న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

England beat Sweden to reach first World Cup semi-final in 28 years

హైదరాబాద్: జట్టుగా పరవాలేదనిపించినా.. ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు మిగిలిన జట్ల కంటే మెరుగ్గా ఏం కనిపించలేదు. అయితే క్వార్టర్ ఫైనల్స్ దశ వరకూ జరిగిన ఫిఫా పోరులో ఇంగ్లాండ్ ప్రతిభకు పదును పెట్టింది. టైటిల్‌పై ఆశలు పెరిగిన వేళ ఇంగ్లాండ్‌ 1990 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం పెద్దగా పోటీ ఎదురుకాని క్వార్టర్‌ఫైనల్లో 2-0తో స్వీడన్‌ను మట్టికరిపించింది.

ఇంగ్లాండ్‌ వేగాన్ని అందుకోలేకపోయిన స్వీడన్‌ మ్యాచ్‌ ఆద్యంతం వెనుకబడే ఉంది. ఇంగ్లాండ్‌. స్వీడన్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈసారి హీరో కెప్టెన్‌ హారీ కేన్‌ కాదు. టోర్నీ టాప్‌ స్కోరర్‌ అయిన కేన్‌ కాస్త శాంతిస్తే.. గోల్‌కీపర్‌ జోర్డాన్‌ పిక్‌ఫోర్డ్‌ రూపంలో కొత్త హీరో ఉద్భవించాడు. ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాపై ఎలాంటి మార్పులు లేని జట్టుతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌.. తన దూకుడుతో స్వీడన్‌పై ఒత్తిడి పెంచింది.

30వ, 59వ నిమిషాలలో డెలీ ,అలీ గోల్స్‌:

30వ, 59వ నిమిషాలలో డెలీ ,అలీ గోల్స్‌:

ఇంగ్లాండ్‌ తరఫున 30వ నిమిషంలో మగ్వయర్‌, 59వ నిమిషంలో డెలీ అలీ గోల్స్‌ కొట్టారు. క్రొయేషియా-రష్యా మధ్య క్వార్టర్‌ఫైనల్‌ విజేతతో ఇంగ్లాండ్‌ ఈ నెల 11న సెమీస్‌లో తలపడుతుంది. 19వ నిమిషంలో కేన్‌ షాట్‌ నెట్‌కు దూరంగా వెళ్లింది. ఎటాకింగ్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్‌ 30వ నిమిషంలో ఫలితం రాబట్టింది. కార్నర్‌ను యంగ్‌ బాక్స్‌లోకి పంపగా.. స్వీడన్‌ డిఫెన్స్‌ కన్నా ఎత్తుకు ఎగిరిన మగ్వయర్‌ హెడర్‌ గోల్‌తో జట్టును ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అతడికిదే తొలి అంతర్జాతీయ గోల్‌ కావడం విశేషం.

ఆధిక్యాన్ని రెట్టింపు చేసే రెండు అవకాశాలు వృథా

ఆధిక్యాన్ని రెట్టింపు చేసే రెండు అవకాశాలు వృథా

ఆ తర్వాత స్టెర్లింగ్‌ ఆధిక్యాన్ని రెట్టింపు చేసే రెండు అవకాశాలను వృథా చేశాడు. రెండో అర్ధభాగం ఆరంభమైందో లేదో స్వీడన్‌ దాదాపు గోల్‌ కొట్టినంత పని చేసింది. యంగ్‌ కంటే ఎక్కువ ఎత్తుకు ఎగురుతూ బెర్గ్‌ కొట్టిన హెడర్‌ను పిక్‌ఫోర్డ్‌ డైవ్‌ చేస్తూ అద్భుతంగా అడ్డుకుని ఉండకపోతే స్వీడన్‌ ఖాతాలో గోల్‌ చేరేదే. కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్‌ దాడులు ఉధృతం చేసింది. 55వ నిమిషంలో స్టెర్లింగ్‌, మగ్వయర్‌ చేసిన గోల్‌ యత్నాన్ని స్వీడన్‌ రక్షణ శ్రేణి అడ్డుకుంది. మూడు నిమిషాల తర్వాత మాత్రం ఆ పని చేయలేకపోయింది.

చాలాసార్లు ఆధిక్యాన్ని పెంచుకునేలా

చాలాసార్లు ఆధిక్యాన్ని పెంచుకునేలా

58వ నిమిషంలో లింగార్డ్‌ పెనాల్టీ కార్నర్‌ను బాక్స్‌లోకి పంపగా.. స్వీడన్‌ డిఫెండర్‌ను తప్పించుకుంటూ అలీ తలతో గోల్‌ కొట్టేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చాలాసార్లు ఆధిక్యాన్ని పెంచుకునేలా కనిపించింది. స్వీడన్‌ .. ఇంగ్లాండ్‌ జోరును అందుకోలేకపోయినా కొన్నిసార్లు కంగారు పెట్టింది. 63వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు విక్టర్‌ క్లేసన్‌ షాట్‌ను గోల్‌కీపర్‌ పిక్‌ఫోర్డ్‌ డైవ్‌చేస్తూ గొప్పగా అడ్డుకున్నాడు.

 జట్టును మరోసారి నిరాశపరిచిన పిక్‌ఫోర్డ్‌

జట్టును మరోసారి నిరాశపరిచిన పిక్‌ఫోర్డ్‌

ఇంగ్లాండ్‌ దూకుడు కొనసాగిస్తున్నా 72వ నిమిషంలో స్వీడన్‌ మరో అవకాశాన్ని సృష్టించుకుంది. తన అద్భుత గోల్‌కీపింగ్‌తో ఆ జట్టును పిక్‌ఫోర్డ్‌ మరోసారి నిరాశపరిచాడు. బెర్గ్‌ బలమైన షాట్‌తో అతడు బార్‌పైకి నెట్టేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ డిఫెన్స్‌తో స్వీడన్‌కు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. మ్యాచ్‌లో స్వీడన్‌ ఆరు షాట్లు కొట్టగా.. మూడు గోల్‌ దిశగా వెళ్లాయి. మూడింటినీ పిక్‌ఫోర్డ్‌ అడ్డుకున్నాడు. ఇంగ్లాండ్‌ 12 షాట్లలో రెండింటిని విజయవంతంగా టార్గెట్లోకి కొట్టింది.

Story first published: Sunday, July 8, 2018, 11:10 [IST]
Other articles published on Jul 8, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X