న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్: 30 సెకన్లలోనే పతకం సొంతం చేసుకున్న మహిళ

Extraordinary moment FIFA official busted lifting World Cup history

హైదరాబాద్: రష్యా వేదికగా జూన్ 14 నుంచి దాదాపు నెలరోజుల పాటు అలరించిన ఫిఫా ప్రపంచకప్‌ సమరం ఆదివారంతో ముగిసింది. కప్ గెలుచుకోగానే ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఆట పూర్తయిన అనంతరం విజేతలకు బహుమతులు అందజేసే సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఆతిథ్య రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విజేతలకు బంగారు పతకాలువేసి సత్కరించారు.

అయితే పుతిన్‌కు కుడివైపున ఓ మహిళ పతకాలు అందిస్తూనే ఓ ఘనకార్యం చేసింది. ఒక పతకాన్ని తీసి తన జేబులో వేసుకుంది. ఈ వేడుకను ఓ అభిమాని వీడియో తీస్తుండగా..అది ఆయనకంట పడింది. దీంతో ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అవుతోంది.

అయితే దీనిపై నెటిజన్లు చురకుగా స్పందిస్తున్నారు. వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ కామెంట్లు ఇలా ఉన్నాయి.


నేనొక్కడినే ఈ ఘటనను చూశానా?


'ఇప్పుడు నువ్వు పోస్ట్‌ చేశావు కదా ఎంతో మంది చూస్తారులే' అని మరో అభిమాని సమాధానం ఇచ్చారు.


రష్యా అధ్యక్షుడు వేదికపై ఉంటే ఆమెకు అంత ధైర్యం ఎలా వచ్చింది?


అదనంగా తయారు చేసిన పతకాలను ఎలాగూ వృధాగా పడేస్తారు కదా!అందుకే ఆమె ముందుగానే జాగ్రత్త పడింది' అని మరో నెటిజన్‌ స్పందించాడు.


పతకాన్ని దొంగిలించినందుకు ఆమెనెవరూ ఏమనకండి! అది 'మెస్సీ' కోసం అయి ఉంటుంది'


ఫుట్‌బాల్‌ క్రీడాకారులు 30రోజుల పాటు కష్టపడింది ఈ మెడల్‌ కోసమే. కానీ ఈమె 30సెకన్లలో పతకాన్ని సొంతం చేసుకుంది తెలివైన మహిళ..


ఆదివారం జరిగిన ఫైనల్‌లో క్రొయేషియాపై ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి ట్రోఫీ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, క్రోయేషియా అధ్యక్షురాలు కొలిందా గ్రాబర్‌ హాజరై తిలకించారు. కప్ గెలుచుకున్న తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడితో సహా ఆటగాళ్లంతా చిందులు వేస్తూ స్టేడియమంతా ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పారు.

Story first published: Tuesday, July 17, 2018, 17:15 [IST]
Other articles published on Jul 17, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X