న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సాకర్ కప్ భద్రతకు రష్యా సర్వత్రా సిద్ధం

FIFA’s Infantino says planning to attend matches of all 32 teams at World Cup

హైదరాబాద్: ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహించడానికి ఆతిథ్యం ఇవ్వడంలో రష్యా విమర్శలను, సాధక బాధకాలను ఎదుర్కొంటూ ఉంటే ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ ఫాంటినో మాత్రం ఫుట్‌బాలర్లలో విశ్వాసం కల్పించేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు. వచ్చే గురువారం నుంచి ప్రారంభం కానున్న ఫిఫా సాకర్ కప్ సంరంభం నుంచి అన్ని జట్ల మ్యాచ్‌లకూ హాజరు కావాలని ఇన్ ఫాంటినో నిర్ణయించుకున్నారు.

సాకర్ నిర్వహణకు రష్యా సర్వ సన్నద్ధం

సాకర్ నిర్వహణకు రష్యా సర్వ సన్నద్ధం

ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు రష్యా వందశాతం సిద్ధంగా ఉందని చెప్పగలమంటూ ఇన్‌ఫాంటినో విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే వివిధ దేశాల నుంచి టోర్నీలో పాల్గొనేందుకు రష్యాకు వచ్చే ఆటగాళ్లు, ఆయా జట్ల మేనేజర్లు, అధికారులు, ఫ్యాన్స్‌కు భద్రత, ఆతిథ్య వసతులను కల్పిస్తామని ఇన్ ఫాంటినో హామీ ఇచ్చారు. అతిపెద్ద వేడుకగా భావించే ఫిఫా టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై రష్యా పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. ఇందుకోసం రష్యా ప్రభుత్వం, అధికారులు చాలా పూర్తిగా కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. టోర్నీలో పాల్గొనేందుకు వస్తున్న వివిధ దేశాల పోలీసు అధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ పూర్తిగా సహకారం అందిస్తూ తీసుకుంటున్నారని ఇన్‌ఫాంటినో తెలిపారు.

తొలిసారి సాకర్‌లో ‘వీడియో అసిస్టెంట్ రిపరీ’ విధానం

తొలిసారి సాకర్‌లో ‘వీడియో అసిస్టెంట్ రిపరీ’ విధానం

జూన్ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో తొలిసారి ‘వీడియో అసిస్టెంట్ రిఫరీస్ (వీఎఆర్) వ్యవస్థను ప్రవేశపెడుతున్నాం' అని జియాన్నీ ఇన్‌ఫాంటినో తెలిపారు. రెండు సంవత్సరాల పాటు ‘వీఎఆర్'ను ప్రయోగాత్మకంగా వినియోగించిన తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. వీఎఆర్ వల్ల రిఫరీలకు చాలా సహాయంగా ఉంటుందని తెలిపారు.

తొలి మ్యాచ్‌కు సౌదీరాజు, పుతిన్‌తోపాటు ఇన్‌ఫాంటినో

తొలి మ్యాచ్‌కు సౌదీరాజు, పుతిన్‌తోపాటు ఇన్‌ఫాంటినో

మాస్కోలోని టుజ్నికి స్టేడియంలో ఈ నెల 14న ఆతిథ్య జట్టు రష్యా, సౌదీ అరేబియా జట్టు మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ లతోపాటు ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ ఫాంటినో కూడా హాజరై క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగిల్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అప్పటి నుంచి రష్యాలోని 11 నగరాల్లోని 12 స్టేడియంలలో జరిగే మ్యాచ్‌లకూ ఇన్‌పాంటినో హాజరవుతారు.

మాస్కో యూనివర్శిటీలో పీలే స్పీచ్

మాస్కో యూనివర్శిటీలో పీలే స్పీచ్

ఫిఫా సాకర్ కప్ సంరంభం ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందు రష్యా రాజధాని మాస్కో స్టేట్ యూనివర్సిటీలో ఈ నెల 11వ తేదీన బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ పీలే ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని మాస్కో యూనివర్సిటీ అధిపతి విక్టోర్ సాదోవ్నిచీ ధ్రువీకరించారు. ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 1958, 1962, 1970 ఫిఫా వరల్డ్ కప్ టైటిళ్లను గెలుచుకున్నారు పీలే. 1990లో ‘వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది సెంచురీ' అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన వివిధ జట్ల మ్యాచ్‌ల డ్రాలో పాల్గొనేందుకు పీలేతోపాటు ఇతర ఫుట్‌బాల్ లెజెండ్స్ పాల్గొన్నారు.

Story first published: Thursday, June 7, 2018, 14:34 [IST]
Other articles published on Jun 7, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X