అట్లెంటికో మాడ్రిడ్‌కు ఫెర్నాండో టొర్సెస్ రాంరాం.. భారీ స్థాయిలో వీడ్కోలు!!

Posted By:
Fernando Torres announces end to Atletico Madrid career

మాడ్రిడ్: స్పానిష్ ఫుట్ బాల్ టోర్నీ 'లా లీగా' టీం అట్లెంటికో మాడ్రిడ్ జట్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకోనున్నది. దాదాపు 20 ఏళ్ల పాటు జట్టుతో అనుబంధం కలిగి ఉన్న ఫెర్నాండో టొర్సెస్.. ప్రస్తుత సీజన్ ముగింపుతోనే తప్పుకుంటున్నట్లు తేల్చేశాడు. సోమవారం సంచలన ప్రకటన చేసిన ఫెర్నాండో టోర్సెస్ భావోద్వేగానికి గురయ్యాడు.

అట్లెంటికో మాడ్రిడ్ నా సొంతింటితో సమానమన్న ఫెర్నాండో

అట్లెంటికో మాడ్రిడ్ నా సొంతింటితో సమానమన్న ఫెర్నాండో

1995లో రోజీబ్లాంకోస్ అకాడమీతో సంతకం చేసి ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ఎదిగిన ఫెర్నాండో 2001లో తొలిసారి అట్లెంటికో మాడ్రిడ్ జట్టులో అరంగ్రేటం చేశాడు. 2007లో జట్టును వీడిన ఫెర్నాండో టెర్రోస్.. తిరిగి 2015లో పున:ప్రవేశించాడు. ‘పదేళ్ల వయస్సులో నేను ఇక్కడకు వచ్చాను. నేనెప్పుడూ అట్లెంటికో మాడ్రిడ్ జట్టును సొంతింటిగానే భావిస్తాను' అని భావోద్వేగ పూరితంగా కదిలిపోయాడు.

అట్లెంటికో మాడ్రిడ్‌లో కావాల్సినంత ఎంజాయ్ చేశా

అట్లెంటికో మాడ్రిడ్‌లో కావాల్సినంత ఎంజాయ్ చేశా

‘నేను అట్లెంటికో మాడ్రిడ్ జట్టులో కావాల్సినంత మేరకు ఎంజాయ్ చేశా. నా కలలన్నీ నెరవేర్చుకున్నా. అట్లెంటికో మాడ్రిడ్ క్లబ్‌తో నా ప్రయాణం ఈ సీజన్ చివరిదనుకుంటా. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. దీనికి మూల్యం చాలా చెల్లించుకోవాల్సి వస్తుంది. వాస్తవాల్లోకి వస్తే మెరుగ్గా ఉంటుంది' అని ఫెర్నాండో టోర్రెస్ వ్యాఖ్యానించాడు.

ప్రాధాన్యం గురించి మాట్లాడేందుకు సమయం కాదన్న ఫెర్నాండో

ప్రాధాన్యం గురించి మాట్లాడేందుకు సమయం కాదన్న ఫెర్నాండో

ఈ 34 ఏళ్ల కుర్రాడు ప్రస్తుత సీజన్‌లో అన్ని టోర్నమెంట్లలో తొమ్మిది గేమ్స్‌ల్లోనే ఆడాడు. జట్టు సారధి డియాగో సిమ్మోన్స్ అత్యధిక శాతం ఫెర్నాండో టెర్రోస్‌ను బెంచ్‌కే పరిమితం చేశాడు. ఈ నేపథ్యంలో జట్టును వీడడానికి ఇంతకుమించిన మంచి సమయం లభించదని భావిస్తున్నట్లు టొర్రెస్ తెలిపాడు. ‘ప్రాముఖ్యత' ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం. దాని గురించి చర్చించే సమయం కాదు. వచ్చే నెల రెండో వారంతో ఈ క్లబ్‌తో నా కెరీర్ ముగుస్తుందని చెప్పడానికి ఇదే మెరుగైన మార్గం అని పేర్కొన్నారు.

ఫెర్నాండో కాంట్రాక్టు పొడిగించబోమన్న డియాగో

ఫెర్నాండో కాంట్రాక్టు పొడిగించబోమన్న డియాగో

అసలు వాస్తవమేమిటంటే డియాగో సిమ్మోన్స్ గత ఫిబ్రవరిలోనే ఫెర్నాండో టొర్సెస్‌తో కాంట్రాక్టు పొడిగించడం లేదని ముందే కుండబద్ధలు కొట్టారు. ‘నేను మ్యాచ్‌ల్లో ఏదైనా చేస్తానని విశ్వసించా. కానీ వాస్తవంగా ఈ సీజన్‌లో అటువంటిదేమీ లేదు. ఒకవేళ అన్ని సక్రమంగా జరిగితే టైటిల్‌తోనే వెళతా. ఇంతకుముందు ఆట కంటే మెరుగ్గానే ఆడాం. కానీ నేను ఎప్పుడూ ఎవరికీ సరెండర్ కాలేదు. ఒకవేళ వారు నన్ను కొనసాగించాలని భావించకపోవచ్చు. అందుకే కాంట్రాక్ట్ కొనసాగించలేదు' అని తెలిపాడు.

 126 గోల్స్ చేసిన ఫెర్నాండో

126 గోల్స్ చేసిన ఫెర్నాండో

అట్లెంటికో మాడ్రిడ్ క్లబ్‌తో తన అనుబంధం తెగదెంపులు చేసుకుంటున్నట్లు ఫెర్నాండో టెర్రోస్ ప్రకటించడంతోనే క్లబ్ యాజమాన్యం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంది. అంతా భావిస్తున్నట్లు జరిగితే లా లీగా టోర్నీ ఫైనల్స్‌లో బార్సిలోనాతో అట్లెంటికో మాడ్రిడ్ తలపడతుంది. ఇబార్‌లో జరుగనున్న ఫైనల్స్ మ్యాచ్‌లో తల పడనున్న ఫెర్నాండో టెర్సోస్.. ఆయన కెరీర్‌లో క్లబ్ తరఫున 126 గోల్స్ సాధించాడు. ఈ దఫా టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడినా జట్టును పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిపాడు. కనుక ఫెర్నాండో ఘనమైన వీడ్కోలుకు అర్హుడేనని అట్లెంటికో మాడ్రిడ్ క్లబ్ అధ్యక్షుడు ఎన్రిక్యు సెరెజో తెలిపాడు. ఈ కార్యక్రమంలో అభిమానులంతా భాగస్వాములు కావాలని కోరాడు.

రియల్ మాడ్రిడ్ కంటే ఒక మెట్టుపై అట్లెంటికో మాడ్రిడ్

రియల్ మాడ్రిడ్ కంటే ఒక మెట్టుపై అట్లెంటికో మాడ్రిడ్

ఎల్లవేళలా ఫెర్నాండో టెర్రోస్ కోసం అట్లెంటికో మాడ్రిడ్ జట్టు తలుపులు తెరిచే ఉంటాయి. ఫుట్ బాల్ ప్లేయర్‌గా తన కెరీర్ ముగించుకుని ఎప్పుడు వచ్చినా స్వీకరిస్తామని తెలిపాడు. లా లీగా టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన అట్లెంటికో మాడ్రిడ్.. తన సహచర క్లబ్ టీం రియల్ మాడ్రిడ్ కంటే నాలుగు పాయింట్లు ఎక్కువ గెలుచుకుని ఒక మెట్టు పైనే ఉంది.

Story first published: Tuesday, April 10, 2018, 14:32 [IST]
Other articles published on Apr 10, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి