న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

డిఫెండర్ ఫెర్నాండెజ్‌తో భాష సమస్యల్లేవు: రష్యా పుట్‌బాల్ కోచ్

Fernandes to have no language problems playing for Russia at 2018 FIFA World Cup — coach

హైదరాబాద్: జూన్ నెల నుంచి సాకర్ కప్ సంరంభం ప్రారంభం కానున్న నేపథ్యంలో రష్యా జట్టుతో కలిసి ఆడేందుకు బ్రెజిల్ ఫుట్ బాల్ ప్లేయర్ మారియో ఫెర్నాండెజ్‌కు ఎటువంటి భాషాపరమైన సమస్య తలెత్తదని టీమ్ హెడ్ కోచ్ స్లాన్‌స్లావ్ చెర్చె‌సోవ్ తెలిపారు.

శుక్రవారం అంతకు ముందు ఫిఫా-2018 వరల్డ్ కప్ టోర్నమెంటులో పాల్గొనేందుకు 28 మంది ఆటగాళ్లతో రష్యా ఫుట్‌బాల్ జట్టును రష్యా ఫుట్‌బాల్ యూనియన్(ఆర్‌ఎఫ్‌యూ) ప్రకటించింది. ఆ జట్టులో మారియో ఫెర్నాండెజ్ కూడా సభ్యుడిగా ఉన్నారు.

 మారియోతో బాష సమస్యే కాదు

మారియోతో బాష సమస్యే కాదు

ఈ సందర్భంగా టీమ్ హెడ్ కోచ్ స్లాన్‌స్లావ్ చెర్చె‌సోవ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆయన మారియో ఫెర్నాండెజ్ అంతా అర్థం చేసుకుంటారు. కానీ, నిజాయితీగా చెప్పాలంటే మాతో మాట్లాడేందుకు అన్నివేళలా ఆయన పదాలు వెతుక్కునే వారు. అయినా మారియో ఫెర్నాండెజ్‌ను అర్థం చేసుకోవడానికి మాకు జాతీయ ఫిజికల్ ట్రైనింగ్ కోచ్ పాలినో గ్రానెరో సహకరిస్తారు. భాషా అవరోధాలకు సంబంధించి ఇది మాకు పెద్ద సమస్య కానే కాదు' అని చెప్పారు.

 మాస్కో ఫుట్‌బాల్ క్లబ్ జట్టుకు డిఫెండర్‌గా

మాస్కో ఫుట్‌బాల్ క్లబ్ జట్టుకు డిఫెండర్‌గా

మారియో ఫెర్నాండెజ్ 2012 నుంచి సీఎస్కేఎ మాస్కో ఫుట్‌బాల్ క్లబ్ జట్టుకు డిఫెండర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016 జూలైలో ఆయనకు రష్యా పౌరసత్వం లభించింది. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా జరిగిన ఫ్రెండ్‌షిప్ మ్యాచ్‌లో 4 - 2 స్కోర్ తేడాతో జట్టు విజయం సాధించడంలో మారియో ఫెర్నాండెజ్ కీలక పాత్ర పోషించాడు. తర్వాత ఫెర్నాండెజ్ రష్యా జాతీయ జట్టు తరఫున ఇరాన్, అర్జెంటీనా జట్ల తరఫున ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ఇరాన్ జట్టుతో 1 - 1 తేడాతో మ్యాచ్ డ్రా చేసుకోగా, అర్జెంటీనా జట్టుతో 0 - 1 స్కోర్ తేడాతో ఓటమి పాలయ్యారు.

18 నుంచి రష్యా శిక్షణా శిబిరం ప్రారంభం

18 నుంచి రష్యా శిక్షణా శిబిరం ప్రారంభం

సాకర్ కప్ సంరంభంలో పాల్గొనేందుకు రష్యా జాతీయ జట్టుకు ఈ నెల 18వ తేదీ నుంచి శిక్షణా శిబిరం ప్రారంభం కానున్నది. మాస్కో నగర శివారుల్లోని నొవొగొర్స్క్ పట్టణంలో 20 నుంచి 31వ తేదీ వరకు శిక్షణ తీసుకోనున్నది. వచ్చేనెల 14వ తేదీన సాకర్ కప్ సంరంభం ప్రారంభానికి ముందు రష్యా రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నది. ఈ నెల 30న ఆస్ట్రియా జట్టుతో ఇన్స్ బర్గ్‌లో, జూన్ నెలలో ఐదో తేదీన మాస్కోలో టర్కీ జట్టుతో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొననున్నది.

 ఏడుగురు ప్లేయర్లు శిక్షణకు దూరం

ఏడుగురు ప్లేయర్లు శిక్షణకు దూరం

శిక్షణా శిబిరం పూర్తయిన తర్వాత జూన్ నాలుగో తేదీన 23 మంది సభ్యులతో రష్యా జాతీయ ఫుట్‌బాల్ జట్టును ప్రకటిస్తారు. తాజాగా ప్రకటించిన ప్రిలిమినరీ రోస్టర్ జట్టులో ఏడుగురు ఆటగాళ్లు శిక్షణా శిబిరానికి హాజరు కాబోరు. వారిలో లొకొమోటివ్ మాస్కో ఎఫ్ సీ క్లబ్ గోల్ కీపర్ మారిటెల్లో గైల్హెర్మ్, డిఫెండర్లు వ్లాదిస్లావ్ ఇగ్నాటీవ్, డిమిట్రీ కాంబారోవ్, మిడ్ ఫీల్డర్లు డెనీస్ గ్లుషాకోవ్, ఆంటోన్ స్వెట్స్, ఫార్వర్డ్ ప్లేయర్లు ఆంటోన్ జాబొలోట్నీ, డిమిట్రీ పొలోజ్ ఉన్నారు.

 సాకర్ సంరంభానికి 33 రోజులే

సాకర్ సంరంభానికి 33 రోజులే

గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన మాస్కోలోని రాష్ట్ర క్రెమ్లిన్ ప్యాలెస్‌లో 2018 టోర్నమెంట్ మ్యాచ్‌ల డ్రా నిర్వహించింది. ఈ ఏడాది జరుగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో 32 దేశాల జట్లు ఎనిమిది గ్రూపుల్లో భాగస్వాములు కానున్నాయి. ఆతిథ్య జట్టు రష్యా గ్రూపు ఎ లో సౌదీ అరేబియా, ఈజిప్టు, ఉరుగ్వే దేశాలతో తలపడనున్నది. సాకర్ సంరంభం ప్రారంభం కావడానికి మరో 33 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది.

Story first published: Saturday, May 12, 2018, 13:14 [IST]
Other articles published on May 12, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X