మూడో వ్యక్తి జోక్యంపై కఠిన నిర్ణయం: పాక్‌పై వేటు వేసిన ఫిఫా

Posted By:

హైదరాబాద్: పుట్‌బాల్ వరల్డ్ పరిపాలన సమాఖ్య ఫిఫా సంచలన నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశమైన పాకిస్థాన్‌పై ఫిఫా వేటు వేసింది. పాకిస్థాన్ పుట్‌బాల్ ఫెడరేషన్ (పీఎఫ్ఎఫ్)లో మూడో వ్యక్తి జోక్యాన్ని ఇష్టం లేని ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది.

అసలేం జరిగింది?
మూడేళ్లుగా పాకిస్థాన్ పుట్‌బాల్ పరిపాలనలో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ పుట్‌బాల్ ఫెడరేషన్ (పీఎఫ్ఎఫ్) అధ్యక్ష ఎన్నిక ముందు పంజాబ్‌ పుట్‌బాల్‌ సమాఖ్య పాలక వర్గం రెండుగా చీలిపోయింది. రెండు వర్గాలు తమ అభ్యర్థే విజేతగా అని ప్రకటించాయి.

FIFA suspends Pakistan for third-party interference

దీంతో ఈ పంచాయితీ అక్కడి కోర్టుకి చేరింది. చేసేదేం లేక కోర్టు మూడో వ్యక్తిని పాలకుడిగా నియమించింది. రెండేళ్లలోపు ఎన్నికలు జరిగే వరకు ఆయనే పాలనా బాధ్యతలు చూస్తారని ఆదేశించింది. దీనిపై ఫిఫా కౌన్సిల్ బ్యూరో మూడో వ్యక్తి పెత్తనాన్ని సహించలేమని పాక్‌పై వేటు వేసింది.

అంతేకాదు పాకిస్థాన్ పుట్‌బాల్ ఫెడరేషన్ (పీఎఫ్ఎఫ్) సమాఖ్యలో న్యాయస్థానం నియమించిన మూడో వ్యక్తి దిగిపోయేంత వరకు నిషేధం కొనసాగుతుందని తెగేసి చెప్పింది.

Story first published: Thursday, October 12, 2017, 12:23 [IST]
Other articles published on Oct 12, 2017
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి