మెస్సీ ఖాతాలో మరో అద్భుతం: స్కై స్పోర్ట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్

Posted By:
Barcelona forward Lionel Messi tops Sky Sports La Liga Rankings

హైదరాబాద్: స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ జెయింట్ బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ ప్రస్తుత సీజన్‌లో తన అసాధారణ ప్రతిభా పాటవాలతో అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో జట్టును అజేయంగా నిలుపడంతోపాటు తొలి నుంచి తన కెరీర్‌లో 40 హ్యాట్రిక్ గోల్స్ కూడా సాధించాడు. ప్రస్తుతం లా లీగా టోర్నీలో మరో ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే మరో రికార్డు నెలకొల్పాడు.

ఈ మేరకు అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ స్కై స్పోర్ట్స్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. రియల్ మాడ్రిడ్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డోనూ దాటేశాడు.

గత సీజన్‌లో అలెక్సిస్ సాంచెజ్‌దే పై చేయి

గత సీజన్‌లో అలెక్సిస్ సాంచెజ్‌దే పై చేయి

స్కై స్పోర్ట్స్ ర్యాంకింగ్స్‌లో లియానెల్ మెస్సీ 110,000 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. 2015 - 16లో రియాద్ మాహ్రేజ్ టేబుల్ టాపింగ్ క్యాంపెయిన్‌లో 96,386 పాయింట్లు సాధించగా, గత సీజన్ విజేత అలెక్సిస్ సాంచెజ్ 1,02,088 పాయింట్లు పొందాడు.

అట్లెంటికో మాడ్రిడ్ తో డ్రాతో తగ్గిన రొనాల్డో ర్యాంక్

అట్లెంటికో మాడ్రిడ్ తో డ్రాతో తగ్గిన రొనాల్డో ర్యాంక్

ఈ ఏడాది ర్యాంకింగ్స్ జాబితాలో క్రిస్టియానో రొనాల్డోనూ దాటేసిన లియానెల్ మెస్సీ.. తన టీమ్మెట్ ఫిలిప్పే కౌంటిన్హో సాయంతోనే టాప్ 10 జాబితాలో నిలిచానని పేర్కొన్నాడు. ఆదివారం అట్లెంటికో మాడ్రిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను రియల్ మాడ్రిడ్ డ్రాగా ముగించినందుకు క్రిస్టియానో రొనాల్డో ర్యాంకింగ్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఈ ర్యాంకుల జాబితాలో గారెథ్ బాలే గతంతో పోలిస్తే రెండు పాయింట్లు పైకి ఎదిగి నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు.

ఫార్వర్డ్ ప్లేయర్

ఫార్వర్డ్ ప్లేయర్

ఇక వాలెంసియా ఫార్వర్డ్ ప్లేయర్ రోడ్రిగో కూడా టాప్ ఫెర్ఫార్మర్‌గా నిలిచాడు. ఎస్పాన్యోల్ జట్టుపై గెలుపొందడంతో వరుసగా ఐదో మ్యాచ్‌లో జట్టును గెలుపొందడంలో కీలక పాత్ర పోషించినందుకు ర్యాంకుల్లో మూడోస్థానంలో నిలిచాడు. సెవిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్ సాధించి ప్రస్తుత సీజన్‌లో సెల్టా విగోస్ జట్టు ప్లేయర్ ఇగో ఆస్పాస్ 19 గోల్స్ కొట్టినందుకు టాపర్స్‌లో ఐదవ ర్యాంక్ పొందాడు.

రైట్ బ్యాక్ ప్లేయర్ అరిట్జ్ ఎలుస్టోండో..

రైట్ బ్యాక్ ప్లేయర్ అరిట్జ్ ఎలుస్టోండో..

రైట్ బ్యాక్ ప్లేయర్ అరిట్జ్ ఎలుస్టోండో..గిరోనా జట్టుపై జరిగిన మ్యాచ్‌లో 5 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించినందుకు.. అసాధారణ ప్రతిభ కనబరిచినందుకు టాప్ - 7 ర్యాంక్ పొందాడు. డెపొర్టివో ఫార్వర్డ్ ఆడరియన్ కూడా టాప్ - 10లో నిలిచాడు. మలాగా జట్టుపై జరిగిన మ్యాచ్‌లో డబుల్ గోల్స్ చేసినందుకు టాపర్స్ లో కొనసాగాడు.

బెటిస్ మిడ్ ఫీల్డర్

బెటిస్ మిడ్ ఫీల్డర్

మరోవైపు రియల్ బెటిస్ మిడ్ ఫీల్డర్ మార్క్ బార్ట్రా మాత్రం ఈబార్ జట్టుకు వ్యతిరేకంగా జరిగిన గేమ్‌లో 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించినా టాప్ 10 ర్యాంకులో నిలదొక్కుకున్నాడు. గత ఐదు లా లీగా మ్యాచ్‌ల్లో ఆయా జట్లకు చెందిన కీలక ఆటగాళ్ల ప్రతిభను బట్టి పాయింట్లు ఖరారు చేస్తారు. వారం వారం కేటాయించే పాయింట్లు, వాటితోపాటు ఏడాది పొడవునా ఆటగాడి ప్రతిభా పాటవాల ఆధారంగా పాయింట్లు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

Story first published: Thursday, April 12, 2018, 12:54 [IST]
Other articles published on Apr 12, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి