న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఎఎఫ్‌సి ఛాంపియన్స్ లీగ్: బెంగుళూరు Vs జోర్డాన్ క్లబ్

ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి) చాంపియన్స్ లీగ్ గ్రూప్ దశ అర్హత కోసం బెంగళూరు ఎఫ్ సి, జోర్డాన్ లీగ్ చాంపియన్స్ అల్ వెహ్దాట్ జట్లు తలపడనున్నాయి.

By Nageshwara Rao

న్యూఢిల్లీ: ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి) చాంపియన్స్ లీగ్ గ్రూప్ దశ అర్హత కోసం బెంగళూరు ఎఫ్ సి, జోర్డాన్ లీగ్ చాంపియన్స్ అల్ వెహ్దాట్ జట్లు తలపడనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని అల్ వాహ్దా స్టేడియంలో వచ్చే ఏడాది పిబ్రవరి ఏడో తేదీన జరుగనున్నది.

ఈ మ్యాచ్ లో గెలుపొందిన జట్టే ఎఎఫ్‌సి చాంపియన్స్ లీగ్ గ్రూప్ దశకు అర్హత సాధిస్తుంది. ఐ-లీగ్ చాంపియన్స్ బెంగళూరు ఎఫ్‌సి, వచ్చే ఏడాది జనవరి 31న ఎఎఫ్ సి చాంపియన్స్ లీగ్ ప్రిమిలినరీ దశ - 2 మ్యాచ్‌ల్లో జోర్డానియన్ క్లబ్ అల్ వాహ్దాత్ ఎస్ సి క్లబ్ జట్లు తలపడతాయి.

ఈ రెండు జట్ల మధ్య విజేత ఫిబ్రవరి ఏడో తేదీన జరిగే ఎఎఫ్ సి చాంపియన్స్ లీగ్ గ్రూప్ దశకు అర్హత సాధించింది. ఒకవేళ ఈ గేమ్స్‌లో బెంగళూరు ఎఫ్‌సి ఓటమి పాలైనా ఎఎఫ్‌సి కప్ రన్నరప్ జట్టుగా గ్రూప్ దశలో యధావిధిగా పాల్గొనవచ్చు. ఫిఫా ఫుట్‌బాల్ ర్యాంకింగ్‌లో భారత్ మెరుగైన స్ధానం సాధించేందుకు ఎఎఫ్‌సి చాంపియన్స్ లీగ్ టోర్నీ తొలి ప్రిలిమినరీ టోర్నీల్లో పాల్గొనాల్సిన అవసరం లేదు.

 ఐదు రీజియన్లుగా జట్ల వర్గీకరణ

ఐదు రీజియన్లుగా జట్ల వర్గీకరణ

ఎఎఫ్‌సి కప్ టోర్నీ నిర్వాహకులు టీమ్ లను ఐదు రీజియన్లుగా వర్గీకరించారు. దీనిప్రకారం బెంగళూరు ఎఫ్ సి జట్టు.. దక్షిణ రీజియన్ జట్లు మాజియా ఎస్ అండ్ ఆర్ (మాల్దీవులు), అల్బానీ ఢాకా లిమిటెడ్ (బంగ్లాదేశ్), మొహున్ బగన్, కొలంబో ఎఫ్ సి (శ్రీలంక), థింపూ సిటీ (భూటాన్), క్లబ్ వాలెంసియా (మాల్దీవులు)లతో కలిసి టోర్నీ ప్రిలిమినరీ స్టేజ్ మ్యాచ్‌ల్లో పాల్గొంటుంది. ఆసియా ఖండ దేశాల్లో ఫుట్‌బాల్ ఆటను ప్రగతిపథంలో పరుగులు పెట్టించేందుకే ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి) టోర్నీ నిర్వహిస్తోంది. దీంతోపాటు ఆసియా ఖండంలోనే టాప్ టైర్ క్లబ్ టోర్నమెంట్ ఎఎఫ్ సి చాంపియన్స్ లీగ్ (ఎసిఎల్) టోర్నీ కానున్నది.

ఐ - లీగ్ నుంచి డెంపో కూడా ఔట్

ఐ - లీగ్ నుంచి డెంపో కూడా ఔట్

పనాజీ: ఐదుసార్లు ఐ - లీగ్ చాంపియన్స్ డెంపో ఎస్సీ యాజమాన్యం టోర్నీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది. అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్)కు సరైన దిశ లేదని ఆరోపించింది. భారత్‌లో ఫుట్‌బాల్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్న ఎఐఎఫ్ఎఫ్ అభిప్రాయంతో విభేదిస్తూ ఐ - లీగ్ నుంచి డెంపో ఎస్ సి క్లబ్ వైదొలిగింది. ఇప్పటికే గోవాకు చెందిన రెండు ప్రసిద్ధి చెందిన క్లబ్‌లు సాల్గావోకర్ ఎఫ్ సి, స్పోర్టింగ్ క్లబ్ డి గోవా యాజమాన్యాలు ఐ - లీగ్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి.

 అగ్రశ్రేణి టోర్నీ లీగ్‌గా ఐఎస్ఎల్

అగ్రశ్రేణి టోర్నీ లీగ్‌గా ఐఎస్ఎల్

భారత్ ఫుట్‌బాల్‌లో అగ్రశ్రేణి టోర్నీ లీగ్‌గా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)ను ఖరారుచేసి, ఐ-లీగ్ లేదా లీగ్ వన్ రెండో లీగ్‌గా నిర్ణయిస్తూ ఎఐఎఫ్ఎఫ్ తీసుకున్న నిర్ణయాన్ని గోవాలోని మూడు క్లబ్ల యాజమానులు శివానంద్ సాల్గావోకర్, శ్రీనివాస్ డెంపో, పీటర్ వాజ్ ఉమ్మడిగా వ్యతిరేకించారు. ఈ మేరకు జూన్ 23నే ఉమ్మడి నిర్ణయం ప్రకటించారు. ఐ - లీగ్ లో ప్రవేశానికి జట్ల యాజమాన్యాలు బిడ్లు దాఖలుచేసేందుకు బుధవారంతో గడువు ముగిసింది. తాము కూడా ఐ - లీగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ఎఐఎఫ్ఎఫ్‌కు డెంపో క్లబ్ యాజమాన్యం లేఖ రాసింది.

ఐ-లీగ్ నుంచి వైదొలిగే యోచనలో కంపెనీలు

ఐ-లీగ్ నుంచి వైదొలిగే యోచనలో కంపెనీలు

‘టీం నిర్వహణతోపాటు లీగ్ బరిలో నిలిచేందుకు భారీగా ఖర్చుచేస్తున్న నేపథ్యంలో ఐ-లీగ్ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి కారణంగానూ, టోర్నీ పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచన కారణంగానూ ఈ లీగ్ నుంచి వైదొలగాలని డెంపో గ్రూప్ కంపెనీలు, క్లబ్ యాజమాన్యం నిర్ణయించాయి. సదరు టోర్నీకి అంత సామర్థ్యం లేకపోవడంతో ఐ - లీగ్‌లో అదనపు పెట్టుబడులు పెట్టనవసరం లేదని నిర్ణయించాం. ఐ - లీగ్ నుంచి వైదొలుగుతున్నందుకు విచారం వ్యక్తంచేస్తున్నాం. వచ్చే ఏడాదిలో జరిగే ఐ - లీగ్ టోర్నీలో భాగస్వామి కాలేకపోతున్నాం' అని ఆ లేఖలో పేర్కొన్నది. ఇక ముందు ఐ - లీగ్‌లో గానీ, ఎఐఎఫ్ఎఫ్ నిర్వహించే టోర్నీల్లో గానీ పాల్గొనబోమని ప్రకటించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X