ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొన్న రొనాల్డో.. ధర తెలిస్తే షాకే!!

లండన్‌: పోర్చుగల్ ఫుట్​బాల్ ప్లేయర్​, జువెంటస్​ స్టార్​ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యంత విలువైన కారును కొనుగోలు చేశాడు. దాదాపు రూ.75 కోట్లతో (8.5 మిలియన్ యూరోలు) బుగాటి లా వాచ్యూర్‌ ఎన్వైర్‌​ కారును దక్కించుకున్నాడు. అయితే ఆ కారును తనకే బహుమతిగా ఇచ్చుకున్నాడు. రొనాల్డో ఇటీవల సిరీస్‌ ఎ ఛాంపియన్‌షిప్‌లో ఇటలీ దిగ్గజ క్లబ్‌ జువెంటస్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 గంటకు 380 కిలోమీటర్ల వేగం:

గంటకు 380 కిలోమీటర్ల వేగం:

కారు కొన్న విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా క్రిస్టియానో రొనాల్డో అభిమానులతో పంచుకున్నాడు. కారుతో తాను దిగిన ఫొటోను రొనాల్డో ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. లా వాచ్యూర్‌ ఎన్వైర్ మోడల్​లో 'బుగాటీ' 10 కార్లను మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసింది. రొనాల్డో తనకు కావాల్సిన విధంగా ఈ కారును డిజైన్​ చేయించుకున్నాడు. ఈ కారు గంటకు 380 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఇక కేవలం 2.4 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోలగదు.

ఇప్పటికే రూ. 264 కోట్ల విలువ చేసే కార్లు:

ఇప్పటికే రూ. 264 కోట్ల విలువ చేసే కార్లు:

జువెంటస్​ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గ్యారేజ్‌లో ఇప్పటికే దాదాపు 30 మిలియన్‌ యూరోలు (రూ. 264 కోట్లు) విలువ చేసే కార్లుండడం విశేషం. 35 ఏళ్ల క్రిస్టియానో మొత్తం రూ. 788 కోట్లతో ఈ ఏడాది అత్యధిక ఆర్జన కలిగిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే అతడు రూ. 53 కోట్లతో అత్యంత అధునాతన విహార నౌకను కూడా కొనుగోలు చేశాడు. ఇక ఈ వారంలో ప్రారంభమయ్యే చాంపియన్స్​ లీగ్​లో జువెంటస్ తరఫున బరిలోకి దిగేందుకు రొనాల్డో సిద్ధమవుతున్నాడు.

విజయానికి సంకేతంగా:

విజయానికి సంకేతంగా:

రొనాల్డో తన జట్టును తమ 36వ సీరీ ఏ విజయానికి సంకేతంగా బుగాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించారట. ఐదుసార్లు బాలన్ డీ ఓర్ విజేత అయిన రొనాల్డో.. తన గ్యారేజీలో కొత్త హైపర్ ‌కార్‌ను జోడించి జువెంటస్ తొమ్మిదవ వరుస సీరీ ఏ టైటిల్‌ను వేడుకలను జరుపుకున్నాడు. రియల్ మాడ్రిడ్ స్టార్ చిరోన్, వెయ్రోన్, లా వోయిచర్ నోయిర్‌లను ఇప్పటికే కలిగి ఉన్నందున రొనాల్డోకు బుగాటిపై ప్రేమ కొత్తేమీ కాదు.

బహుమతిగా మెర్సిడెస్ జి వాగన్:

బహుమతిగా మెర్సిడెస్ జి వాగన్:

ఈ ఏడాది ఫిబ్రవరిలో తన 35వ పుట్టినరోజు సందర్భంగా పోర్చుగీస్ ఫార్వర్డ్ క్రిస్టియానో రొనాల్డో తన భాగస్వామి జార్జినా రోడ్రిగెజ్ నుంచి బహుమతిగా 6 మిలియన్ల పౌండ్ల ఖరీదైన మెర్సిడెస్ జి వాగన్‌ను అందుకున్నాడు. ఇక బుగాటితో రొనాల్డో గ్యారేజీలో కార్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఐపీఎల్ 2020.. ఈనెల 20లోగా యూఏఈకి జట్లు!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

Story first published: Tuesday, August 4, 2020, 7:39 [IST]
Other articles published on Aug 4, 2020
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X