మీడియా సమావేశంలోనే సంబరాల్లో ఫ్రెంచ్ ఆటగాళ్లు (వీడియో)

హైదరాబాద్: రష్యా వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో.. 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఫ్రాన్స్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఎంతగానంటే మ్యాచ్ జరిగిన తీరు, ఆటగాళ్ల అభిప్రాయాలపై జరుగుతున్న మీడియా సమావేశంలోనూ ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు నిబంధనల ప్రకారం మీడియా సమావేశంలో పాల్గొనాలి. యథాప్రకారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ్రాన్స్‌ జట్టు కోచ్‌ డిడియర్‌ డెషాంప్స్‌ మాట్లాడేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఆ జట్టు ఆటగాళ్లు షాంపైన్‌ చల్లుకుంటూ సందడి చేస్తూ కనిపించారు. టేబుళ్లు‌ ఎక్కి చిందులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఫ్రాన్స్‌ ప్రపంచకప్‌ గెలవడం ఇది రెండోసారి. 1998లో డెషాంప్స్‌ నాయకత్వంలోనే ఫ్రాన్స్‌ తొలిసారి ప్రపంచకప్‌ గెలుచుకుంది. తిరిగి సరిగ్గా ఇరవై ఏళ్లకు డెషాంప్ప్‌ కోచ్‌గా వ్యవహరించిన ఫ్రాన్స్‌ జట్టు మరోసారి విజేతగా నిలిచింది. ఒక జట్టుకు కెప్టెన్‌గా అదే జట్టుకు కోచ్‌గా వ్యవహరించి ప్రపంచకప్‌ను ముద్దాడిన మూడోవాడు డెషాంప్స్‌. 2016 యూరో ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోర్చుగల్‌ చేతిలో ఓటమి నుంచి చాలా నేర్చుకున్నామని, ఆ రోజు ఓడిపోకపోయుంటే ఈ రోజు విశ్వ విజేతలుగా నిలిచేవాళ్లం కాదేమో అని డెషాంప్స్‌ అన్నాడు.

గోల్‌ల పరంపర సాగిందిలా:
క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్‌ (18వ నిమిషం) సెల్ఫ్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ ఖాతా తెరవగా... గ్రీజ్‌మన్‌ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్‌ కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ ని.లో), మాన్‌జుకిచ్‌ (69వ ని.లో) గోల్స్‌ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌ 2-1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్‌ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. మరి కొద్ది నిమిషాలలో మ్యాచ్ ముగుస్తుందనగా.. క్రొయేషియాకు వృథా ప్రయాస మిగిలింది. దీంతో ఫ్రాన్స్‌ సునాయస విజయం అందుకుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 16, 2018, 16:30 [IST]
Other articles published on Jul 16, 2018
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X