న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రొనాల్డొ ఒక్కడే కాదు.. మెస్సీ కూడా అంతటి పని చేశాడు

Cristiano Ronaldo vs Lionel Messi: Real Madrid and Barca fans will be shocked by this stat

హైదరాబాద్: 2018 ఏప్రిల్ 3వ తేదీ జువెంటస్‌తో రియల్ మాడ్రిడ్ జట్టు ఆడింది. ఈ మ్యాచ్‌లో క్రిస్టియన్ రొనాల్డొ చేసిన రెండు గోల్స్ అతని జీవితంలో నిలిచి పోయే గోల్స్‌గా మారిపోయాయ్. ఏ గోల్ చేసినా కేవలం మ్యాచ్ గెలిచేందుకే చేస్తారు. కానీ, మ్యాచ్ గెలుచుకోవడంతో పాటు కొత్త కొత్త షాట్ కొట్టి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అతను చేసిన గోల్‌కు రియల్ మాడ్రిడ్ జట్టు ఆటగాళ్లే కాదు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం మెచ్చుకుంటున్నారు.

రొనాల్డొ కెరీర్‌లో ఆడిన 429 గేమ్‌ల తర్వాత అలాంటి గోల్‌లు సాధించాడు. ఇదిలా ఉంచితే, క్రిస్టియన్ రొనాల్డొ కెరీర్‌లో చేసిన ఇంతటి అద్భుతమైన గోల్‌ను ప్రశంసిస్తూనే అతన్ని అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీని పోలుస్తున్నారు. సాధారణంగానే ప్రతి మ్యాచ్‌లోనూ వీరిద్దరినీ విమర్శకులు, అభిమానులు పోల్చి చూస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో లియోనల్ మెస్సీ 466 గేమ్‌ల తర్వాత ఇలాంటి గోల్ చేశాడు. మెస్సీ కెరీర్‌లో 659 మ్యాచ్ లకుగాను 554 గోల్‌లు సాధించాడు.

మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి జట్టుకు చెందిన గియాంలుగీ బఫెన్ రియల్ మాడ్రిడ్ క్రిస్టియన్ రొనాల్డొను పొగడడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగక రొనాల్డోను ఫుట్‌బాల్ దిగ్గజాలైన పేలె, డిగో మారడోనాతో పోల్చాడు. 'ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు రొనాల్డో' 'అతని విలువ మెస్సీ, మారడోనా, పేలెలతో సమానం' 'మా జట్టు గెలుస్తుందనే నమ్మకాన్ని కోల్పోయా.. ఎందుకంటే రొనాల్డొతో పోటీపడి గెలవలేమని తెలిసిపోయింది'

క్లిష్టతరమైన గోల్‌తో రియల్ మాడ్రిడ్‌ను గట్టెక్కించిన రొనాల్డో
చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను రెండుసార్లు గెలుచుకున్న రియల్ మాడ్రిడ్.. జువెంటస్ జట్టుపై 3-0 స్కోర్ తేడాతో గెలుపొందినందుకు లేబ్రోన్ జేమ్స్ తదితరులు రొనాల్డోను ప్రశంసల్లో ముంచెత్తారు. అలియాంజ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గోల్ సాధించడం రియల్ మాడ్రిడ్ ఫ్యాన్స్ లేచి నిలబడి రొనాల్డోకు అనుకూలంగా కేరింతలు కొట్టారు. ఇది రొనాల్డోకు చిరస్మరణీయమైన జ్నాపకంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.

Story first published: Wednesday, April 4, 2018, 16:39 [IST]
Other articles published on Apr 4, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X