న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రొనాల్డోకు అంత పెట్టుబడా..? మేము పనులు మానేస్తాం..!!

Cristiano Ronaldo obsession with Lionel Messi led to Juventus switch - Ryan Giggs

హైదరాబాద్: ఫుట్‌బాల్ ఆటగాళ్లలో బదిలీలు సర్వ సాధారణం. క్రేజ్‌ను బట్టి జీతాలు మారుతుంటే.. క్లబ్‌లకు బదిలీలు ఇట్టే జరిపేస్తుంటారు. ఇలానే భారీ మొత్తంలో లాభం చేకూరుతుండటంతో రొనాల్డొ రియల్ మాడ్రిడ్‌ను వదిలి ఇటలీకి చెందిన జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరిపోయాడు. ఆయన్ను కొనుగోలు చేయడానికి ఆ క్లబ్ 130 మిలియన్‌ డాలర్లను వెచ్చించింది. దీంతో ఆ కొత్త క్లబ్‌కు చెందిన కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంత పెద్ద మొత్తం ఒక వ్యక్తి మీద పెట్టడంతో ఫియట్ కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమైయ్యారు.

ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు

ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు

ఫియట్‌ యాజమాన్యం ఈ ఫుట్‌బాల్ క్లబ్‌లో కూడా భాగస్వామ్యులు. 90 సంవత్సాల నుంచి ఆ క్లబ్ వారి ఆధ్వర్యంలోనే ఉంది. అంతపెద్ద మొత్తం ఒక వ్యక్తి మీద పెట్టకుండా ఉద్యోగాలు కల్పించేలా, మంచి కార్లు తయారు చేసేలా పెట్టుబడి పెడితే బాగుండేదని అక్కడ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

7 రోజులపాటు బంద్‌కు దిగుతామని

7 రోజులపాటు బంద్‌కు దిగుతామని

‘మేము కంపెనీ అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేశాం. ఇప్పుడు దాన్ని మొత్తం తీసుకెళ్లి ఒక ఆటగాడిని కొనుగోలు చేయడానికి వినియోగించారు' అని కార్మిక సంఘం నాయకులు అన్నారు. వారు జులై 15, ఉదయం 10 నుంచి జులై 17, సాయంత్రం ఆరు వరకు బంద్‌కు దిగుతామని తెలిపారు.

మాంచెస్టర్‌ యునైటెడ్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు

మాంచెస్టర్‌ యునైటెడ్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు

2009లో రికార్డు స్థాయిలో రూ.730 కోట్ల ధరకు మాంచెస్టర్‌ యునైటెడ్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు తరలివచ్చాడు. ఈ జట్టుకు రొనాల్డో నాలుగు చాంపియన్స్‌ లీగ్‌, రెండు లా లిగా టైటిల్స్‌ను అందించాడు. క్రిస్టియానో రొనాల్డో బదిలీ విషయాన్ని రియల్‌ మాడ్రిడ్‌ అధికారికంగా ప్రకటించింది.

మాడ్రిడ్‌కు.. నా ధన్యవాదాలు

మాడ్రిడ్‌కు.. నా ధన్యవాదాలు

ఒదిలీ ఒప్పందంలో భాగంగా యువెంటస్‌ క్లబ్‌ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు) రియల్‌ మాడ్రిడ్‌కు చెలిస్తుందని స్పెయిన్‌ మీడియా వెల్లడించింది. తాజా ఒప్పందంపై క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ "మాడ్రిడ్‌కు ఆడిన సమయం నా జీవితంలో అత్యంత సంతోషకరమైనది. జట్టు, అభిమానులు, నగరానికి నా ధన్యవాదాలు" తెలిపాడు.

Story first published: Friday, July 13, 2018, 9:27 [IST]
Other articles published on Jul 13, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X