలంబియాపై స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత యువకులు, పటిష్టమైన ఘనా జట్టు ముందు మాత్రం తేలిపోయారు.

 మ్యాచ్ ప్రారంభం నుంచే ఎదురుదాడి

మ్యాచ్ ప్రారంభం నుంచే ఎదురుదాడి

మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్‌పై ఎదురుదాడికి దిగిన ఘనా ఆటగాళ్లు పోరు ఆద్యంతం ఆధిపత్యం చాటుకున్నారు. ఘనా కెప్టెన్ ఎరిక్ అహియా రెండు గోల్స్ సాధించి జట్టు భారీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఘనా తరఫున కెప్టెన్‌ ఎరిక్‌ అయా రెండు గోల్స్‌ (43వ, 52వ నిమిషాల్లో) చేశాడు.

 ఘనా కెప్టెన్ అయా రెండు గోల్స్

ఘనా కెప్టెన్ అయా రెండు గోల్స్

రిచర్డ్‌ డాన్సో (86వ), ఎమాన్యుయల్‌ టోకు (87వ) చెరో గోల్‌ సాధించారు. తాజా విజయంతో గ్రూప్-ఎలో ఘనా టాపర్‌గా నిలిచి ప్రీక్వార్టర్స్‌కు నేరుగా అర్హత సాధించింది. మరో మ్యాచ్‌లో 3-1తో అమెరికాను ఓడించిన కొలంబియా రెండో స్థానంతో ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అమెరికా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

 అమెరికాపై గెలుపొందిన కొలంబియా

అమెరికాపై గెలుపొందిన కొలంబియా

గురువారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో కొలంబియా 3-1తో అమెరికాపై గెలుపొందగా, పరాగ్వే 3-1తో టర్కీని ఓడించింది. మాలి జట్టు 3-1తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. కొలంబియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు చక్కని ప్రదర్శన కనబర్చడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆట చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

ఘనాదే మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యాం

ఘనాదే మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యాం

శారీరకంగా.. వేగం, నైపుణ్య పరంగా భారత్‌ కన్నా ఎంతో మెరుగ్గా ఉన్న ఘనా ఆటగాళ్లు మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మ్యాచ్‌లో బంతి ఎక్కువ శాతం ఘనా ఆటగాళ్లు నియంత్రణలో ఉండటం విశేషం. మ్యాచ్‌ ఆసాంతం భారత డిఫెన్స్‌ను ఒత్తిడిలో ఉంచింది. ఈ మ్యాచ్‌లో ఎక్కువభాగం భారత్‌ డిఫెన్స్‌కే పరిమితమైంది.

 రెండో అర్ధభాగంలో డిఫెన్స్‌కే పరిమితమైన భారత్

రెండో అర్ధభాగంలో డిఫెన్స్‌కే పరిమితమైన భారత్

మరోవైపు ఘనా పదే పదే భారత్ గోల్ పోస్టుపై దాడులు చేసి గోల్స్ సాధించింది. ఇక, రెండో అర్ధభాగంలోనూ భారత్‌ డిఫెన్స్‌కే పరిమితమైంది. అయితే ఘనా మాత్రం తన జోరుని పెంచింది. అయా 52వ నిమిషంలో మరో గోల్‌తో ఘనాను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. చివర్లో డాన్సో, టోకు చెరో గోల్స్‌ చేయడంతో భారత్‌పై ఘనా 4-0తో విజయం సాధించింది.

Story first published: Friday, October 13, 2017, 10:21 [IST]
Other articles published on Oct 13, 2017
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి