న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సునీల్ ఛెత్రికి జంట గౌరవం: ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు

Chhetri bags double honour at BFC Awards night

హైదరాబాద్: ఇండియన్ ఫుట్‌బాల్‌లో బెంగళూరు ఎఫ్‌సీ కెప్టెన్ సునీల్ ఛెత్రికి జంట గౌరవం దక్కింది. 'ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును వరుసగా ఐదోసారి అందుకున్నారు. మూడు టోర్నమెంట్లలో 24 గోల్స్ చేసిన ఆటగాడిగా సునీల్ ఛెత్రికి ఈ అవార్డు లభించింది.

సునీల్ ఛెత్రి ఈ అవార్డు అందుకోవడం ఇది ఐదోసారి. ఇంతకుముందు బెంగళూరు ఎఫ్ సీ టీమ్మెట్ మికూ పేరిట 20 గోల్స్ అత్యధిక రికార్డు.

అబహానీ ఢాకాపై విజయంలో సునీల్ ఛెత్రి కీలకం

అబహానీ ఢాకాపై విజయంలో సునీల్ ఛెత్రి కీలకం

ప్రస్తుతం సాగుతున్న ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సీ) నాలుగో సీజన్ టోర్నమెంట్‌ నాకౌట్‌లో ఢాకాలో ‘అబాహాని ఢాకా' జట్టుపై 4 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోల్‌లో గుర్‌ప్రీత్ సింగ్ సంధూకు ఫ్యాన్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నారు. ఎఫ్‌సీ గోవాపై జరిగిన మ్యాచ్‌లో మికూ పంపిన బంతిని అడ్డుకున్నందుకు గుర్‌ప్రీత్ సింగ్‌కు ఈ అవార్డు లభించింది.

 తమకు గర్వకారణమన్న పార్థ్ జిందాల్

తమకు గర్వకారణమన్న పార్థ్ జిందాల్

ఈ సందర్భంగా బెంగళూరు ఎఫ్ సీ క్లబ్ సీఈఓ పార్థ్ జిందాల్ మాట్లాడుతూ సునీల్ ఛెత్రికి, గుర్‌ప్రీత్ సింగ్‌లకు అవార్డులు రావడంతో నాకు వ్యక్తిగతంగా, క్లబ్ యాజమాన్యానికి గర్వ కారణం' అని చెప్పారు. జట్టు శిక్షకుడిగా ఆల్బర్ట్ రోసా వైదొలుగడం బాధాకరం అని పార్థ్ జిందాల్ తెలిపారు. జట్టును పటిష్టంగా తీర్చిదిద్దడంలో ఆల్బర్ట్ రోసా క్రుషి గర్వ కారణమని, అందుకు ఆయనకు ఎలా ధన్యవాదాలు తెలుపాలో తెలియడం లేదన్నారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో బెంగళూరు ఎఫ్‍సీని ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలోగానీ, సూపర్ కప్ టైటిల్ గెలుచుకోవడంలో గానీ, ఎఎఫ్సీ కప్ టోర్నీలో ఎనిమిదో స్థానంలో నిలపడంలో ఆల్బర్ట్ రోసా క్రుషి ఎంతో కీలకంగా ఉన్నది.

మనస్సంతా బెంగళూరు ఎఫ్‌సీ చుట్టేనని ఆల్బర్ట్ రోసా

మనస్సంతా బెంగళూరు ఎఫ్‌సీ చుట్టేనని ఆల్బర్ట్ రోసా

ఫుట్ బాల్ టోర్నమెంట్లలో బెంగళూరు ఎఫ్‌సీ క్లబ్ జట్టు ఆటగాళ్ల ప్రతిభ, వ్యవహరశైలి గర్వ కారణమని ఆల్బర్ట్ రోసా పేర్కొన్నారు. తాను కుటుంబంతో గడిపేందుకు సొంతూరు వెళుతున్నా.. తన మనస్సంతా బెంగళూరు ఎఫ్ సీ జట్టు, ఆ జట్టు ప్లేయర్లతోనే ఉంటుందన్నారు. బెంగళూరు ఎఫ్ సీ మిడ్ ఫీల్డర్ బిశ్వా డార్జీకి ‘యు - 18' ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, యూ - 15 విభాగంలో బెకేయ్ ఓరాం ఎంపికయ్యారు. బెంగళూరు ఎఫ్ సీలో ‘బీ' డిఫెండర్ ఆశీర్ అక్తర్‌కు ‘అప్ కమింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డు లభించింది.

Story first published: Saturday, May 19, 2018, 12:00 [IST]
Other articles published on May 19, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X