న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

హ్యాండ్స్‌ ఆఫ్ గాడ్స్‌.. మారడోనా జెర్సీ ధర ఎంతో తెలుసా!!

Diego Maradonas Hand of God shirt could fetch up to $2 million

లండన్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా బుధవారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా దేశం మాత్రమే గాక యావత్‌ ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానులు మారడోనా లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. మారడోనాను కడసారి చూసుకోవాలని ఫుట్‌బాల్‌ అభిమానులు తరలివచ్చారు. అతని పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సాకర్‌ను పిచ్చిగా ప్రేమించే అర్జెంటీనాలో అతణ్ని 'గోల్డెన్‌ బాయ్‌'గా పిలుస్తారు. పదో నంబర్‌ జెర్సీ అంటే గుర్తొచ్చేది మారడోనానే.

అభిమానులకు డీగో మారడోనా జెర్సీని దక్కించుకునే అవకాశం కలిగింది‌. 1986 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ వేలం వేయనున్నారు. ఇందుకోసం 2 మిలియన్‌ డాలర్లగా కనీస ధరగా నిర్ణయించింది. అయితే మారడోనా జెర్సీని వేలం వేయడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుట్‌బాల్‌ చరిత్రలో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన ఒక దిగ్గజానికి ఇలాగేనా గౌరవం ఇచ్చేది అంటూ మండిపడుతున్నారు. ఒకవేళ జెర్సీ వేలంలోకి వచ్చినా ఇంకా ఎక్కువ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. అయినా ఫుట్‌బాల్‌కు మారడోనా చేసిన సేవలు వెలకట్టలేనిదంటూ అభిమానులు పేర్కొన్నారు.

1986 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మారడోనా చేసిన ఒక గోల్‌ వివాదాస్పదంగా మారింది. చేత్తో ‌బాల్‌ను గోల్‌పోస్ట్‌లోకి పంపించినట్లు అప్పటి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మ్యాచ్‌ రిఫరీ వద్ద ఆరోపించారు. కానీ.. రిఫరీ ఎలాంటి చర్య తీసుకోలేదు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మారడోనా చేసిన ఆ గోల్‌ను 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్' (దేవుడిచ్చిన చేయి)‌గా అభివర్ణించారు. ఆ తర్వాత తాను చేత్తోనే బంతిని గోల్ ‌పోస్ట్‌లోకి పంపినట్లు మారడోనా ఒక ఇంటర్య్వూలో చెప్పారు. ప్రస్తుతం ఆ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ మాంచెస్టర్‌లోని ఇంగ్లండ్‌ నేషనల్‌ ఫుట్‌బాల్‌ మ్యూజియంలో ఉంచారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మారడోనా, ఇంగ్లండ్‌ ఫుట్‌బాలర్‌ స్టీవ్‌ హడ్జ్‌ సరదాగా తమ జెర్సీలను మార్చుకున్నారు. అప్పటినుంచి మారడోనా జెర్సీ హడ్జ్‌ వద్దే ఉండిపోయింది. ఇప్పుడు వేలానికి ఉంచారు.

1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో క్వార్టర్‌ఫైనల్లో చేసిన 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' గోల్‌తో గుర్తుండిపోయే డీగో అర్మాండో మారడోనా 20 ఏళ్లకు పైగా అభిమానులను అలరించారు. పోట్లగిత్తను తలపించే దూకుడుతో, ప్రత్యర్థులను చాకచక్యంగా బోల్తా కొట్టించే నైపుణ్యంతో మారడోనా ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్యుడిగా మారారు. ఎటాకింగ్‌లో డీగో దిట్ట. మెరుపు వేగంతో కదులుతూ, ఒక కాలి నుంచి ఇంకో కాలికి వేగంగా బంతిని అలవోకగా మార్చుకుంటూ సాగే అతణ్ని అంచనా వేయడం ప్రత్యర్థి ఆటగాళ్లకు చాలా కష్టంగా ఉండేది. ఎడమ పాదం అతడి బలమైన ఆయుధం. తరచూ దాంతో గోల్స్‌ చేస్తూ ప్రత్యర్థులను షాక్‌కు గురి చేసేవారు. పొట్ట పెరగడంతో క్రమంగా అతడి వేగం తగ్గింది. 1991లో డోపింగ్‌ కుంభకోణం అతడికి పెద్ద దెబ్బ. కొకైన్‌కు అలవాటు పడ్డట్లు అప్పుడు అతడు అంగీకరించారు. 37వ ఏట, 1997లో రిటైరయ్యేంత వరకు ఆ కుంభకోణం వెంటాడింది.

India vs Australia: అసలే ఓటమి.. ఆపై టీమిండియాకు మరో షాక్!!India vs Australia: అసలే ఓటమి.. ఆపై టీమిండియాకు మరో షాక్!!

Story first published: Saturday, November 28, 2020, 16:46 [IST]
Other articles published on Nov 28, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X