ట్రాన్స్‌ఫర్ విండో అంచులపై రియల్ మాడ్రిడ్ హీరో రొనాల్డో?: మెస్సీనే కారణమా?

Posted By:
Cristiano Ronaldo: Real Madrid plan Man Utd sale because of two other transfers - report

హైదరాబాద్: స్పానిష్ ఫుట్ బాల్ క్లబ్ జెయింట్ రియల్ మాడ్రిడ్ తన స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు వీడ్కోలు పలుకనున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజా పరిణామాలు సందేహాలను నిజం చేసే దిశగానే సాగుతున్నాయి.

33 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో 2009లో తిరిగి రియల్ మాడ్రిడ్ జట్టులో చేరినా.. తాజాగా ఆయనతో నూతన కాంట్రాక్ట్‌పై సంతకాలు చేసేందుకు సిద్ధంగా లేమని లా లీగా జెయింట్ క్లబ్ యాజమాన్యం స్పష్టం చేసింది.

రియల్, రొనాల్డో దారులు వేర్వేరు?

రియల్, రొనాల్డో దారులు వేర్వేరు?

ఈ తరుణంలో రొనాల్డో, రియల్ మాడ్రిడ్ దారులు వేరై పోయాయని, ఈ వేసవిలో ఎవరి దారి వారు ఎంచుకుంటారని తెలుస్తోంది. రొనాల్డో ఇప్పటికీ రియల్ మాడ్రిడ్ జట్టులో గోల్స్ మాంత్రికుడంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం లా లీగా టోర్నీలోనూ, అటు చాంపియన్స్ లీగ్ టోర్నీలోనూ చెలరేగి ఆడుతున్న రొనాల్డో.. ఎప్పటికైనా చాంపియన్స్ లీగ్ టైటిల్ కైవసం చేసుకోవాలని కల గంటున్నాడు.

రొనాల్డో వెళ్లాల్సిన టైం వచ్చేసిందన్న రియల్ మాడ్రిడ్ ప్రెసిడెంట్

రొనాల్డో వెళ్లాల్సిన టైం వచ్చేసిందన్న రియల్ మాడ్రిడ్ ప్రెసిడెంట్

కానీ స్పానిష్ వెబ్ సైట్ ‘డాన్ బాలోన్' మాత్రం ప్రస్తుత వేసవిలోనే మాంఛెస్టర్ యునైటెడ్ జట్టుకు క్రిస్టియానో రొనాల్డోను రియల్ మాడ్రిడ్ జట్టు విక్రయించాలని ప్రయత్నిస్తోందని వ్యాఖ్యలు చేసేంది. రియల్ మాడ్రిడ్ క్లబ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ మాట్లాడుతూ ఇక క్రిస్టియానో రొనాల్డో జట్టును విడిచి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.

లా లీగా టోర్నీలో 40 కి చేరనున్న రొనాల్డో గోల్స్

లా లీగా టోర్నీలో 40 కి చేరనున్న రొనాల్డో గోల్స్

ఇప్పటికీ పిచ్‌పై చెలరేగిపోతున్న క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుత లా లీగా సీజన్‌లో వ్యక్తిగత గోల్స్ స్కోర్ 40కి చేరవచ్చునని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం 33 ఏళ్ల వయస్కుడైన రొనాల్డోకు మున్ముందు మంచి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రియల్ మాడ్రిడ్ క్లబ్ అధ్యక్షుడు పెరెజ్ అంచనా ప్రకారం రొనాల్డో వంటి శక్తి సామర్థ్యాలు గల ప్లేయర్‌ను మాంఛెస్టర్ యునైటెడ్ యాజమాన్యం తిరస్కరించకపోవచ్చునన్నాడు. రొనాల్డోకు బదులుగా పాల్ పోగ్బాను గానీ, డీ గియాను గానీ రియల్ మాడ్రిడ్ క్లబ్ యాజమాన్యం కోరవచ్చునని డాన్ బాలోన్ వెబ్ సైట్ వార్తా కథనం రాసింది.

మాంఛెస్టర్ సిటీతో గెలుపుతో పరిస్థితిలో స్వల్ప మార్పు

మాంఛెస్టర్ సిటీతో గెలుపుతో పరిస్థితిలో స్వల్ప మార్పు

లాస్ బ్లాంకోస్ వద్ద జట్టు మేనేజర్ జోన్ మౌరిన్హోతో మాంఛెస్టర్ యునైటెడ్ ప్లేయర్ పాల్ పోగ్బా సంబంధాలు దెబ్బ తిన్నాయి. గత వారాంతంలో మాంఛెస్టర్ సిటీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 3 - 2 స్కోర్ తేడాతో మాంఛెస్టర్ యునైటెడ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడం వల్లే ఆ జట్టులో పోగ్బా స్థానానికి ప్రస్తుతానికి ముప్పు లేదని చెబుతున్నారు.
మాంఛెస్టర్ యునైటెడ్ మరో ప్లేయర్ డీ గియా మాత్రం అసలు రియల్ మాడ్రిడ్ లక్ష్యం కేయ్లోర్ నవాన్ అని పేర్కొన్నాడు.

ఇతర ప్రత్యామ్నాయాలు సిద్ధం చేస్తున్న రొనాల్డో

ఇతర ప్రత్యామ్నాయాలు సిద్ధం చేస్తున్న రొనాల్డో

ఒకవేళ ఒప్పందం కుదిరితే రియల్ మాడ్రిడ్ ప్లేయర్ క్రిస్టియానో వారానికి 3.50 లక్షల యూరోల మేరకు మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు మేనేజ్మెంట్‌తో సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మాంఛెస్టర్ యునైటెడ్ స్వాగతించేందుకు సిద్ధంగా లేకున్నా రొనాల్డోను గిఫ్ట్ గా అందించేందుకు రియల్ మాడ్రిడ్ సుముఖంగా లేదు. మరోవైపు రొనాల్డో ఓల్డ్ ట్రాఫ్ఫోర్డ్ వైపు కూడా చూస్తున్నట్లు సమాచారం.

భారీ ఫీజుపైనే మాంఛెస్టర్ యునైటెడ్ మడత పేచీ

భారీ ఫీజుపైనే మాంఛెస్టర్ యునైటెడ్ మడత పేచీ

రియల్ మాడ్రిడ్ జట్టుకు దూరమయ్యేందుకు క్రిస్టియానో రొనాల్డో కూడా మానసికంగా సిద్దమయ్యారన్నట్లే పరిస్థితులు ఉన్నాయి. మాంఛెస్టర్ యునైటెడ్ జట్టులోని తన సన్నిహితులతో రొనాల్డో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అయితే భారీగా ఫీజు డిమాండ్ చేస్తుండటంతో మాంఛెస్టర్ యునైటెడ్ యాజమాన్యం అంత భరించలేమని తేల్చేసింది. అందువల్లే గత జనవరిలోనే అలెక్సిస్ సాంచెజ్‌తో మార్పిడికి ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదరలేదు.

వారానికి ఐదు లక్షల యూరోలు డ్రా చేస్తున్న మెస్సీ

వారానికి ఐదు లక్షల యూరోలు డ్రా చేస్తున్న మెస్సీ

క్రిస్టియానో రొనాల్డో పట్ల రియల్ మాడ్రిడ్ జట్టు విముఖత ప్రదర్శించడానికి ఒక కారణం ఉన్నది. రొనాల్డో ప్రత్యర్థి లియానెల్ మెస్సీ పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆయనతో సమానంగా వేతనం చెల్లించాలని రియల్ మాడ్రిడ్ జట్టును డిమాండ్ చేస్తున్నాడు రొనాల్డో. ప్రస్తుతం బార్సిలోనా ప్లేయర్ లియానెల్ మెస్సీ వారానికి ఐదు లక్షల యూరోలు పొందుతున్నాడు.

ఒకింత ఆత్మరక్షణలో క్రిస్టియానో రొనాల్డో భవితవ్యం?

ఒకింత ఆత్మరక్షణలో క్రిస్టియానో రొనాల్డో భవితవ్యం?

ఒకవేళ తనకు ఇంత వేతనం కావాలని రొనాల్డో స్వయంగా చెబితేనే మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఆయనకు ఆఫర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రొనాల్డోను తమ జట్టులో చేర్చుకునేందుకు 2013, 2015లోనూ మాంఛెస్టర్ యునైటెడ్ ప్రయత్నించినా.. అప్పటికే ఆయన కాంట్రాక్టుపై సంతకాలు చేసేశాడు. కానీ ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టుపై సంతకం చేయబోమని రియల్ మాడ్రిడ్ క్లబ్ యాజమాన్యం తేల్చి చెప్పడంతో రొనాల్డో పరిస్థితి ఆత్మరక్షణలో పడింది. ఒకవేళ పరిస్థితులు తారుమారైతే చివరి క్షణంలో మాంఛెస్టర్ సిటీ జట్టులో రొనాల్డో చేరిపోయే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Wednesday, April 11, 2018, 12:32 [IST]
Other articles published on Apr 11, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి