న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా ఆతిథ్య హక్కులు అప్పగించాల్సిందేనా..?

FIFA must let Morocco World Cup bid reach vote to avoid impropriety - official

హైదరాబాద్: మొరాకో అభ్యర్థన మేరకు 2026 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను 'ఫిఫా'కు తప్పనిసరిగా అప్పగించాల్సిందేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొరాకో బిడ్‌పై ఫిఫా కార్యవర్గం తప్పనిసరిగా మద్దతు తెలపాల్సిన పరిస్థితి నెలకొంది. సెలెక్షన్ ప్రక్రియపై ఎటువంటి సందేహాలు లేవనెత్తకుండా ఉండాలంటే మొరాకో బిడ్‌ను ఆమోదించాల్సిందేనని జర్మనీకి చెందిన ఫిఫా సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.

2026 సాకర్ కప్ ఆతిథ్య హక్కుల కోసం మొరాకోతోపాటు అమెరికా కూటమి బిడ్

2026 సాకర్ కప్ ఆతిథ్య హక్కుల కోసం మొరాకోతోపాటు అమెరికా కూటమి బిడ్

మొరాకోతోపాటు అమెరికా - మెక్సికో - కెనడా దేశాల కూటమి 2026 ప్రపంచ‌కప్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్ దాఖలు చేశాయి. ఈ తరుణంలో ఇటీవల మొరాకోలో ప్రపంచకప్ నిర్వహణకు మొరాకోలో జరుగుతున్న ఏర్పాట్లపై తనిఖీలు నిర్వహించిన ఫిఫా అధికారుల టీం పెదవి విరిచింది. మొరాకో వసతుల కల్పన, ఇతర సౌకర్యాలను కల్పించడంలో వైఫల్యాలను ఫిఫా తనిఖీ టీం ఎత్తి చూపింది. దీంతో జూన్ 13వ తేదీన రష్యా రాజధాని మాస్కోలో జరిగే ఫిఫా కార్యవర్గ భేటీలో మొరాకో బిడ్‌ను డిస్‌క్వాలిఫై చేస్తారని సందేహాలు తలెత్తాయి.

 మొరాకో బిడ్‌పై అనర్హత పడకుండా చూడాల్సిన బాధ్యత ఫిఫా తనిఖీ టీందే

మొరాకో బిడ్‌పై అనర్హత పడకుండా చూడాల్సిన బాధ్యత ఫిఫా తనిఖీ టీందే

ఫిఫా కౌన్సిల్ సభ్యుడు, జర్మనీ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రియన్ హార్డ్ గ్రిండెల్ మాట్లాడుతూ ఎటువంటి కుట్ర సిద్ధాంతాలు ముందుకు రాకుండా చూడడంతోపాటు ఫిఫా ఇన్స్‌పెక్టర్లు.. మొరాకో బిడ్‌పై అనర్హత వేటు పడకుండా తప్పనిసరిగా చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ‘ఒకవేళ అక్కడ ఇద్దరు (అభ్యర్థులు) ఉంటే ఫిఫా కార్యవర్గ భేటీలో తప్పక ఒకరికి ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది' అని రియన్ హార్డ్ గ్రిండెల్ తెలిపారు.

 జూన్ 13న మాస్కోలో ఫిఫా కార్యవర్గ భేటీలో

జూన్ 13న మాస్కోలో ఫిఫా కార్యవర్గ భేటీలో

మాస్కోలో జూన్ 13వ తేదీన ఫిఫా కార్యవర్గ బేటీ జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు అప్పగించే ప్రక్రియలో తాము ఎటువంటి వదంతులకు అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన అవసరం ఉంది' అని రియన్ హార్డ్ గ్రిండెల్ తెలిపారు. ఒక బిడ్డర్‌కు తప్ననిసరిగా తిలోదకాలివ్వాల్సిందేనని, దీని వెనుక అన్ని వేళలా వదంతలు తప్పక వినిపిస్తాయని కొట్టిపడేశారు.

2010 తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల బిడ్

2010 తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల బిడ్

వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల బిడ్ ఖరారు విషయమై 2010 తర్వాత ఫిఫా ఎంపిక ప్రక్రియను పూర్తిగా మార్చేసింది. ఫిఫా - అప్పాయింటెడ్ అడ్వైజర్ల సలహాలకు భిన్నంగానే హై రిస్క్ ఆప్షన్లకు పెద్ద పీట వేస్తూ వచ్చింది. అందులో భాగంగా రష్యా, ఖతార్ లకు వరల్డ్ కప్ నిర్వహణ ఆతిథ్య హక్కులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది ఫిఫా.

మొరాకో స్టేడియంలను అభివృద్ధి చేయాల్సి ఉందంటూ..

మొరాకో స్టేడియంలను అభివృద్ధి చేయాల్సి ఉందంటూ..

2026 వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమైన వసతుల కల్పనపై ఫిఫా మార్గదర్శకాలు నిర్దేశించింది. దాని ప్రకారం మొరాకోలోని 14 స్టేడియంలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివ్రుద్ధి చేయాల్సి ఉన్నది. 100కి పైగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఇప్పటికే అమెరికా 16 స్టేడియంలను పూర్తిస్థాయి సిద్ధం చేసింది. వీటితోపాటు జట్లకు పునాది ఏర్పాట్లు చేసింది అమెరికా.

 ఆఫ్రికా నుంచి మొరాకోకు పూర్తిగా మద్దతు

ఆఫ్రికా నుంచి మొరాకోకు పూర్తిగా మద్దతు

ఇప్పటికీ మొరాకోకు ఆఫ్రికా నుంచి పూర్తిగా మద్దతు లభిస్తున్నది. 200కి పైగా సభ్య దేశాలు గల ఫిఫా కార్యవర్గంలో బహిరంగ ఓటు విధానం ద్వారా ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు అప్పగిస్తూ అదే రోజు నిర్ణయం తీసుకోనున్నది. గ్రిండెల్ మాట్లాడుతూ మొరాకోలో వసతుల కల్పనపై టాస్క్ ఫోర్స్ నివేదికను ఇంకా అంచనా వేయలేదని పేర్కొన్నారు. ‘ఫిఫా తనిఖీ టీం తప్పనిసరిగా మొరాకోలో వసతుల కల్పన తీరు తెన్నులపై స్పష్టమైన నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు.

నిరాధార ఆరోపణలను తిరస్కరించిన ఫిఫా సెక్రటరీ:

నిరాధార ఆరోపణలను తిరస్కరించిన ఫిఫా సెక్రటరీ:

2026 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్ దాఖలు చేసిన మొరాకోకు తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఫిఫా సెక్రటరీ జనరల్ ఫాత్మా సామౌరా తేల్చేశారు. ఫాత్మా సామౌరాపై వచ్చిన అభియోగాలను ఫిఫా ఎతిక్స్ కమిటీ పరిశీలనకు అప్పగించినట్లు బీబీసీ వార్తలు ప్రసారం చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన ఫాత్మా సామౌరా విషయాన్ని ఫిఫా ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తున్నదని పేర్కొన్నది.

ఎల్ హాడ్జి డివౌఫ్ సామౌరాతో సంబంధం లేదన్న ఫిఫా సెక్రటరీ జనరల్

ఎల్ హాడ్జి డివౌఫ్ సామౌరాతో సంబంధం లేదన్న ఫిఫా సెక్రటరీ జనరల్

ఫాత్మా సామౌరా డైవౌఫ్ సామౌరా, లివర్ పూల్ మాజీ ఫార్వర్డ్ ప్లేయర్ ఎల్ హాద్జీ డివౌఫ్‌లు ఇద్దరు మొరాకో ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల బిడ్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ సెనెగల్ పౌరులు. కానీ ఆ ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారం, హాస్యాస్పదం అని ఫాత్మా సామౌరా తెలిపారు. ఎల్ హాడ్జీ డివౌఫ్ తమ కుటుంబానికి చెందిన వారు కాదని, దీనిపై చర్చించడానికేమీ లేదని తెలిపారు.

Story first published: Wednesday, May 23, 2018, 14:01 [IST]
Other articles published on May 23, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X